• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కేజీఎఫ్ ఒక చెత్త సినిమా: కిశోర్

  కాంతార సినిమాలో ఫారెస్ట్ అధికారిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ కుమార్ కేజీఎఫ్ సినిమాపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ సినిమా గురించి అడిగినప్పుడు.. ‘కేజీఎఫ్ సినిమా ఇంతవరకు చూడలేదు. అది నా టైప్ కాదు. ఇలా పోల్చడం సరైందో కాదో తెలియదు కానీ ఇదొక చెత్త సినిమా. ఈ మూవీ చూసే కన్నా.. సీరియస్‌గా సాగే చిన్న సినిమాల్ని చూడటానికి ప్రాధాన్యత ఇస్తా. అది హిట్ కాకపోయినా సరే. అయితే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం’ అని కుండ బద్దలు కొట్టాడు. … Read more

  2022 రౌండప్‌: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ 

  ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో 2022లో జరిగిన విషయాలేంటో ఓ సారి చూద్దాం. దివికేగిన దిగ్గజాలు ఈ ఏడాది వినోదరంగంలో చాలామంది ప్రముఖులను కోల్పోయాం. రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్‌ స్టార్ కృష్ణ, లతా మంగేష్కర్‌ తుదిశ్వాస విడిచారు. గ్రేట్ సింగర్స్‌ కేకే అనుకోకుండా చనిపోవటం, సిద్దూ మూసేవాలా హత్య ఫ్యాన్స్‌ను కన్నీటి పర్యంతం చేశాయి. కెేరాఫ్ బ్లాక్ బస్టర్స్‌ 2022లో వివిధ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయి. RRR, KGF-2, బ్రహ్మస్త్ర, విక్రమ్, PS-1, కాంతారా వంటి సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. … Read more

  కేజీఎఫ్ తవ్వకాలకు కేంద్రం సుముఖం

  కర్ణాటకలోని ‘కోలార్ గోల్డ్‌మైన్స్ ఫీల్డ్స్’ని మళ్లీ తెరవాలని కేంద్రం నిర్ణయించింది. 20 ఏళ్ల కిందట మూతపడిన ఈ ప్రాంతంలో మళ్లీ తవ్వకాలు చేపట్టాలని కేంద్రం సంకల్పించింది. 2001లో భారత్ కోల్ మైనింగ్ లిమిటెడ్ ఈ ప్రాంతంలో తవ్వకాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. 12వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కేజీఎఫ్ ప్రాంతం ఇక ఎందుకూ పనికిరాదని అంతా అనుకున్నారు. దీంతో ఇది నిర్మానుష్య ప్రదేశంగా మారిపోయింది. కేజీఎఫ్ సినిమాతో ఇది దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దిబ్బలే ఉన్నప్పటికీ.. ఈ ప్రాంతంలో ఇప్పటికీ బంగారు నిక్షేపాలు ఉన్నాయన్న … Read more

  కేజీఎఫ్ తాతకు నిర్మాణ సంస్థ నివాళి

  కేజీఎఫ్‌ తాత మృతిపై ఆ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే సంతాపం ప్రకటించింది. సినిమా అభిమానులు ముద్దుగా తాతా అని పిలుచుకునే కృష్ణరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించింది. కేజీఎఫ్ రెండు సినిమాల్లోనూ ఆయన చేసిన క్యారెక్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. గుడ్డివాడి పాత్రలో నటించి కథను మలుపు తిప్పే పాత్రలో నటించారు. చిత్రంలో కొద్దిసేపే ఉన్నప్పటికీ ప్రేక్షకులకు ఆ సన్నివేశంతోనే రోమాలు నిక్కపొడిచేలా చేశారు. ఆయన మృతి తీరని లోటని పలువురు వ్యాఖ్యానించారు.

  కేజీఎఫ్‌ మేకర్స్‌తో ‘శింభు’ సినిమా

  వరుస విజయాలతో జోరుమీదున్న హీరో శింభు మరో క్రేజీ ప్రాజెక్టుకు సంతకం చేశాడు. “గురు” “ఆకాశమే నీ హద్దురా” వంటి అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన దర్శకురాలు సుధ కొంగరతో శింభు సినిమా చేయబోతున్నాడు. దీనిని ‘కేజీఎఫ్‌’ నిర్మాత “హోంబలే” తెరకెక్కించబోతోంది. శింభు చివరి రెండు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్‌గా కూడా బాగా వర్కవుట్‌ అయ్యాయి. “మానాడు” “వెదాంతు తానిదాతు కాదు” మంచి విజయాలను నమోదు చేశాయి. హీరో, డైరెక్టర్‌, నిర్మాత ముగ్గురు సక్సెస్‌ జోష్‌లో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు.

  HEAD BUSH సూపర్ ట్రైలర్

  కేజీఎఫ్‌తో మొదలైన కన్నడ సినిమాల హవా ‘కాంతార’తో నెక్స్ట్‌ లెవెల్‌కి వెళ్లింది. ఈ ఏడాది KGF2, విక్రాంత్‌ రోణ, 777చార్లీ, కాంతార ఇలా సూపర్ హిట్ల తర్వాత… ఇప్పుడు ‘హెడ్‌ బుష్‌’ అంటూ మరో సినిమా రాబోతోంది. అగ్ని శ్రీధర్ రచన, శూన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. వయొలెంట్‌గా ఉన్న ట్రైలర్‌ చూస్తుంటే మరో మాస్‌ సినిమా లోడ్‌ అవుతున్నట్లు కనిపిస్తోంది. పుష్పలో జాలి రెడ్డిగా ధనంజయ ఇందులో హీరోగా కనిపిస్తున్నారు. అక్టోబర్‌ 21న ఈ సినిమా రిలీజ్‌ … Read more

  వచ్చే ఏడాది Sep 28కి పూనకాలే

  సరిగ్గా వచ్చే ఏడాదిలో Sep 28ని ప్రభాస్ ఫ్యాన్స్ పండుగలా జరుపుకోనున్నారు. కారణం.. ఇదే రోజున సలార్ మూవీ విడుదల కానుంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. కేజీఎఫ్ సినిమాలను మించిన యాక్షన్ ఇందులో చూపించనున్నట్లు సమాచారం. దీంతో అభిమానులే కాకుండా మాస్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. దీంతో సలార్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

  హీరో, విలన్‌గా Jr.NTR

  Jr.NTR ప్రస్తుతం కొరటాల శివ సినిమాకు సన్నద్ధం అవుతున్నాడు. అయితే, ఇండస్ట్రీ కళ్లన్నీ ఆ తర్వాత వచ్చే సినిమా మీదే ఉన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో తారక్ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హీరో, విలన్‌గా ఎన్టీఆర్‌‌యే నటించనున్నారని టాక్. ఇదే నిజమైతే.. ఇక ఎన్టీఆర్ యాక్టింగ్‌కి థియేటర్లు దద్దరిల్లాల్సిందేనంటున్నారు ఫ్యాన్స్. ఇదివరకు ‘జైలవకుశ’లో NTR త్రిపాత్రాభినయం చేసి అలరించాడు.

  కేజీఎఫ్-2లో రాఖీ భాయ్ పవర్ ఫుల్ డైలాగ్స్

  సినిమా ఇండస్ట్రీలో ఇటీవల వచ్చిన మాస్ సినిమాలన్నీ ఒకెత్తైతే ‘కేజీఎఫ్’ ఒక ఎత్తు. మురికి గుంట నుంచి ముంబయిని ఏలే స్థాయికి ఎదిగిన ఓ కుర్రాడి కథను.. అదిరిపోయే మాస్ ఎలివేషన్స్, అంతకుమించిన డైలాగ్స్ తో ‘కేజీఎఫ్’లో చూపించారు. అంతకు రెండింతల మాస్ సీన్లు, డైలాగ్స్ తో వచ్చింది ‘కేజీఎఫ్-2’. రాకీ భాయ్ నోట ఒక్కో పంచ్ డైలాగ్ పడుతుంటే థియేటర్లు ఊగిపోయాయి. అలా ‘కలాష్ నిఖావో’ రాకీ వదిలిన తూటాల్లాంటి  డైలాగ్స్ అక్షరాల్లో మీకోసం..

  తమిళ స్టార్ డైరెక్టర్‌కు యష్ గ్రీన్ సిగ్నల్ ?

  కేజీఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో యష్. KGF-2 ఇచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ హీరో తన తదుపరి ప్రాజెక్టును ఇంకా ప్రకటించలేదు. నర్తన్ అనే ఓ యువ దర్శకుడితో తరువాతి మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఆ మూవీ తరువాత తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో మూవీ చేయనున్నట్లు గాసిప్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్‌తో సినిమా చేస్తున్న శంకర్, తరువాత యష్‌ను డైరెక్ట్ చేయనున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంత … Read more