విడుదలైన ‘మెగా మాస్’ పాట
మెగాస్టార్, మాస్ మహారాజ కాంబినేషన్ పాట విడుదలైంది. డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్ అంటూ పాట హుషారుగా సాగుతోంది. వాల్తేరు వీరయ్య నుంచి వచ్చిన నాలుగో పాట ఇది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రోల్ రైడా లిరిక్స్ రాయడంతో పాటు పాటను ఆలకించారు. మరో మాస్ సింగర్ రామ్ మిరియాల కూడా పాటను పాడాడు. కాగా, వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.