• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బిగ్‌బాస్ కంటెస్టెంట్ అరెస్ట్

  కన్నడ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్-10లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హాస్‌లోకి వెళ్లి మరి కంటెస్టెంట్‌గా ఉన్న వర్తుర్ సంతోష్‌ను అరెస్ట్ చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాని ఉల్లంఘించినందుకు సంతోష్‌ను ఫారెస్ట్ అధికారులు అదులులోకి తీసుకున్నారు. పులిగోరు ధరించి బిగ్‌బాస్‌లో పాల్గొనడంపై సంతోష్‌పై పలువులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అటవిశాఖ అధికారులు సంతోష్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

  ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా?

  బిగ్ బాస్ హౌస్‌లో ఈ వారం నామినేషన్స్ లిస్ట్‌లో ఉన్న శోభాశెట్టికి అతి తక్కువ ఓటింగ్ రావడంతో ఆమె ఎలిమినేట్ కానుందనే చర్చ జరుగుతోంది. శోభాశెట్టితో పాటు యావర్, అశ్వినీ, అమర్ దీప్, పావని, పూజా మూర్తి, తేజ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. యావర్‌కు టాప్ ఓటింగ్ వస్తుండగా.. అమర్ దీప్, తేజ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. పూజా మూర్తి, శోభాశెట్టికి తక్కువ ఓటింగ్ వస్తోంది. దీంతో అతి తక్కువ ఓటింగ్ వస్తున్న శోభాశెట్టిని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించనున్నట్లు తెలుస్తోంది.

  ట్రోలర్స్‌పై మండిపడిన అరియానా

  బిగ్ బాస్ బ్యూటీ అరియానా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలపై నెటిజన్లు ట్రోల్ చేయడంపై ఆమె ఘాటుగా స్పందించింది. తాను లావుగా ఉన్నానని, ఆంటీలా అయ్యానని కొంత మంది వేస్ట్ ఫెలోస్ అంటున్నారని మండిపడింది. నేను ఎలా ఉంటే వారికి ఏంటని ఆమె ప్రశ్నించింది. వారికి అంతగా ఇబ్బందిగా ఉంటే తనను ఆన్‌ఫాలో చేయాలని సూచించింది. ఖాళీగా ఉంటే ఏదైనా పని చేసుకోవాలని, అవతలి వాళ్ల గురించి చెడు వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికింది. https://www.instagram.com/reel/Cx2bgxIxK_S/?utm_source=ig_embed&ig_rid=2f34065e-5a0c-49e7-8d53-d5e8af4a992b

  బిగ్‌బాస్ తర్వాత నా భార్య బాధపడింది: హీరో

  రియాలిటీ షో బిగ్‌బాస్ మూడో సీజన్‌లో భార్యభర్తలైన యాక్టర్స్ వరుణ్ సందేశ్-వితిక జంటగా పాల్గొన్నారు. అయితే తాజాగా వరుణ్ దీనిపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బిగ్‌బాస్ షో నుంచి బయటకొచ్చిన నా భార్య బాధపడింది. అలా షోను ఎడిట్ చేసి చూపించారని చెబుతూ చాలా ఫీలైంది. గంట ఎపిసోడ్‌లో ఓ మనిషిని చూసి వాళ్ల క్యారెక్టర్‌ని ఎలా డిసైడ్ చేస్తారు. అది నన్ను చాలా బాధించింది’. అంటూ వరుణ్ చెప్పుకొచ్చారు.

  బిగ్‌బాస్ నుంచి క్రేజీ ప్రోమో

  బిగ్‌బాస్ నుంచి మరో క్రేజీ ప్రోమో వచ్చింది. రమేష్-రాధల పాత్రలతో ప్రోమోను ఓ రేంజ్‌లో తీశారు. బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్ల ఆటలు ఇక సాగవని.. బిగ్‌బాస్ ఆడించే ఆటలు మాత్రమే చెల్లుతాయని తెలిసే విధంగా ఈ ప్రోమో వదిలారు. బిగ్‌బాస్ 7 సీజన్ వచ్చే నెల 3న గ్రాండ్‌గా లాంఛ్ కానున్నట్లు సమాచారం. అమర్‌దీప్-తేజస్విని, బుల్లెట్ భాస్కర్, మోహన భోగరాజు, వర్ష, శోభాశెట్టి, బ్యాంకాక్ పిల్ల, సాకేత్, ఈటీవీ ప్రభాకర్, సురేఖావాణి, సుప్రీత, తదితరులు ఈ సీజన్‌లో సందడి చేయనున్నట్లు టాక్.

  BIGBOSS 7: ఓపెనింగ్ ఆ రోజే?

  బిగ్‌బాస్ 7 నుంచి తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమో ప్రకారం సెప్టెంబర్ 3 నుంచి బిగ్‌బాస్ 7 సీజన్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. లేదా ఆగష్టు చివరి వారంలో కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రొమోలో నాగార్జున మాటలు వింటుంటే ఈ సారి సీజన్ సరికొత్తగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ‘‘6 సీజన్లు చూశాం. కంటెస్టెంట్స్ అంతా తెలుసనుకుంటున్నారు.. పాపం పసివాళ్లు. మన ప్లాన్స్ వేరే ఉన్నాయ్. ఈసారి బిగ్‌బాస్ 7 ఉల్టా పల్టా.’’ అంటూ నాగ్ ప్రోమోలో పేర్కొన్నాడు.

  బిగ్‌బాస్‌లోకి ‘బేబీ’ హీరోయిన్!

  ‘బేబీ’ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య బిగ్‌బాస్‌లోకి అడుగుపెడుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. బేబీ సినిమా హిట్‌తో వైష్ణవి పేరు మోరుమోగుతోంది. దీంతో ఆమె క్రేజ్‌ను ఉపయోగించుకోవడానికి బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బ్యాంకాక్ పిల్ల శ్రావణి, శోభాశెట్టి, సింగర్ మోహన భోగరాజు, అమర్‌దీప్ చౌదరి, తేజస్విని, శ్వేతా నాయుడు, దీపికా పిల్లి, సింగర్ మంగ్లీ, జబర్దస్త్ అప్పారావు, క్రికెటర్ వేణుగోపాలరావు తదితరులు బిగ్‌బాస్ 7లో సందడి చేయనున్నట్లు టాక్.

  బిగ్‌బాస్ 7 ప్రోమో వచ్చేసింది

  బిగ్‌బాస్ సీజన్ 7 ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ సారి మరిన్ని ఎమోషన్స్, సర్‌ప్రైజ్‌లు, థ్రిల్లింగులు ఉంటాయని ప్రోమోలో తెలిపారు. కాగా సీజన్ 7కు దగ్గుబాటి రానా హోస్ట్ చేయనున్నారని సమాచారం. ఈ షోలో మంగ్లీ, మోహన భోగరాజు, హేమచంద్ర, దీపిక పిల్లి, రష్మీ గౌతమ్, సాకేత్ కొమండూరి, విష్ణప్రియ, సిద్ధార్థ్ వర్మ, ఈటీవీ ప్రభాకర్, మిత్రా శర్మ, ఐశ్వర్య, శోభాశెట్టి, పండు, జబర్దస్త్ అప్పారావు, ప్రత్యూష, సాయిరోనాక్, ఎస్తేర్, నోయల్, తేజస్విని, అమర్‌దీప్‌లు కంటెస్టెంట్లుగా ఉంటారని టాక్. #BiggBossTelugu7 – A … Read more

  డబ్బులు తీసుకుని మోసం చేశారు: గీతూ రాయల్‌

  బిగ్‌ బాస్‌ బ్యూటీ గీతూ రాయల్‌, ఆ షోకు రాకముందే సోషల్‌ మీడియాలో చాలా పాపులర్‌. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌గా చిత్తూరు యాసతో ఫాలోవర్లను పెంచుకుంది. బిగ్‌ బాస్‌ సీజన్‌-6 నుంచి బయటికి వచ్చాక కుండ బద్దలు కొట్టే ఆరోపణలు చేస్తోంది. బిగ్‌బాస్‌లో తాను నిజాయతీగా ఆడానని అయితే తనను స్నేహితులు, అయినవాళ్లే మోసం చేశారని కన్నీరు పెట్టుకుంది. తనను ప్రమోట్‌ చేసేందుకు PR టీంను పెట్టుకుంటే వారు డబ్బులు తీసుకుని మోసం చేశారని భావోద్వేగానికి లోనైంది.

  మంత్రగత్తె అవతారం ఎత్తిన అషురెడ్డి.. వైరల్ అవుతున్న పిక్స్

  సెలెబ్రిటీల సోషల్ మీడియాలను ప్రజలు ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఏదైనా పోస్ట్ చేస్తే చాలు వెంటనే లైకులు, ట్రోల్స్ చేయడం మొదలు పెట్టేస్తారు. అయితే జూనియర్ సమంతగా పేరు తెచ్చుకొని ఒక్కసారిగా పాపులరైన బ్యూటీ అషురెడ్డి. కొద్దిగా సమంతల ఉండడంతో ఈ అమ్మడుకి బిగ్ బాస్ అవకాశం వచ్చింది. ఆ షోలో సందడి చేయడంతో అషురెడ్డి పాపులారిటీ ఇంకా పెరిగింది. దీంతో ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ ను సంపాదించుకుంది. బుల్లితెర మీద సందడి చేస్తున్న ఈ … Read more