SS Rajamouli: రాజమౌళి డాక్యుమెంటరీపై నెటిజన్లు ఫైర్‌.. మరీ ఇలా చేశారేంటీ!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SS Rajamouli: రాజమౌళి డాక్యుమెంటరీపై నెటిజన్లు ఫైర్‌.. మరీ ఇలా చేశారేంటీ!

    SS Rajamouli: రాజమౌళి డాక్యుమెంటరీపై నెటిజన్లు ఫైర్‌.. మరీ ఇలా చేశారేంటీ!

    July 23, 2024

    దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli)పై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్‌ ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో రాజమౌళిపై హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెలబ్రిటీలు ప్రసంశల వర్షం కురిపించారు. అయితే ఈ డాక్యుమెంటరీ తెలుగు వెర్షన్‌ ట్రైలర్‌పై సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇలా ఎందుకు చేశారంటూ తీవ్ర స్థాయిలో నెటిజన్లు మండిపతున్నారు. వారి కోపానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

    ఏకీపారేస్తున్న నెటిజన్లు!

    దర్శకధీరుడు రాజమౌళి సాధించిన ఘనతలపై ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ (Modern Masters) పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix) ఆగస్టు 2 నుంచి దీనిని ప్రసారం చేయనుంది. తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించి తొలుత ఇంగ్లీష్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఆపై కొన్ని గంటల వ్యవధిలో తెలుగు వెర్షన్‌నూ తీసుకొచ్చారు. ఇంగ్లీషు వెర్షన్‌పై ప్రశంసలు కురిపించిన నెటిజన్లు తెలుగు ట్రైలర్‌ చూసి మాత్రం షాక్‌కి గురవుతున్నారు. ఆంగ్ల ట్రైలర్‌లో ప్రభాస్‌, రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ తమ సొంత వాయిస్‌తో రాజమౌళితో తమకున్న వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకున్నారు. తెలుగుకు (SS Rajamouli Documentary) వచ్చేసరికి రాజమౌళి సహా ఆ ముగ్గురు స్టార్ హీరోలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌ల చేత డబ్బింగ్‌ చెప్పించారు. తెలుగు సెలబ్రిటీలైన రాజమౌళి, ప్రభాస్‌, చరణ్‌, తారక్‌లకు వేరే వాళ్లతో డబ్బింగ్‌ చెప్పించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దానికి తోడు డబ్బింగ్ క్వాలిటీ కూడా చాలా పూర్‌గా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇది తమనెంతో నిరాశకు గురిచేస్తోందని పోస్టులు పెడుతున్నారు. డబ్బింగ్‌ వల్ల డాక్యుమెంటరీని ఓన్‌ చేసుకోలేకపోతున్నట్లు ఫైర్ అవుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికైనా తెలుగు డబ్బింగ్‌ విషయంలో పునరాలోచన చేయాలని సూచిస్తున్నారు. 

    డబ్బింగ్‌ చెప్పే సమయం లేదా?

    రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్‌ ఇంగ్లీష్‌ వెర్షన్‌లో ప్రభాస్‌, తారక్‌, రామ్‌చరణ్‌ తమ ఓన్‌ వాయిస్‌తో అభిప్రాయాలు తెలిపి తెలుగులో మాత్రం చెప్పకపోవడంపై వారిపైనా నెటిజన్లు మండిపడుతున్నారు. తెలుగు డైరెక్టర్‌కు సంబంధించి తొలిసారి ఓ డాక్యుమెంటరీ రూపొందుతుంటే ఇలా చేయడం సమంజసం కాదని అంటున్నారు. డబ్బింగ్‌ చెప్పే సమయం లేదా అంటూ నిలదీస్తున్నారు. ఎంత బిజీ షెడ్యూల్‌ ఉన్నప్పటికీ తెలుగులో ఆ స్టార్స్‌ డబ్బింగ్‌ చెప్పి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. అది దర్శకధీరుడికి ఇచ్చే నిజమైన గౌరవమని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు స్టార్‌ హీరోలకు మద్దతు తెలియజేస్తున్నారు. డాక్యుమెంటరీ మేకర్స్ హీరోల అభిప్రాయాలను కేవలం ఇంగ్లీషులోనే కలెక్ట్‌ చేసి ఉండొచ్చని అంటున్నారు. తెలుగులోనూ కోరి ఉంటే అప్పుడే తెలియజేసి ఉండేవారని మద్దతుగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్‌పై ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

    రాజమౌళి గురించి మన స్టార్స్ ఏమన్నారంటే?

    ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ (Modern Masters) పేరుతో రానున్న ఈ డాక్యుమెంటరీలో (Netflix Documentary)  రాజమౌళి సినీ ప్రయాణాన్ని చూపనున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళితో పనిచేసిన ప్రముఖుల అభిప్రాయాలను డాక్యుమెంటరీ మేకర్స్‌ అడిగి తెలుసుకున్నారు. వీడియో ప్రారంభంలో ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రామ్‌చరణ్‌, రమా రాజమౌళి, కరణ్‌జోహార్‌, జేమ్స్‌ కామెరూన్‌, రమా రాజమౌళి వంటి ప్రముఖులు దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. వారు ఏమన్నారంటే.. 

    • ఇప్పటివరకు ఎవరూ చూపని స్టోరీలను ప్రపంచానికి తెలియజేయడం కోసమే రాజమౌళి పుట్టారు – ఎన్టీఆర్‌
    • ఇలాంటి దర్శకుడిని నేను ఇప్పటివరకు చూడలేదు. సినిమాలంటే ఆయనకు పిచ్చి ప్రేమ – ప్రభాస్‌
    • రాజమౌళికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఎవరితోనైనా పని చేయగలరు. ఆయనంటే నాకెంతో గౌరవం – జేమ్స్‌ కామెరూన్‌
    • ఆయన సినిమాల్లో నన్ను నేను చూసుకొని ఎంతో ఆశ్చర్యపోతాను – రామ్‌చరణ్‌
    • ఈ దర్శకుడు ఓ లెజెండ్‌ – కరణ్‌ జోహార్‌

    సెట్స్‌లో ఎన్నో మైక్స్‌ పగలడం చూశా: చరణ్‌

    రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్‌లో సెలబ్రిటీలకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆయనతో పని చేయడం ఎంత తలనొప్పో చెప్పాలంటూ ప్రశ్నించారు. అప్పుడు సెలబ్రిటీలు రాజమౌళితో తాము ఫేస్‌ చేసిన ఇబ్బందులను తెలియజేశారు. సెట్స్‌లో ఎన్నో మైక్స్‌ పగిలిపోవడం తాను చూశానంటూ రామ్‌చరణ్‌ చెప్పుకొచ్చారు. తాను రాజమౌళి పక్కన ఉన్నప్పుడు తన వస్తువులు పగలకుండా ఉంటే చాలు అని కోరుకునేవాడినని తెలిపారు. అటు జూ.ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘ఎలాంటి దయ, జాలి ఉండవు. తాను కోరుకున్నది రాబట్టుకోవడం, వెళ్లిపోవడం ఇలాగే చేస్తూ ఉంటాడు. అతను ఒక మ్యాడ్‌ పర్సన్‌’ అని చెప్పుకొచ్చారు. భార్య రమా రాజమౌళి కూడా ఈ ట్రైలర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాజమౌళితో పని చేసిన వారందరూ ఆయన్ని “పని రాక్షసుడని” పిలుస్తుంటారు’ అని ఆమె చెప్పుకొచ్చారు. 

    ఆస్కార్‌ కమిటీకి రాజమౌళి!

    దర్శకధీరుడు రాజమౌళికి ఇటీవల అస్కార్‌ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. దర్శకుల కేటగిరిలో రాజమౌళి (SS Rajamouli), కాస్ట్యూమ్‌ డిజైనర్‌ జాబితాలో రమా రాజమౌళి (Rama Rajamouli) ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్‌ అకాడమీ ఆహ్వానం పంపింది. అందులో భారత్‌ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మి, రితేశ్‌ సిద్వానీ, రవి వర్మన్‌ తదితరులు అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version