Mufasa: The Lion King Review: మహేష్‌ ప్రాసలు, పంచ్‌లు అదరహో.. ‘ముఫాసా’ ఎలా ఉందంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mufasa: The Lion King Review: మహేష్‌ ప్రాసలు, పంచ్‌లు అదరహో.. ‘ముఫాసా’ ఎలా ఉందంటే?

    Mufasa: The Lion King Review: మహేష్‌ ప్రాసలు, పంచ్‌లు అదరహో.. ‘ముఫాసా’ ఎలా ఉందంటే?

    December 20, 2024

    నటులు: మహేష్‌ బాబు, సత్యదేవ్‌, బ్రహ్మానందం, అలీ (డబ్బింగ్ చెప్పినవారు)

    దర్శకత్వం: బబ్యారీ జెన్ కిన్స్

    సినిమాటోగ్రఫీ: జేమ్స్‌ లక్ట్సాన్‌

    ఎడిటింగ్‌: జోయ్‌ మెక్‌మిలన్‌

    సంగీతం: డేవ్‌ మెట్జర్‌, నికోలక్‌ బ్రిటెల్‌, లిన్‌ మాన్యుల్‌ మిరాండ

    నిర్మాతలు: అడెలె రొమన్‌స్కీ, మార్క్‌ కారియాక్‌

    నిర్మాణ సంస్థ: డిస్నీ

    విడుదల: డిసెంబర్‌ 20, 2024 

    హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King Review In Telugu) ఒకటి. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు తెలుగులో మహేష్‌బాబు (Mahesh babu) డబ్బింగ్‌ చెప్పాడు. అలాగే సత్యదేవ్‌, బ్రహ్మానందం, అలీ వంటి స్టార్స్‌ కూడా పలు తమ స్వరాన్ని అందించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా ఈనెల 20న ఇంగ్లీషుతో పాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? మహేష్‌ డబ్బింగ్‌ ఆకట్టుకుందా? యానిమేషన్‌ వర్స్క్‌ మెప్పించాయా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    ముఫాసా (మహేష్ బాబు వాయిస్ ఓవర్) చిన్నతనంలో అమ్మ చెప్పిన కథలు వింటూ పెరుగుతాడు. ‌దూరంగా ఉండే మిలేలే అనే స్వర్గం లాంటి రాజ్యం గురించి తరచూ వింటూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓరోజు వరదల రావడంతో ముఫాసా కొట్టుకుపోతాడు. అలా టాకా (సత్యదేవ్‌ వాయిస్‌ ఓవర్‌) ఉన్న రాజ్యానికి వస్తాడు. ముఫాసా రాకను టాకా తండ్రి ఒప్పుకోడు. కానీ టాకా తన అన్నలా పెంచుకుందామని పట్టుబడతాడు. టాకా తల్లి కూడా సపోర్ట్ చేయడంతో ముఫాసా వారి ఫ్యామిలీలో భాగమవుతాడు. ఓ రోజు టాకా తల్లిపై తెల్ల సింహాలు దాడి చేయగా ముఫాసా ధైర్యంగా ఎదుర్కొంటాడు. తెల్ల సింహాల యువరాజును చంపేస్తాడు. అది తెలిసిన తెల్ల సింహాల రాజు కిరోస్‌ ముఫాసా ఉంటున్న రాజ్యంపై దాడి చేస్తాడు. ఆ దాడి నుంచి తప్పించుకొని ముఫాసా, టాకాలు చిన్నప్పుడు విన్న మిలేలే రాజ్యం వైపు పయనమవుతారు. ఈ ప్రయాణంలో వాటికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ముఫాసాను చంపడానికి కిరోస్‌ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ముఫాసాకు టాకా ఎందుకు ఎదురు తిరిగాడు? చివరకూ ముఫాసా ఎలా రాజయ్యాడు? అన్నది స్టోరీ. 

    డబ్బింగ్‌ ఎలా ఉందంటే

    ముఫాసా: ది లయన్‌ కింగ్‌ (Mufasa: The Lion King Review) లైవ్‌ యానిమేషన్‌ చిత్రం. ఇందులో నటీనటులు కనిపించరు వారు చెప్పిన వాయిస్‌ మాత్రమే వినిపిస్తుంది. డబ్బింగ్‌ గురించి మాట్లాడాల్సి వస్తే తెలుగులో ముఫాసా పాత్రకు మహేష్ వాయిస్ ఓవర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఫాసా పాత్రకు మహేష్‌ డబ్బింగ్‌ బాగా సెట్ అయ్యింది. తెరపై సింహాం ప్లేస్‌లో మహేష్‌ను ఊహించుకునేంతలా అతడు తన వాయిస్‌తో మెస్మరైజ్‌ చేశాడు. సెటైర్లు, పంచ్‌లు, గంభీరమైన డైలాగ్స్‌తో మహేష్ అదరగొట్టాడు. టాకా పాత్రకు నటుడు సత్యదేవ్‌ వాయిస్‌ బాగా సెట్‌ అయ్యింది. మంచి సోదరుడిగా, ఆ తర్వాత విలన్లతో చేతులు కలిపిన వెన్నుపోటు దారుడిగా వాయిస్‌లో మంచి వేరియేషన్స్‌ ప్రదర్శించాడు. అటు పుంబా పాత్రకు బ్రహ్మీ డబ్బింగ్‌ చెప్పగా, టిమోన్‌ రోల్‌కు అలీ గాత్ర దానం చేశారు. వారిద్దరు తమ వాయిస్‌తో కామెడీని బాగా పండించారు. మిగిలిన పాత్రలకు డబ్బింగ్‌ చెప్పినవారు కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    2019లో వచ్చిన ‘ది లయన్‌ కింగ్‌’ చిత్రానికి ప్రీక్వెల్‌గా దర్శకుడు బ్యారీ జెన్ కిన్స్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అందులో ముఫాసా రాజు కాగా అతడి కొడుకు సింబా చుట్టూ కథ తిరిగింది. తాజా చిత్రంలో ముఫాసా ఎలా రాజు అయ్యాడు? టాకా అలియాస్‌ స్కార్‌ ఎవరు? అనేది చూపించాడు. స్టోరీ పరంగా చూస్తే పెద్దగా మెరుపులు కనిపించవు. కానీ విజువల్స్‌, స్క్రీన్ ప్లే పరంగా ఆడియన్స్‌లో ఆసక్తి రగిలించాడు దర్శకుడు. ముఖ్యంగా మిలేలే అనే స్వర్గం లాంటి ప్రపంచంలో ప్రేక్షకులను లీనం చేయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా బాగున్నాయి. ముఫాసా, టాకా సోదరుల కథ ప్రస్తుత సమాజాన్ని అద్దం పట్టేలా ఉండటం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. అయితే రొటీన్‌ స్టోరీ, ఊహాజనీతమైన కథనం మైనస్‌గా చెప్పవచ్చు. పెద్దలు, మాస్‌ ఆడియన్స్‌ సంగతి ఏమోగానీ, చిన్నారులకు మాత్రం ముఫాసా పక్కా ఎంటర్‌టైన్‌ చేస్తుందని చెప్పవచ్చు. రెండున్నర గంటల పాటు కొత్త ప్రపంచంలోకి వెళ్లి వస్తారు. 

    టెక్నికల్‌గా.. 

    టెక్నికల్‌గా హాలీవుడ్ స్టాండర్డ్స్ (Mufasa: The Lion King Review) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ నెక్స్ట్‌ లెవల్లో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్‌ డిపార్ట్‌మెంట్‌ టాప్‌ నాచ్‌ పనితీరు కనబరిచింది. నిజమైన సింహాలను తెరపై చూస్తున్నట్లుగా భ్రమను కల్పించడంలో వారు పూర్తిగా సక్సెస్‌ అయ్యారు. నిర్మాణ విలువలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో డిస్నీ ఎక్కడా రాజీపడలేదు. చాలా నాణ్యమైన గ్రాఫిక్స్‌ను అందించారు. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • మహేష్‌బాబు డబ్బింగ్‌
    • గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్‌ మాయజాలం
    • సంగీతం, సినిమాటోగ్రఫీ

    మైనస్‌ పాయింట్స్‌

    • ఊహాజనితంగా సాగే కథనం
    • ట్విస్టులు లేకపోవడం
    Telugu.yousay.tv Rating : 3/5 
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version