Manorathangal Web Series: ఓటీటీ చరిత్రలో పెను సంచలనం.. సౌత్‌ లెజెండ్స్‌తో రాబోతున్న తొలి సిరీస్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Manorathangal Web Series: ఓటీటీ చరిత్రలో పెను సంచలనం.. సౌత్‌ లెజెండ్స్‌తో రాబోతున్న తొలి సిరీస్‌!

    Manorathangal Web Series: ఓటీటీ చరిత్రలో పెను సంచలనం.. సౌత్‌ లెజెండ్స్‌తో రాబోతున్న తొలి సిరీస్‌!

    July 16, 2024

    ప్రస్తుత ఓటీటీ యుగంలో వెబ్‌సిరీస్‌లకు ఎంతగానో క్రేజ్‌ ఏర్పడింది. ఒక కంటెంట్‌ను పూర్తి స్థాయిలో ఆస్వాదించాలని భావించేవారు ఎక్కువగా సిరీస్‌ల వైపే మెుగ్గు చూపుతున్నారు. ఇది గమనించిన స్టార్ హీరోలు సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే సుదీర్ఘంగా సాగే వెబ్‌ సిరీస్‌లు మల్టీస్టార్స్‌తో రావడం ఇటీవల కాలంలో సాధారణంగా మారిపోయింది. అయితే ఈసారి ఓ స్పెషల్‌ వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తమిళం, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన స్టార్‌ హీరోలు, సెలబ్రిటీలు ఈ సిరీస్‌లో కలిసి నటించారు. దీంతో ఒక్కసారిగా సినీ ప్రేక్షకుల దృష్టి ఈ సిరీస్‌పై పడింది. 

    ‘మనోరథంగల్‌’ సిరీస్‌..

    మలయాళం స్టార్ రైటర్ MT వాసుదేవర్ నాయర్ రాసిన కథతో  ‘మనోరథంగల్‌’ (Manorathangal Web Series) అనే సిరీస్‌ రూపొందుతోంది. ఈ ఆంథాలజీ సిరీస్‌లో 9 కథలను చూపించనున్నారు. ఇందులో తమిళ, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన స్టార్‌ హీరోలు కమల్‌ హాసన్‌ (Kamal Haasan), మోహన్‌ లాల్‌ (Mohan Lal), మమ్ముట్టి (Mammootty), ఫహాద్ ఫాజిల్‌ (Fahadh Faasil) నటించారు. అలాగే పార్వతి తిరువొతు (Parvathy Thiruvothu). బిజు మీనన్ (Biju Menon), నదియా (Nadia), నెడుముడి వేణు (Nedumudi Venu), సురభి లక్ష్మి (Surabhi Lakshmi), అపర్ణ బాలమురళి (Aparna Balamurali) ఇలా చాలామంది ప్రముఖ తమిళ, మలయాళం నటీనటులు నటించారు. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ కాగా ప్రస్తుతం అది విశేషంగా ఆకట్టుకుంటోంది. 

    రిలీజ్‌ ఎప్పుడంటే?

    ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ 5’లో ఈ ఆంథాలజీ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15 నుంచి ఈ సిరీస్ ప్రసారంలోకి రానుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు. ‘మనోరథంగల్‌’లో 9 ఎపిసోడ్స్‌ ఉండగా వాటిని 8 మంది దర్శకులు తెరకెక్కించడం విశేషం. ఒల్లవం తీరవుం, శిలాలిఖతం అనే తొలి రెండు ఎపిసోడ్స్‌ని ప్రియదర్శన్ రూపొందించారు. కడుగన్నవ ఓరు యాత్ర ఎపిసోడ్‌ను రంజిత్, కలఛా – శ్యామ్ ప్రసాద్, విల్పన – అస్వతి వి. నైర్, షెర్లాక్ – మహేష్ నారాయణన్, స్వర్గం తురుక్కున సమయం – జయరంజన్ నైర్, అభయం తేడి వెండమ్ – సంతోష్ శివన్ తెరకెక్కించారట. ఇక ఫైనల్ ఎపిసోడ్‌ కాదల్ కట్టును రితేష్ అంబట్‌ డైరెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. 

    కొత్త ట్రెండ్‌!

    ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లలో కొత్త ట్రెండ్‌ మెుదలైనట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు ఒకరిద్దరు స్టార్‌ నటులను పెట్టుకొని సిరీస్‌లను రూపొందించేవారు. ఇప్పుడు మల్టీ స్టార్స్‌తో సిరీస్‌లు నిర్మించేందుకు దర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘హీరామండి’ (Heeramandi) సిరీస్‌ను గమనిస్తే ఇదే విషయం అర్థమవుతోంది. ప్రముఖ బాలీవుడ్‌ డైరెక్టర్‌ సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన ఈ సిరీస్‌లో మనీషా కోయిరాల (Manisha Koirala), సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), అదితిరావు హైదరి (Aditi Rao Hydari), రిచా చద్ధా (Richa Chadha), సంజీదా షేక్‌ (Sanjeeda Sheikh) వంటి స్టార్‌ హీరోయిన్స్‌ నటించారు. అంతకుముందు వచ్చిన ‘ఇండియన్‌ పోలీసు ఫోర్స్‌’ (Indian Police Force) సిరీస్‌లోనూ సిద్ధార్థ్‌ మల్హోత్ర, వివేక్ ఒబరాయ్‌, శిల్పా శెట్టి, ఇషా తల్వార్‌ వంటి స్టార్‌ నటులు చేశారు. దీన్ని బట్టి చూస్తే వెబ్‌సిరీస్‌లలో కొత్త ఒరవడి మెుదలైనట్లు కనిపిస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version