ప్రముఖ ఓటీటీ వేదికలు కూడా ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. అయితే ఈ వారంతం కంటెంట్ పరంగా తెలుగు ప్రేక్షకులకు ది బెస్ట్ అని చెప్పవచ్చు. థియేటర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన పలు చిత్రాలు ఈ వారం ఓటీటీలోకి వచ్చేశాయి. మరికొన్ని రాబోతున్నాయి. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్‌లో ప్లాన్ చేసుకోండి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్ ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం. (OTT Suggestions)
క (Ka)
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రం ‘క‘ (Ka OTT Release) బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అతడి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ చిత్రం వారమే (This Week Telugu Movies) ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్ వేదికగా నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా చేశారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్లాట్ ఏంటంటే ‘అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది. చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు?’ అనేది మిగతా కథ.
లక్కీ భాస్కర్ (Lucky Baskhar)
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar OTT Release) సైతం ఈ వారమే ఓటీటీలోకి వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వీక్షించవచ్చు. దీపావళి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దుల్కర్ కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఫస్ట్ ఫిల్మ్‌గా లక్కీ భాస్కర్ నిలిచింది. ప్లాట్ ఏంటంటే ‘భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు?’ అనేది కథ.
వికటకవి (Vikkatakavi)
యువ నటుడు నరేష్ అగస్త్య (Naresh Agastya) ‘మత్తు వదలరా’, ‘సేనాపతి’, ‘పంచతంత్రం’ చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు అతడు చేసిన లేటెస్ట్ సిరీస్ ‘వికటకవి’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మేఘా ఆకాష్ (Megha Akash) హీరోయిన్‌గా చేసింది. షిజు అబ్దుల్ రషీద్, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, అమిత్ తివారి, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు చేశారు. జీ5 ఓటీటీలో తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘అమరగిరి ఊరిలోని దేవతల గుట్ట (కొండ)కు వెళ్లిన ప్రజలు గతం మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం వల్లే అలా జరుగుతున్నట్లు వారు నమ్ముతుంటారు. ఈ మిస్టరీని కనుగొనేందుకు డిటెక్టివ్ రామకృష్ణ రంగంలోకి దిగుతాడు. దేవతల గుట్టపైకి వెళ్తాడు. అక్కడ ఏం తెలుకున్నాడు? అమరగిరి సంస్థానానికి చెందిన లక్ష్మీ (మేఘా ఆకాష్)తో అతడికి పరిచయం ఎలా ఏర్పడింది? ఇంతకీ దేవతల గుట్టకు ఉన్న శాపం ఏంటి?’ అన్నది స్టోరీ.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (Appudo Ippudo Eppudo)
యంగ్ హీరో నిఖిల్ (Nikhil) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo). సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిఖిల్ సరసన రుక్మిణీ వసంత్, దివ్యాంశ కౌశిక్ నటించారు. ఈ సినిమా ఇటీవలే థియేటర్‌లోకి వచ్చి యూత్‌ను ఆకర్షించింది. ఈ వారమే సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘హైదరాబాద్‌కు చెందిన రిషి (నిఖిల్) తొలి చూపులోనే తార (రుక్మిణి వసంత్)ను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల లవ్ ఫెయిల్యూర్ కావడంతో లండన్‌కు వెళ్లిపోతాడు. అక్కడ రేసర్‌గా ట్రైనింగ్ తీసుకుంటూ పాకెట్ మనీ కోసం చిన్నపాటి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో అక్కడ పరిచయమైన తులసి (దివ్యాంశ కౌశిక్)కి రిషి దగ్గరవుతాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న టైమ్‌లో సడెన్‌గా తులసి మిస్ అవుతుంది. అదే సమయంలో తార లండన్‌లో ప్రత్యక్షమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? లోకల్ డాన్‌తో రిషికి వచ్చి తలనొప్పులు ఏంటి? అన్నది స్టోరీ.
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి (Thappinchuku Thiruguvadu Dhanyudu Sumathi)
హాస్య నటుడు ప్రియదర్శి (Priyadarsi) ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి‘. ఆయనతో పాటు శ్రీద, మణికంఠ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా (OTT Suggestions) నేరుగా ఓటీటీలోకి రాబోతోంది. నవంబర్ 29 నుంచి ఆహా వేదికగా ఈ సినిమాను వీక్షించవచ్చు. ఓ బ్యాంక్ దోపిడి నేపథ్యంలో కథ సాగనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఒక దొంగ కొట్టేసిన డబ్బు ఎంత మంది చేతులు మారింది? దానిని దక్కించుకునేందుకు ఎంత మంది యత్నించారు? ఫైనల్‌గా ఎవరి వద్దకు ఆ డబ్బు చేరింది? అన్నది స్టోరీ.
నారదన్ (Naradan)
మలయాళ నటుడు టొవినో థామస్ (Tovino Thomas) నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘నారదన్’. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha)లో నవంబర్ 29 నుంచి తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు ఆషిబ్ అబు ఈ సినిమాని (OTT Suggestions) తెరకెక్కించారు. అన్నా బెన్ (Anna Ben) హీరోయిన్‌గా చేసింది. ప్లాట్ ఏంటంటే ‘ఛానల్ రేటింగ్స్ పెంచేందుకు జర్నలిస్టుగా అప్పుడే కెరీర్ ప్రారంభించిన హీరో ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొన్నాడు? ఓ రాజకీయ నాయకుడిని కలిసిన అనంతరం అతడి జీవితంలో వచ్చిన మార్పులేంటి?’ అన్నది స్టోరీ.
బ్లడీ బెగ్గర్ (Bloody Beggar)
కోలీవుడ్‌లో దాదా, స్టార్ వంటి సినిమాలతో పాపులర్ అయిన కవిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం బ్లడీ బెగ్గర్. దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ తెరకెక్కించిన చిత్రం దీపావళి సందర్భంగా తమిళ్‌లో విడుదలైంది. అక్కడ మంచి విజయం సాధించడంతో నవంబన్ 7న తెలుగులో కూడా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. కాగా, ఈ చిత్రం నవంబర్ 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. ప్లాట్ ఏంటంటే ‘ఒక లేజీ వ్యక్తి కాళ్లు లేవని జనాలను నమ్మిస్తూ అడుక్కొని డబ్బు సంపాదిస్తుంటాడు. అలా సాఫీగా లైఫ్‌ను నెట్టుకొస్తున్న ఆ బెగ్గర్ కొన్ని నాటకీయ పరిణామాల వల్ల ఇంద్ర భవనం లాంటి భవంతిలోకి అడుగుపెడతాడు. దీంతో అతడి లైఫ్ ఊహించని మలుపు తిరుగుతుంది. అక్కడ ఆ బెగ్గర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటి నుంచి ఎలా బయటపడ్డాడు?’ అన్నది స్టోరీ.
సందేహాం (Sandeham)
హెబ్బా పటేల్ నటించిన ‘సందేహం’ (OTT Suggestions) మూవీ 5నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. జూన్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సుమన్ వూట్కుర్ డ్యూయల్ రోల్స్ చేశాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌లో నవంబర్ 28 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘కరోనా టైమ్‌లో హర్ష, శ్రుతి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అచ్చం హర్షలాగే ఉండే శ్రుతి మాజీ లవర్ ఆర్య వారి జీవితంలోకి వస్తాడు. వారిద్దరి ఇబ్బంది పెడుతుంటాడు. ఈ క్రమంలో కరోనా సోకి హర్ష చనిపోతాడు. అసలు హర్ష నిజంగానే చనిపోయాడా? పోలీసులు శ్రుతిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆర్య ఏమయ్యాడు?’ అన్నది స్టోరీ.
బఘీరా (Bagheera)
ఇదిలా ఉంటే గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. అవి ఇప్పటివరకూ చూడకుండా ఉంటే ఈ వీకెండ్‌తో ఎంచక్కా చూసేయండి. శ్రీమురళి (Sriimurali), రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) ప్రధాన పాత్రల్లో దర్శకుడు డాక్టర్ సూరి తెరకెక్కించిన ‘బఘీర’ (Bagheera) లాస్ట్ వీక్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘వేదాంత్ ప్రభాకర్(శ్రీ మురళి) తన బాల్యం నుంచి అందరికీ సహాయపడే ఓ సూపర్ హీరో కావాలని కలలు కంటాడు. కానీ తన తల్లి మాటలతో ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారిగా ఉద్యోంగ చేస్తాడు. అతని హయాంలో మంగళూరులో క్రైమ్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది. ఒక సిన్సియర్ ఆఫీసర్‌గా కొనసాగుతున్న వేదాంత్ జీవితంలో జరిగిన ఎమోషనల్ టర్నింగ్ ఏంటి? ఎంతో నిజాయితీగా ఉండే తాను ఎందుకు అవినీతి అధికారిగా మారుతాడు? అతు బఘీరగా మారేందుకు దారితీసిన అంశాలు ఏమిటి? అవయవ రవాణా చేస్తున్న రానా(గరుడ రామ్)ను ఎలా ఎదుర్కొన్నాడు?’ అనేది మిగతా కథ.
మార్టిన్ (Martin)
ధృవ సర్జా (Dhruva Sarja), వైభవి శాండిల్య (Vaibhavi Sandilya) నటించిన చిత్రం ‘మార్టిన్’ (Martin). ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ గతవారమే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ ఆహాలో నవంబర్ 19 నుంచి తెలుగులో ప్రసారం అవుతోంది. మరో ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లోనూ తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ఈ సినిమా ప్రసారం అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘భారత్‌కు చెందిన అర్జున్ పాకిస్తాన్‌లో అరెస్టు అవుతాడు. అక్కడి నుంచి తప్పించుకున్న అర్జున్‌కి తను జైలుకు వెళ్లడానికి కారణం మార్టిన్ అని తెలుస్తుంది. అసలు మార్టిన్ ఎవరు? అర్జున్‌ను ఎందుకు టార్గెట్ చేశాడు? అసలు అర్జున్ పాక్‌కు ఎందుకు వెళ్లాడు?’ అన్నది స్టోరీ.
కిష్కింద కాండం (Kishkindha Kaandam)
అసీఫ్ అలీ (Asif Ali), అపర్ణ బాలమురళి (Aparna Balamurali) జంటగా చేసిన ఈ మలయాళ చిత్రం ‘కిష్కింద కాండం’ గతవారం ఓటీటీలోకి వచ్చింది. నవంబర్ 19 నుంచి హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘అపర్ణ (అపర్ణ బాలమురళి), అజయ్ (ఆసిఫ్ అలీ) ప్రేమించి పెళ్లిచేసుకుంటారు. అజయ్ తండ్రి అప్పు పిళ్లై ఓ రిటైర్డ్ ఆర్మీ మేజర్. ఓ రోజు అతడి గన్ మిస్సవుతుంది. ఆ గన్ గురించి ఎంక్వైరీ చేసే క్రమంలో అపర్ణకు అనూహ్య విషయాలు తెలుస్తాయి. అసలు అప్పు పిల్లై గతం ఏంటి? అతడి భార్య, రెండో కుమారుడు ఎలా కనిపించకుండా పోయారు? వారి మిస్సింగ్‌కు అజయ్‌కు ఏమైనా సంబంధం ఉందా?’ అన్నది స్టోరీ.
ఏలియన్: రొములున్ (Alien: Romulus)
హాలీవుడ్ చిత్రాలను ఇష్టపడే వారికోసం గతవారం అదిరిపోయే సైన్స్ ఫిక్షన్ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన ఏలియన్: రొములస్ చిత్రం తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. నవంబర్ 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీషుతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘అంతరిక్ష వలసదారులు ఓ పాడుబడిన స్పేస్ స్టేషన్ నుంచితమకు పనికి వచ్చే వస్తువులను సేకరిస్తుంటారు. ఆ సమయంలో విశ్వంలోని ఓ ఏలియన్స్ వింత జీవి రూపంలో వాళ్లపై దాడి చేస్తాయి. వాటి నుంచి వారు తప్పించుకున్నారా? లేదా?’ అన్నది స్టోరీ.
త్వరలో ఓటీటీలోకి రానున్న చిత్రాలు, సిరీస్‌లు..
Title | Category | Language | Platform | Release Date |
Amaran | Movie | Telugu Dub | Netflix | Dec 11 |
Squid Games S2 | Series | Telugu Dub | Netflix | Dec 26 |
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’