[VIDEO](url):సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఈ మధ్యనే ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కొత్తగా వచ్చింది కాబట్టి సాధారణంగానే ఈ ట్రైన్‌పై అందరికీ ఆసక్తి ఉంటుంది. అదే ఉత్సుకతతో రాజమహేంద్రవరంలో ఓ వ్యక్తి సెల్ఫీ కోసం వందేభారత్ ఎక్కాడు. ఇంతలో ఆటోమేటిగ్‌గా రైలు డోర్ మూసుకుపోయింది. TTE వచ్చి ఏంటని అడగ్గా.. సార్ కొత్త ట్రైన్ అని సెల్ఫీ కోసం ఎక్కాను దిగేస్తాను సార్ అంటూ ప్రాధేయపడ్డాడు. కానీ దిగడం కుదరదు విజయవాడ దాకా మాతో పాటు రావాల్సిందేనంటూ TTE చెప్పాడు.