Rashmika Mandanna: బాగానే మెనేజ్ చేశారు.. కానీ ఇలా దొరికిపోయారు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rashmika Mandanna: బాగానే మెనేజ్ చేశారు.. కానీ ఇలా దొరికిపోయారు!

    Rashmika Mandanna: బాగానే మెనేజ్ చేశారు.. కానీ ఇలా దొరికిపోయారు!

    December 24, 2024

    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు డేటింగ్, డిన్నర్లు అంటూ తెగ తిరిగేస్తున్నారని పెద్ద ఎత్తువ కథనాలు సైతం వచ్చాయి. తాము కేవలం స్నేహితులమని ఇద్దరూ చెప్పినా తరచూ టూర్లు, రెస్టారెంట్స్‌లో దర్శనమివ్వడంతో ఎవరూ నమ్మడం లేదు. ఈ క్రమంలో తాజాగా మారుమారు ఈ జంట కెమెరాలకు చిక్కింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

    విడివిడిగా వచ్చినా.. దొరికేశారు!

    స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న జంటగా ఎక్కడ కనిపించినా వెంటనే కెమెరాలు వారి మీదకి వెళ్లిపోతాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ స్టార్స్‌ ఇద్దరూ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. సోమవారం రాత్రి విమానశ్రయంలో విజయ్‌ కనిపించగా.. కొద్దిసేపటి తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా రష్మిక కూడా వచ్చింది. రష్మిక ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన సమయంలో ఆమె చేతిలో ఎల్లో కలర్‌ క్యాప్‌ ఉంది. అంతకుముందు విజయ్‌ తలకు బ్లాక్‌ కలర్‌ క్యాప్‌ పెట్టుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరి దగ్గర ఉన్న క్యాప్స్‌ చేతులు మారడం గమనించవచ్చు. విజయ్‌ తలపైకి ఎల్లో క్యాప్‌ రాగా, రష్మిక హెడ్‌ పైకి బ్లాక్‌ క్యాప్‌ వచ్చింది. దీంతో ఇద్దరూ విడివిడిగానే కనిపించినా క్యాప్‌ మాత్రం వారు జంటగా వచ్చారని ఇరికించేసింది. కాగా, క్రిస్మస్‌, న్యూయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా వారు విదేశాలకు వెళ్లబోతున్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

    అనుమానాలు మరింత బలోపేతం

    గత కొద్దిరోజులుగా విజయ్‌రష్మిక ప్రేమ గాసిప్ తెగ చర్చకు వస్తోంది. వీరిద్దరు ఏ ఈవెంట్‌లో పాల్గొన్నా ప్రేమ, డేటింగ్‌కు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. అయితే వీరిద్దరు ఇప్పటివరకూ తమ లవ్‌ను ధ్రువీకరించలేదు. తాజాగా ఎయిర్‌పోర్టు వీడియోలు బయటకు రావడంతో వారి రిలేషన్‌పై అనుమానాలు మరింత బలపడ్డాయని చెప్పవచ్చు. వారిద్దరు కచ్చితంగా రిలేషన్‌లో ఉన్నారని ఫ్యాన్స్‌ కూడా చర్చించుకుంటున్నారు. ఎన్నాళ్లు ఈ దాపరికమని, మీ ప్రేమ గురించి అనౌన్స్‌ చేయమని సూచిస్తున్నారు. 

    ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌

    రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ఫుల్‌ స్వింగ్‌లో ఉంది. చేతిలో ఏకంగా ఐదు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటీవల ‘పుష్ప 2’ సాలిడ్‌ హిట్ అందుకున్న రష్మిక.. ప్రస్తుతం తెలుగులో ‘కుబేర’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ వంటి ప్రాజెక్ట్స్‌ చేస్తోంది. హిందీలో ‘చావా’, ‘సికిందర్‌’, ‘తమ’ వంటి సినిమాల్లో నటిస్తోంది. అటు విజయ్‌ దేవరకొండ సైతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్‌లో ‘VD12’ మూవీ చేస్తున్నాడు. రాహుల్‌ సంకృత్యన్‌ డైరెక్షన్‌లో మరో మూవీకి అంగీకరించాడు. అలాగే దిల్‌రాజు నిర్మాణంలో ఓ మూవీ కూడా విజయ్‌ ఓకే చేశాడు.

    వచ్చే ఏడాదే పెళ్లి!

    విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్న త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాది ఆరంభంలోనే పెళ్లి (Vijay Devarakonda – Rashmika Mandanna Wedding) చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. దీనిపై త్వరలోనే రష్మిక – విజయ్‌ దేవరకొండ జాయింట్‌గా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉందంటూ నెట్టింట పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. తాజా ఇంటర్వ్యూలో విజయ్‌ చెప్పిన సమయం అదే కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version