సెలెబ్రిటీల సోషల్ మీడియాలను ప్రజలు ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఏదైనా పోస్ట్ చేస్తే చాలు వెంటనే లైకులు, ట్రోల్స్ చేయడం మొదలు పెట్టేస్తారు. అయితే జూనియర్ సమంతగా పేరు తెచ్చుకొని ఒక్కసారిగా పాపులరైన బ్యూటీ అషురెడ్డి. కొద్దిగా సమంతల ఉండడంతో ఈ అమ్మడుకి బిగ్ బాస్ అవకాశం వచ్చింది. ఆ షోలో సందడి చేయడంతో అషురెడ్డి పాపులారిటీ ఇంకా పెరిగింది. దీంతో ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ ను సంపాదించుకుంది. బుల్లితెర మీద సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తరచూ ఫోటో షూట్లతో వైరల్ అవుతూ ఉంటుంది.
స్టార్ మా ఛానల్ లో ప్రతి రోజూ కనిపిస్తూ సందడి చేసే ఈ భామ.. పలు షోలకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తోంది. యూట్యూబ్ ఛానల్ లో వ్లాగ్స్ చేస్తూ ఎప్పుడూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఆ మధ్య దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ కూడా బాగా వైరల్ అయ్యింది. వర్మ చేసిన ఆ ఇంటర్వ్యూ అప్పట్లో హాట్ టాపిక్. దీంతో పాటు బిగ్ బాస్-3 టైటిల్ విన్నర్ రాహుల్ తో కూడా ప్రేమాయణం నడుతుందని వార్తలు వచ్చాయి. అవన్నీ పక్కనపడితే.. అషురెడ్డి రోజుకో ఫోటో షూట్ తో ఇంస్టాగ్రామ్ లో యాక్టీవ్ గా ఉంటుంది అషురెడ్డి. తనకు లాగే తన ఫోటోలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఈ అమ్మడు షేర్ చేసిన ఏ ఫోటోకైనా వేలల్లో లైకులు రావాల్సిందే.
ఎప్పటిలాగానే అషురెడ్డి మరో ఫోటో షూట్ చేసింది. అయితే ఈసారి అలాంటి ఇలాంటి ఫోటో షూట్ కాదండి బాబు, మంత్రగత్తె అవతారం ఎత్తింది. మెడలో పుర్రెల హారం వేసుకొని చేతిలో మంత్రదండం పట్టుకొని సందడి చేసింది. ఎర్రని డ్రెస్ తో అలా మెట్లపై కూర్చొని అషురెడ్డి ఇచ్చిన ఫోజులు రచ్చ లేపుతున్నాయి. ఈ ఫోటోలకు అబ్రక దబ్రా, గిలి గిలాయా అంటూ క్యాప్షన్ పెట్టింది. కన్నింగ్ లుక్స్, స్టన్నింగ్ పిక్స్ తో అదరగొడుతున్న అషురెడ్డిని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఓ మంత్రగత్తె మాకు పట్టిన దయ్యాన్ని వదిలించు అంటూ కామెంట్లు చేస్తుండగా.. కొందరు మంత్రగత్తె అదిరిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో పాటు ఎప్పటిలాగానే తన పోస్టుపై లైకులు వర్షం కురుస్తుంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం