• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గ్రూప్‌-2 పరీక్ష మళ్లీ వాయిదా

    తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష మళ్లీ వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను రీషెడ్యూల్‌ చేశారు. TSPSC Group 2 Examను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రూప్‌-2 పరీక్ష వాయిదా పడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. మొత్తం 783 గ్రూప్‌-2 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే.

    ఓటర్లకు సీఈవో కీలక సూచనలు

    తెలంగాణలో ఎన్నికల కోట్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 12 కార్డులు వినియోగించుకోవచ్చని తెలిపింది. ప్రత్యేక ఓటర్లకు రవాణా సౌకర్యం కల్పిస్తామని పేర్కొంది. మహిళలు, యువత కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని వెల్లడించింది. ఫిర్యాదుల కోసం 1950ను సంప్రదించాలి ఎన్నికల సంఘం పేర్కొంది.

    మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్

    పాలమూరు ప్రజాగర్జన’ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలు కాదు.. జాతీయస్థాయిలో అధికార మార్పు కావాలని కోరుతోంది దేశ ప్రజలు..BRS పార్టీ స్టీరింగ్ కేసీఆర్ చేతిలోనే పదిలంగా ఉంది. కానీ బిజెపి స్టీరింగ్..అదాని చేతిలోకి వెళ్లిపోయింది. తెలంగాణలో రైతుల రుణమాఫీ జరగనే లేదని మాట్లాడటం… మిలియన్ డాలర్ జోక్’. అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

    ఢిల్లీలో కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ చర్చలు

    TG: కాంగ్రెస్‌ పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం దిల్లీలో కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారుపై నేతలు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో జాబితాను ఖరారు చేసి అధిష్ఠానానికి పంపనున్నారు. అనంతరం మంగళవారం లేదా బుధవారం భేటీ కానున్న ఏఐసీసీ ఎన్నికల కమిటీ ఈనెల 14లోపు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయనుంది. మరోవైపు, సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని ఓబీసీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం 35 సీట్లు ఇవ్వాలని అధిష్ఠానానికి ఇప్పటికే వినతి పత్రాలు అందజేశారు.

    నేడు 70% కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు!

    తెలంగాణలో నేడు కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటిలో 60-70 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అభ్యర్థులను ఖరారు చేస్తే వారంతా ప్రచారం చేసుకోవడానికి వీలవుతుందని కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌తో చెప్పినట్లు పేర్కొన్నారు. భారాస మాదిరి ముందస్తుగా టికెట్లు ఖరారు చేయడం కాంగ్రెస్‌ లాంటి జాతీయపార్టీలో సాధ్యం కాదన్నారు.

    తెలంగాణలో 57 నూతన కోర్టులు

    తెలంగాణలో కొత్తగా 57 కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా కోర్టులు ఏర్పాటు చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ప్రభుత్వానికి లేఖ రాయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై జరిగే నేరాలను విచారించేందుకు గాను ప్రత్యేకంగా 10 కోర్టులు ఏర్పాటు చేశారు. కొత్త కోర్టుల్లో సిబ్బందిని నియమించేందుకు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

    నేడు ‘సీఎం అల్పాహారం’ ప్రారంభం

    తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించేందుకు తీసుకువస్తున్న ‘సీఎం అల్పాహారం’ పథకం నేడు ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒక స్కూల్‌ చొప్పున ఈ రోజు ప్రారంభించనున్నారు. మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాలలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఆయన స్థానంలో మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు. ఉప్మా, కిచిడీ, పొంగల్, ఇడ్లీ, పూరీతో మెనూ సిద్ధం చేశారు.

    10న కాంగ్రెస్ జాబితా ఖరారు

    ఈ నెల 10న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 60 చోట్ల సింగిల్ అభ్యర్థి ఉండగా, 20 సెగ్మెంట్లలో ఇద్దరు చొప్పున.. మిగతా నియోజకవర్గాల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్నారు. 8న స్క్రీనింగ్ కమిటీ భేటీ, 9న సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించనున్నారు. 10న ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించి తుది జాబితా ఖరారు చేయనున్నారు.

    TS: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

    తెలంగాణలో స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. పాఠశాలల్లో అల్పాహార పథకాన్నిఅమలు చేయనుంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,147 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ అల్పాహార పథకం అమల్లోకి రానుంది. పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందేలా పాఠశాల ప్రారంభానికి ముందే అల్పాహారం అందించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక మెనూ కూడా ఏర్పాటు చేశారు.

    తెలంగాణకు రాహుల్.. 3 రోజులు ఇక్కడే!

    కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ నెల రెండో వారంలో తెలంగాణ రానున్నారు. ఆయన మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలంగాణ ఇచ్చింది తామేనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే తుక్కుగూడ సభలో ఆ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్ షా, సోనియా వంటి అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.