• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫోన్ చేశారు.. నమ్మలేదు: ‘ఏజెంట్’ హీరోయిన్

    అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘ఏజెంట్’ నేడు రిలీజ్ అయింది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ సాక్షి వైద్య ఆసక్తికర విశేషాలు పంచుకుంది. ‘‘కోవిడ్ టైంలో సోషల్ మీడియాలో రిల్స్ చేశాను. ఆ తర్వాత కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. ఆ సమయంలో ‘ఏజెంట్’ ప్రొడక్షన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తున్నామన్నారు. తొలుత ఆ ఆఫర్‌ను నమ్మలేదు. కానీ ఓ కాస్టింగ్ డైరెక్టర్ ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ పెద్ద బ్యానర్ అని చెప్పాడు. వెంటనే హైదరాబాద్‌లో ఆడిషన్ ఇచ్చా.’’ అంటూ … Read more

    ట్రెండింగ్‌లో ‘ఏజెంట్’ ట్రైలర్

    అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘ఏజెంట్’ ట్రైలర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. యూట్యూబ్ టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. విడుదలైన 24 గంటల్లోపే దాదాపు 5 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అఖిల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కాగా ‘ఏజెంట్’ మూవీని డైరెక్టర్ సురేందర్‌రెడ్డి తెరకెక్కించారు. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా సాక్షి వైద్య నటించింది. హిప్ హాప్ తమీజా సంగీతం అందించారు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది.

    అఖిల్‌ “ ఏజెంట్” ట్రైలర్ వచ్చేసింది

    స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి, అక్కినేని అఖిల్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఏజెంట్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఈ సినిమాతో అఖిల్‌ రేంజ్‌ పాన్‌ ఇండియాకు వెళ్తుందని చిత్రబృందం పక్కా ధీమాతో ఉంది. మరి ట్రైలర్‌ చూశాక మీకు అదే అనిపిస్తే కామెంట్‌ చేయండి. 2020లో అఖిల్ ఏజెంట్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. కరోనా కారణంగా ఏడాది ఆలస్యం అయ్యింది. 2021లో చిత్రాన్ని ప్రారంభించారు. అప్పట్నుంచి షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కాస్త ఆలస్యంగానే విడుదలవుతుంది. సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ … Read more

    ఏజెంట్‌ మూడో సింగిల్ ప్రోమో

    అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం నుంచి మరో పాట విడుదలకు సిద్ధమయ్యింది. ఇందుకు సంబంధించి మేకర్స్‌ ప్రోమోను విడుదల చేశారు. రామకృష్ణ గోవింద అంటూ పాట సాగుతోంది. పూర్తి సాంగ్‌ను రేపు సాయంత్రం 5.05 గంటలకు విడుదల చేయనున్నారు. హిప్‌హాప్‌ తమిజా సంగీతం అందించాడు. చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా… ఏకే ఎంట్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

    ఏజెంట్ లవ్ మిషన్ మెుదలయ్యింది

    అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. మళ్లీ మళ్లీ అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఏజెంట్ లవ్ మిషన్ మెుదలయ్యిందంటూ చిత్ర యూనిట్‌ పాటను విడుదల చేశారు. హిపాప్‌ తమిజా చిత్రానికి స్వరాలు సమకూర్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఏజెంట్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నెల 28న ట్రైలర్ విడుదల కానుంది.

    యూట్యూబ్ ను షేక్ చేస్తోన్న ఏజెంట్

    యంగ్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. నిన్న విడుదలైన ఈ యాక్షన్ టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్ లో నం. 1 పోజిషన్ లో ఉంది. ఇప్పటి వరకు 4లక్షల 27వేల లైక్ లు సాధించింది. 1మిలియన్ వ్యూస్ వైపు పరుగులు తీస్తోంది. కాగా టీజర్ లో అఖిల్ యాక్షన్ లుక్స్ అదిరిపోయాయి. సిక్స్ ప్యాక్ బాడీతో మెస్మరైజ్ చేస్తున్నాడు.ఏజెంట్ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కించిన విషయం తెలిసిందే.