తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి ప్రగతి పథంలో దూసుకెళ్తుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలతో రాష్ట్ర అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు.
ముఖ్యాంశాలు
మొత్తం బడ్జెట్
మంత్రి హరీశ్‌రావు 2022-23 వార్షిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.29,728 కోట్లు.
దళిత బంధు
ఈ బడ్జెట్‌లో దళిత బంధుకు రూ.17,700 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా 11,800 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగం
రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ప్రధానంగా దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. ఈ రంగానికి రూ.24,256 కోట్లు కేటాయించారు. పామాయిల్ సాగుకు రూ.1000 కోట్లు, హరితహారానికి రూ.932 కోట్లు ప్రకటించారు. అలాగే రూ.50వేల లోపు రుణమాఫీని మార్చిలోపు చేస్తామన్నారు. రూ.16,144 కోట్ల పంట రుణాల మాఫీకి కేటాయించారు.
విద్యారంగం
పలు జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.1000 కోట్లు. అలాగే అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు కేటాయింపు. ములుగు, యాదాద్రి, గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, ములుగు జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటు.
ఆసరా పింఛన్లు
దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు అందించే ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు కేటాయించారు. అలాగే షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలకు రూ.2,750 కోట్లగా నిర్ణయించారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లు
నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ఒక్కో నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. సొంత స్థలంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించుకుంటే ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. దీని ద్వారా 4 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వివరించారు.
సామాజిక వర్గాలు
ఎస్టీ సంక్షేమానికి రూ.12,565 కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమానికి రూ.5,698 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.177 కోట్లు ప్రకటించారు.
ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెండ్
మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతున్నారనే కారణంతో భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, రాజా సింగ్‌లను సస్పెండ్ చేశారు. సెషన్ పూర్తయ్యే వరకు వారి సస్పెన్షన్ కొనసాగుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి