OTT Releases This Week Telugu: ఈ వీకెండ్‌ ఓటీటీలో ఏం చూడాలని ఆలోచిస్తూన్నారా? ఇది మీకోసమే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OTT Releases This Week Telugu: ఈ వీకెండ్‌ ఓటీటీలో ఏం చూడాలని ఆలోచిస్తూన్నారా? ఇది మీకోసమే!

    OTT Releases This Week Telugu: ఈ వీకెండ్‌ ఓటీటీలో ఏం చూడాలని ఆలోచిస్తూన్నారా? ఇది మీకోసమే!

    August 1, 2024

    ఓటీటీలో కొత్త సినిమాలు చూడాలనుకునేవారికి ఈ వారం పండగే అని చెప్పవచ్చు. పలు కొత్త తెలుగు చిత్రాలు ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. అలాగే డబ్బింగ్‌ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సైతం మిమ్మల్ని తెలుగులో అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు / సిరీస్‌లు ఏవి? వాటి ప్లాట్‌ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్‌ కానున్నాయి? వంటి విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. 

    రక్షణ (Rakshana)

    హీరోయిన్ పాయల్ రాజ్‍పుత్ పోలీసు ఆఫీసర్‌గా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘రక్షణ’ (Rakshana). ఈ ఏడాది జూన్‌ 7న థియేటర్లలో రిలీజ్‌ అయింది. తాజాగా ఆగస్టు 1 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. రక్షణ చిత్రానికి ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి నిర్మాత కూడా ఆయనే. ప్లాట్ ఏంటంటే ‘కిరణ్‌ (పాయల్‌) ఐపీఎస్‌ ట్రైనింగ్‌లో ఉండగా ఆమె స్నేహితురాలు సుసైడ్‌ చేసుకుంటుంది. ఏసీపీగా ఛార్జ్‌ తీసుకున్న తర్వాత అరుణ్‌ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో అరుణ్‌ సుసైడ్‌ చేసుకోవడంతో కిరణ్‌ సస్పెండ్‌ అవుతుంది. మరోవైపు వరుసగా యువతులు సుసైడ్‌ చేసుకుంటూ ఉంటారు. ఇందుకు కారణం ఎవరు? ఆ కేసును కిరణ్‌ ఎలా సాల్వ్‌ చేసింది?’ అన్నది స్టోరీ.

    డియర్‌ నాన్న (Dear Nanna)

    ఫాదర్‌ అండ్‌ సన్‌ సెంటిమెంట్‌తో రూపొందిన చిత్రం ‘డియర్‌ నాన్న‘. చైతన్య రావు, సీనియర్‌ నటుడు సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. అంజి సలాది దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ వారం మరో ఓటీటీలోకి వచ్చింది. జూన్‌ 14న ‘ఆహా’ (Aha)లో విడుదలైన ఈ చిత్రం తాజాగా ‘ఈటీవీ విన్‌’లోనూ ఆగస్టు 1 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్‌ ఏంటంటే ‘కరోనా బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో ఓ తండ్రి కొడుకుల మధ్య సాగిన ఎమోషనల్ సీక్వెన్స్ ఈ సినిమా. చెఫ్ కావాలని కలలు కనే చైతన్యరావు జీవితంలో కోవిడ్ ఎలాంటి ప్రభావం చూపింది? ఆ టైంలో మెడికల్ షాపుల ప్రాధాన్యత, ఆ షాపుల యజమానులు చేసిన త్యాగాలు ఏంటి?’ అన్నది స్టోరీ.

    తెప్ప సముద్రం (Theppa Samudram)

    బిగ్‌ బాస్‌ ఫేమ్ అర్జున్‌ అంబటి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘తెప్ప సముద్రం‘. కిశోరి ధాత్రక్ కథానాయిక, రవిశంకర్‌, చైతన్యరావు ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆగస్టు 3 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. ప్లాట్ ఏంటంటే ‘తెప్ప సముద్రం అనే గ్రామంలో స్కూల్‌ పిల్లలు మాయమవుతుంటారు. దీనిని కనిపెట్టేందుకు ఎస్సై గణేష్‌ (చైతన్య రావు) రంగంలోకి దిగుతాడు. మరోవైపు రిపోర్టర్‌ ఇందు (కిశోరి ధాత్రిక్‌), ఆటో డ్రైవర్‌ విజయ్‌ (అంబటి అర్జున్‌) కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తుంటారు. ఈ క్రమంలో వారికి విస్తుపోయే నిజాలు తెలుస్తాయి? ఆ వాస్తవాలు ఏంటి? గణేష్‌ ఈ కేసును ఎలా ఛేదించాడు? అన్నది స్టోరీ. 

    కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ (Kingdom of the Planet of the Apes)

    ఈ వీకెండ్‌లో మంచి హాలీవుడ్‌ చిత్రాన్ని చూడాలనుకునే వారికి ‘కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్’ బెస్ట్ ఛాయిస్‌ అని చెప్పవచ్చు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఆగస్టు 2 నుంచి ఇంగ్లీషుతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్లాట్‌ ఏంటంటే ‘ఏప్స్‌ను పాలిస్తున్న ప్రాక్సిమస్‌ సీజర్‌.. మనుషులను అంతం చేయాలనుకుంటుంది. ఈ క్రమంలో నోవా అనే యువతిని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో సీజర్‌ సంతతికి చెందిన చింపాజీ వచ్చి అడ్డుకుంటుంది. ఈ చర్యతో ఆగ్రహించిన ప్రాక్సిమస్‌ సీజర్‌.. నోవా, చింపాజీతో ఎలాంటి పోరాటం చేసింది? ప్రాక్సిమస్‌ను వారు కలిసికట్టుగా ఎలా ఎదుర్కొన్నారు? అన్నది కథ.

    బృందా (Brinda)

    సినిమాలతో పాటు కొత్త వెబ్‌ సిరీస్‌లు సైతం ఈ వీకెండ్‌లో మిమ్మిల్ని ఎంటర్‌టైన్‌ చేేసేందుకు రెడీ అవుతున్నాయి. స్టార్‌ హీరోయిన్‌ త్రిష కెరీర్‌లో తొలిసారి నటించిన వెబ్‌ సిరీస్‌ ‘బృందా‘  ఈ వీకెండ్‌ ఓటీటీలోకి రాబోతోంది. ఆగస్టు 2 నుంచి సోనీ లీవ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవ్వనుంది. పోలీసు ఆఫీసర్‌గా త్రిష ఈ సిరీస్‌లో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులో జయప్రకాశ్‌, రవీంద్ర విజయ్‌, ఇంద్రజిత్‌ సుకుమారన్‌ , ఆమని ముఖ్యమైన పాత్రలు పోషించారు. 

    డ్యూన్ 2 (Dune 2)

    ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో అద్భుతమైన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ఈ వారం సిద్దమైంది. రూ.1500 కోట్లతో రూపొందిన ‘డ్యూన్‌ 2‘ చిత్రం ఈ ఏడాది మార్చి 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై దాదాపు రూ.4000 కోట్లు కొల్లగొట్టింది. తాజాగా జియో సినిమా వేదికగా తెలుగులో ఈ చిత్రం స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘తండ్రిని కోల్పోయిన తర్వాత శత్రువుల నుంచి పాల్ అట్రీడియస్ తప్పించుకొని తల్లితో పాటు అరాకిస్‌ గ్రహానికి పారిపోతాడు. కొన్ని పరిణామాలతో అక్కడి ఫ్రెమెన్‌ తెగకు రక్షకుడిగా మారతాడు. ఆ తెగకు హార్కొనెన్‌ తెగ నుంచి ముప్పు ఎదురవుతుంది. తన తండ్రిని చంపింది ఆ తెగకు చెందిన వారేనన్న నిజం పాల్‌కు తెలుస్తుంది. అప్పుడు అతడు ఏం చేశాడు? ఎలా రీవేంజ్‌ తీర్చుకున్నాడు?’ అన్నది స్టోరీ. 

    టర్బో (Turbo)

    మలయాళ స్టార్‌ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ చిత్రం ‘టర్బో’ (Turbo). విశాఖ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 2 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. ప్లాట్‌ ఏంటంటే ‘ టర్బో జోస్‌ (మమ్ముట్టి) ఓ జీప్‌ డ్రైవర్‌. స్నేహితుడు జెర్రీ ప్రేమను గెలిపించే క్రమంలో ఓ యువతిని ఎత్తుకొస్తాడు. పోలీసులు కేసు పెట్టడంతో చెన్నైకి పారిపోతాడు. కట్ చేస్తే జెర్రీని ఓ గ్యాంగ్‌స్టర్‌ మనుషులు హత్య చేస్తారు. అతడి ప్రేయసిని చంపేందుకు యత్నిస్తారు. ఆమెను జోస్‌ ఎలా కాపాడాడు? జెర్రీని ఆ గ్యాంగ్‌ ఎందుకు చంపింది? స్నేహితుడి చావుకు జోస్‌ ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడు? అన్నది స్టోరీ. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version