పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. కొంతకాలంగా అమైలాయిడోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్న ముషారఫ్…దుబాయ్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1943లో అప్పటి అఖండ భారత్‌లో జన్మించిన ముషారఫ్ స్వాతంత్ర్యం తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత సైన్యంలో చేరి దేశాధ్యక్షుడిగా ఎదిగారు. 1999లో నవాజ్ షరీఫ్‌పై తిరుగుబాటు చేసి సైనికల పాలకుడిగా పగ్గాలు చేపట్టారు. 2001 నుంచి 2008వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా పనిచేశారు.