భారతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్స్‌లో దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) ముందు వరుసలో ఉంటారు. ‘బాహుబలి’ (Baahubali), ‘బాహుబలి 2’ (Baahubali 2), ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) వంటి చిత్రాలతో ప్రపంచ సినిమా రంగాన్ని దేశం వైపు చూసేలా చేశారు. సినిమాలకు సంబంధించిన పలు అంతర్జాతీయ అవార్డులను భారత్‌కు అందించారు. అటువంటి రాజమౌళిపై ‘మోడ్రన్ మాస్టర్స్’ (Modern Masters) పేరుతో ఓ డాక్యూమెంటరీ (Rajamouli Documentary) రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయగా ప్రస్తుతం అది యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు రాజమౌళిపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
రాజమౌళిపై ప్రశంసల వర్షం
దర్శకధీరుడు రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) డాక్యుమెంటరీ రూపొందించింది. ‘మోడ్రన్ మాస్టర్స్’ (Modern Masters) పేరుతో రానున్న ఈ డాక్యుమెంటరీలో (Netflix Documentary) ఇందులో ఆయన సినీ ప్రయాణాన్ని చూపనున్నారు. ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇది ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. వీడియో ప్రారంభంలో ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్, రమా రాజమౌళి, కరణ్‌జోహార్, జేమ్స్ కామెరూన్, రమా రాజమౌళి వంటి ప్రముఖులు దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. వారు ఏమన్నారంటే..
- ఇప్పటివరకు ఎవరూ చూపని స్టోరీలను ప్రపంచానికి తెలియజేయడం కోసమే రాజమౌళి పుట్టారు – ఎన్టీఆర్
- ఇలాంటి దర్శకుడిని నేను ఇప్పటివరకు చూడలేదు. సినిమాలంటే ఆయనకు పిచ్చి ప్రేమ – ప్రభాస్
- రాజమౌళికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఎవరితోనైనా పని చేయగలరు. ఆయనంటే నాకెంతో గౌరవం – జేమ్స్ కామెరూన్
- ఆయన సినిమాల్లో నన్ను నేను చూసుకొని ఎంతో ఆశ్చర్యపోతాను – రామ్‌చరణ్
- ఈ దర్శకుడు ఓ లెజెండ్ – కరణ్ జోహార్
‘ఎలాంటి దయ, జాలి ఉండవు’
రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్‌లో సెలబ్రిటీలకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆయనతో పని చేయడం ఎంత తలనొప్పో చెప్పాలంటూ ప్రశ్నించారు. అప్పుడు సెలబ్రిటీలు రాజమౌళితో తాము ఫేస్ చేసిన ఇబ్బందులను తెలియజేశారు. సెట్స్‌లో ఎన్నో మైక్స్ పగిలిపోవడం తాను చూశానంటూ రామ్‌చరణ్ చెప్పుకొచ్చారు. తాను రాజమౌళి పక్కన ఉన్నప్పుడు తన వస్తువులు పగలకుండా ఉంటే చాలు అని కోరుకునేవాడినని తెలిపారు. అటు జూ.ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘ఎలాంటి దయ, జాలి ఉండవు. తాను కోరుకున్నది రాబట్టుకోవడం, వెళ్లిపోవడం ఇలాగే చేస్తూ ఉంటాడు. అతను ఒక మ్యాడ్ పర్సన్’ అని చెప్పుకొచ్చారు. భార్య రమా రాజమౌళి కూడా ఈ ట్రైలర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాజమౌళితో పని చేసిన వారందరూ ఆయన్ని పని రాక్షసుడని పిలుస్తుంటారు’ అని ఆమె చెప్పుకొచ్చారు.
ఆస్కార్ కమిటీకి రాజమౌళి!
దర్శకధీరుడు రాజమౌళికి ఇటీవల అస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. దర్శకుల కేటగిరిలో రాజమౌళి (SS Rajamouli), కాస్ట్యూమ్ డిజైనర్ జాబితాలో రమా రాజమౌళి (Rama Rajamouli) ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపింది. అందులో భారత్ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మి, రితేశ్ సిద్వానీ, రవి వర్మన్ తదితరులు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.
‘SSMB29’తో బిజీ బిజీ!
‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత రాజమౌళి తన తర్వాతి మూవీని మహేష్ బాబుతో చేయనున్నారు. ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందనుందని టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ కథా నేపథ్యం సాగుతుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. కథ కూడా ఇటీవలే ఫైనల్ అయినట్లు ఫిల్మ్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ సినిమాలో మహేష్‌ను నెవర్ బిఫోర్ అవతార్‌లో రాజమౌళి చూపించనున్నారని టాక్ వినిపిస్తోంది. పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రపంచస్థాయి టెక్నిషియన్లతో రాజమౌళి ఈ సినిమాను రూపొందించనున్నారు.
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!