TSPSC ఏఈ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో గురుకుల ప్రిన్సిపాల్ రేణుక మాస్టర్ మైండ్‌గా పోలీసుల విచారణలో తేలింది. ఆమె తన తమ్ముడి కోసం ప్రశ్నాపత్రం కావాలని ప్రవీణ్‌తో బేరం కుదుర్చుకుంది. రూ.10లక్షలు ఇచ్చేందుకు అంగీకరించింది. ట్విస్ట్ ఏమిటంతే రేణుక తమ్ముడు చదివింది టీటీసీ. ఏఈ పరీక్షకు అర్హుడు కాదు. ప్రవీణ్ పంపిన ప్రశ్నాపత్రాన్ని రూ.14లక్షల చొప్పున రేణుక నీలేష్, గోపాల్ అనే అభ్యర్థులకు అమ్మినట్లు తెలిసింది.
ఈ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే నిందితులను విచారించి కీలక ఆధారాలు సేకరించారు. టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నించనున్నారు. ఈ మేరకు దాదాపు 42 మందికి నోటీసులు జారీ అయ్యాయి. ముగ్గురు వ్యక్తులు గ్రూప్ 1 లీక్ చేశారని గుర్తించిన సిట్… వారిని అదుపులోకి తీసుకుంది. నిందితుడు రాజశేఖర్ అతడి స్నేహితుడికి పేపర్ ఇచ్చినట్లు తేల్చారు. అతడు ఎంతమందికి ఇచ్చాడనే దానిపై ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్‌లోని రెండు కోచింగ్ సెంటర్లకు కూడా పేపర్ లీకయ్యిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కేంద్రాలకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంలో రాజకీయంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి