• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • PAK vs AFG: అఫ్గానిస్థాన్ సంచలన విజయం

    వన్డే వరల్డ్‌కప్‪‌లో భాగంగా పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ ఘన విజయం సాధించింది. అఫ్గాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 7 వికెట్లు కొల్పోయి 283 పరుగుల చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆఫ్గాన్ జట్టు ఏ మాత్రం తడబాటు లేకుండా 49 ఓవర్లలోనే లక్ష‍్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్లు రహతుల్మా (65), ఇబ్రహిం జర్దాన్ (87) రహ్మత్ షా (77), హస్మతుల్లా (48) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

    PAK vs AFG: అఫ్గాన్ టార్గెట్ ఫిక్స్

    ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లు బాబర్ అజామ్ (74) అబ్దుల్లా షఫీక్‌ (58) సాద్ షకీల్ (25), ఇమామ్ ఉల్ హక్ (17), మహ్మద్ రిజ్వాన్ (8) షాదాబ్‌ ఖాన్‌ (40) ఇఫ్తికార్ అహ్మద్‌ (40) పరుగులతో రాణించారు అఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్‌ (3), నవీనుల్ హక్ (2), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, మహ్మద్‌ నబీ … Read more

    AUS vs PAK: ఆసీస్‌‌కు రెండో విజయం

    వరల్డ్ కప్‌లో భాగంగా నేడు ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 367 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ మరో ఓటమిని మూటగట్టుకుంది. 45.3 ఓవర్లలో 305 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్‌ 62 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

    AUS vs PAK: ఆసీస్‌‌కు రెండో విజయం

    వరల్డ్ కప్‌లో భాగంగా నేడు ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 367 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ మరో ఓటమిని మూటగట్టుకుంది. 45.3 ఓవర్లలో 305 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్‌ 62 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

    AUS vs PAK: పాక్ ముందు భారీ లక్ష్యం

    వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 367 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆసీస్ బ్యాటర్లు డేవిడ్ వార్నర్ (163), మిచెల్ మార్ష్ (121), స్టీవెన్ స్మిత్ (7), లాబుషాగ్నే (8), జోష్ ఇంగ్లిస్ (13), గ్లెన్ మాక్స్‌వెల్ (0), మార్కస్ స్టోయినిస్ (21), పాట్ కమిన్స్ (6), మిచెల్ స్టార్క్ (2), పరుగులతో భారీ స్కోరు రాబట్టారు. పాకిస్థాన్ బౌలర్లు … Read more

    సొంత జట్టుపై పాక్ నటి విమర్శలు?

    ఇటీవల పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారి ఓ ఆసక్తికర ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. భారత్‌ను ఓడిస్తే బంగ్లాదేశ్ క్రికెటర్‌తో డేట్ డిన్నర్‌కి వెళ్తానని ప్రకటించింది. అయితే నిన్న బంగ్లా ఓటమి తర్వాత ఆమె మరో ఆసక్తికర ట్వీట్ చేసింది. బంగ్లా ఆటను అభినందిస్తూ తన సొంత జట్టు పాక్‌పై పరోక్షంగా విమర్శలు చేసింది. ‘భారత్‌తో వారి సొంతగడ్డపై బంగ్లా గట్టిగా పోరాడింది. కొన్ని జట్లు పోటీని కూడా ఇవ్వలేకపోయాయి’, అని షిన్వారీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

    పాక్ పేసర్లను ఉతికారేస్తున్న ఆసీస్ ఓపెనర్లు

    వరల్డ్ కప్‌లో భాగంగా నేడు ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, పాక్ బౌలర్లకు చుక్కలు, చూపిస్తున్నారు. ఓపెనర్లుగా వచ్చిన ఇద్దరు బ్యాటర్లు చెరో సెంచరీ నమోదు చేశారు. ప్రస్తుతం ఆసీస్ ఒక్క వికెట్ ‌కూడా నష్టపోకుండా 30 ఓవర్లలో 200పైగా పరుగులు చేసింది.

    టీమిండియాను ఓడిస్తే డిన్నర్ డేట్‌కు వస్తా: పాక్ నటి

    గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో పాక్ నటి సెహర్ షిన్వారి విషం చిమ్ముతూ సంచలన ప్రకటన చేసింది. రేపు జరగబోయ్ భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడిస్తే.. బంగ్లాదేశ్ ఆటగాడితో డిన్నర్ డేట్‌కు వెళ్తానని ప్రకటించింది. ‘భగవంతుడా భారత జట్టును బాంగ్లాదేశ్ ఓడిస్తే ఆ దేశ ఆటగాడితో ఢాకాకు వెళ్లి డిన్నర్ డేట్‌కు చేస్తా’ అని షిన్వారి ట్వీట్ చేసింది. ఈ నటి గతంలో కూడా వివాదాస్పద పోస్ట్‌లు చేసింది.

    పాక్ మాజీ కెప్టెన్ ఇంట్లో విషాదం

    పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఇంట్రో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోదరి ఆసుపత్రిలో చికిత్స పొందుతు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్నిఅఫ్రిది సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘మా సోదరి మమ్మల్ని విడిచి దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని బరువెక్కిన హృదయాలతో తెలియజేస్తున్నాము. ఆమె అంత్యక్రియలు ఇవాళ జరుగుతాయి’. అని అఫ్రిది ట్వీట్ చేశారు.

    INDvsPAK: టీమిండియా హ్యాట్రిక్‌ విజయం

    వన్డే ప్రపంచకప్‌లో అహ్మదాబాద్‌ వేదిక. భారత్ – పాకిస్థాన్‌ జట్లు తలపడ్డాయి. తొలుత టాస్‌ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. మొదటి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లు రిజ్వాన్‌ (47) బాబర్ అజామ్‌ (45) తప్ప మిగిలిన వారు ఎవ్వరూ పెద్దగా పరుగులు చేయలేక పోయారు. అనంతరం ఛేజింక్‌కు దిగిన టీమిండిడి 30 ఓవర్లకు 192 విజయ లక్ష్యాన్నిఅందుకుంది. టీమిండియా బ్యాటర్లు రోహిత్ శర్మ (86) గిల్ (16) కోహ్లీ (16) … Read more