అల్లరి నరేష్ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. గత నెలలో 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. విభిన్న ప్రయత్నంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 వేదికగా విడుదల కాబోతోంది. క్రిస్మస్ కానుకగా ఈ నెల 23నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు జీ5 ఓ ప్రకటనలో తెలపింది. అల్లరి నరేష్‌తో పాటు.. వెన్నెల కిశోర్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.