• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • INDvsPAK: పాకిస్తాన్ ఆలౌట్

    వన్డే ప్రపంచకప్‌లో అహ్మదాబాద్‌ వేదిక. భారత్ – పాకిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లు రిజ్వాన్‌ (47) బాబర్ అజామ్‌ (45) తప్ప మిగిలిన వారు ఎవ్వరూ పెద్దగా పరుగులు చేయలేక పోయారు. టీమిండియా బౌలర్లు బుమ్రా (2) సిరాజ్ (2) హార్థిక్ (2) కుల్థీప్ యాదవ్ (2) జడేజా (2) వికెట్లు తీసుకున్నారు.

    భారత్‌కు రానున్న పీసీబీ చీఫ్‌

    అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను చూసేందుకు పాక్ క్రికెట్‌ బోర్డు మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ జకా అష్రఫ్ భారత్‌కు రానున్నారు. ఆయనతో పాటు 60 మంది జర్నలిస్టుల కూడా భారత గడ్డపై అడుగుపెట్టనున్నారు. ఈ సందర్బంగా అష్రష్ మట్లాడుతూ “నేను గురువారం భారత్‌కు పయనం కానున్నాను. నా ప్రయాణం కాస్త ఆలస్యమైంది. ఈ మెగా ఈవెంట్‌ను కవర్‌ చేయడానికి పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌లకు వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇందుకు చాలా సంతోషంగా ఉంది’ అని … Read more

    PAK vs SL: పాకిస్థాన్ విజయం

    శ్రీలంక నిర్దేశించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్‌ ఛేదించింది. 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి పాక్ 345 లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ (113) మహ్మద్ రిజ్వాన్ (131) పరుగులు చేసి జట్టుకు విజయం అదించారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లు 9 వికెట్లు కోల్పోయి 344 పరుగుల భారీ స్కోరు చేసింది.

    PAK vs SL శ్రీలంక భారీ స్కోరు

    వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా నేడు పాకిస్థాన్‌, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. లంక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు గట్టి పోటీ ఇచ్చింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లు 9 వికెట్లు కోల్పోయి 344 పరుగుల భారీ స్కోరు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్ కుశాల్ మెండిస్ 77 బంతుల్లో 122 పరుగులు చేశాడు. సధీరా సమరవిక్రమ 89 బంతుల్లో 108 పరుగులు రాబట్టాడు, ఓపెనర్ పాథుమ్ నిశాంక 61 బంతుల్లో 51 పరుగులు చేసి పాక్ బ్యాటర్లు ముందు భారీ స్కోరు … Read more

    ట్రంప్‌ పోలికలతో వ్యక్తి.. వీడియో వైరల్

    అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను పోలిన ఓ వ్యకి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అతడు పాకిస్తాన్‌లోని పంజాబ్ సాహివాల్ జిల్లాలో కుల్ఫీలు అమ్ముకుంటున్నాడు. ట్రంప్ పోలీకలు ఉన్న ఆ వ్యక్తి సరదగా పాట పాడుతూ ఉన్న ఓ వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. 2021లో సైతం కుల్ఫీలు అమ్ముకుంటూ పాటలు పడిన ఇతడి వీడియో ఒకటి వైరల్ అయ్యింది. https://www.instagram.com/reel/CyDI4UpOOuT/?utm_source=ig_embed&ig_rid=8cea3ffe-9c46-4d30-afa4-cbe6900ec7db

    శరణార్థులు దేశం విడిచి వెళ్లిపోండి: పాకిస్థాన్

    పాకిస్థాన్ శరణార్థులపై కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గానిస్థాన్ నుంచి శరణు కోరి వచ్చినవారు తక్షణమే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ‘ఆఫ్గాన్ నుంచి 2021లో తాలిబాన్ల ఆక్రమణ తర్వాత అనేక మంది పాకిస్థాన్‌కు శరణార్థులుగా వచ్చారు. దాదాపు 13 లక్షల మంది ఆఫ్గాన్ పౌరులు శరణార్థులుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరో 8.8 లక్షల మంది శరణార్థులుగా ధ్రువీకరణ పొందారు. వీరితో పాటు మరో 17 లక్షల మంది దేశంలోకి అక్రమంగా చొరబడ్డారు. వీరంతా నవంబర్ 1వ తేదీ నాటికి దేశం విడిచి వెళ్లిపోవాలి’ … Read more

    రోహిత్ ఫామ్‌లో ఉంటే కష్టమే: పాక్ వైస్ కెప్టెన్

    భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లో ఉంటే తట్టుకోవడం కష్టమే అని పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ అన్నారు. అలాగే బౌలర్లలో కుల్‌దీప్ మంచి ఫామ్‌లో ఉన్నాడని చెప్పారు. హైదరాబాద్ ఆతిథ్యం తమ జట్టుకు ఎంతో నచ్చిందన్నారు. తమ జట్టు అద్భుతమైన ప్రదర్శన ఇస్తుందనే నమ్మకం ఉందన్నారు. భారత జట్టు గెలుపుకు అత్యుత్తమైన బౌలింగ్ ప్రదర్శన దోహదపడే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే ఉప్పల్ మైదానంలో పాకిస్థాన్- ఆస్ట్రేలియా మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది.

    పెళ్లి విందులో వివాదం.. కుర్చీలతో దాడి

    ఓ పెళ్లి విందులో జరిగిన చిన్నవివాదం కుర్చీలతో కొట్టుకునే దాకా వచ్చింది. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది. పెళ్లికి వచ్చిన అతిథులు టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన మరో వ్యక్తి భోజనం చేస్తున్న మరో వ్యక్తి టోపీ తీశాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ మొదలయింది. అదికాస్త చిలికి చిలికి గాలి వానలా మారింది. దీంతో ఇరువర్గాలు రెచ్చిపోయి కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని … Read more