పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్ పరంగా ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్ రీసెంట్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. అటు డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన ‘యానిమల్’ (Animal) భారతీయ చిత్ర పరిశ్రమను ఎంతగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ‘స్పిరిట్’కి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రభాస్‌కు జోడీగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
హీరోయిన్ ఎవరంటే?
ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor) ఇందులో ప్రభాస్‌కు జోడీగా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పదేళ్ల క్రితం బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయినా కరీనా కపూర్ ప్రస్తుతం అడపా దడపా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తోంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఓ స్టార్ హీరో పక్కన హీరోయిన్‌గా చేయనున్నట్లు వార్తలు రావడం ఆసక్తి రేపుతోంది. ప్రభాస్, కరీనా జోడీ ఎలా ఉంటుందోనని ఇప్పటినుంచే ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. దీనిపై స్పిరిట్ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రభాస్ విలన్ మళ్లీ రిపీట్!
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ఇటీవల కాలంలో విలన్ రోల్స్ కేరాఫ్‌గా మారుతున్నారు. ‘ఆదిపురుష్’ చిత్రంలో రావణాసురుడిగా నటించినా సైఫ్ అలీఖాన్ ‘దేవర’లో తారక్‌కు ప్రత్యర్థిగా నటించారు. ఇటీవల రిలీజైన ‘దేవర’ ట్రైలర్‌లో క్రూరంగా కనిపించి ఆకట్టుకున్నారు. స్పిరిట్‌పై వచ్చిన మరో బజ్ ప్రకారం సైఫ్ అలీఖాన్ ఇందులోనూ నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్ పాత్రలో సైఫ్ కనిపించనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే స్పిరిట్‌లో హీరోయిన్ అంటూ రూమర్లు ఎదుర్కొంటున్న కరీనా కపూర్.. సైఫ్ అలీఖాన్‌కు భార్య. దీంతో భార్య హీరోయిన్‌గా, భర్త విలన్‌గా కనిపిస్తారన్న టాక్ ఆసక్తి రేపుతోంది. ఇదే నిజమైతే స్పిరిట్‌పై అంచనాలు మరో లెవల్‌కు వెళ్లడం ఖాయమని అంటున్నారు.
పోలీసు vs మాఫియా డాన్!
‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ ద్విపాతాభినయం చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని డైలాగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ డ్యూయల్ రోల్స్ విషయానికి వస్తే ఒక పాత్రలో పోలీసుగా మరో పాత్రలో మాఫియా డాన్‌గా ప్రభాస్ కనిపిస్తారని బజ్ ఉంది. డాన్ పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే అక్టోబర్ 10న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజవుతుందని, వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ‘స్పిరిట్’ సెట్స్‌పైకి వెళ్తుందని టాక్. మరోవైపు ప్రభాస్ ఇప్పటివరకూ మూడు సినిమాల్లో ద్విపాత్రిభినయం చేశారు. తొలి చిత్రం ‘బిల్లా’ కాగా ఆపై ‘బాహుబలి’, ‘బాహుబలి 2’లోనూ డ్యూయల్ రోల్స్‌లో కనిపించారు. రీసెంట్‌గా తెరకెక్కుతున్న రాజాసాబ్‌లోనూ ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం ఉంది.
స్పిరిట్ బడ్జెట్ అన్ని కోట్లా?
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే బాక్సాఫీస్ ముందు వందల కోట్ల కలెక్షన్స్ పక్కా. అందుకే తమ సినిమాలో రెబల్ స్టార్ ఉంటే చాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కురుస్తాయని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ చిత్రాలపై భారీ బడ్జెట్ పెట్టడానికి వెనకాడటం లేదు. అందుకు తగ్గట్టే ప్రభాస్ సినిమాల బడ్జెట్ వందల కోట్లతో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా చిత్రానికి సంబంధించి ఓ వార్త కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. భారీ బడ్జెట్‌తో స్పిరిట్ సినిమా రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ కోసం మేకర్స్ రూ.500 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్‌తో కలిసి డైరెక్టర్ సందీప్ రెడ్డి స్వయంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రభాస్ కెరీర్లో ఆదిపురుష్ రూ.700 కోట్ల బడ్జెట్‌తో టాప్‌లో ఉంది. ఆ తర్వాత ఈ మధ్యే వచ్చిన కల్కి రూ.600 కోట్లతో సెకండ్ ప్లేస్ సాధించింది. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రాబోతున్న మూడో ఫిల్మ్‌గా ‘స్పిరిట్’ నిలవనుంది.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?