దక్షిణాదికి మరో మూడు వందే భారత్ రైళ్లు
దక్షిణాదికి త్వరలో మరో వందే భారత్ రైళ్లు వస్తున్నాయి. మరో మూడింటిని పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సన్నద్ధమవుతోంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి , కాచిగూడ నుంచి బెంగళూరు, సికింద్రాబాద్ నుంచి పుణె నగరాల మధ్య సేవలందిస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలో తొలివందే భారత్ రైలును చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య గతేడాది నవంబర్లో ప్రారంభమయ్యింది. ఇటీవల సంక్రాంతి కానుకగా తెలుగు రాష్ట్రాల మధ్య వర్చువల్గా ప్రారంభించిన విషయం తెలిసిందే.