This Week Movies: ‘దేవర’ వచ్చేస్తున్నాడు.. ఓటీటీలోనూ బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు లోడింగ్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This Week Movies: ‘దేవర’ వచ్చేస్తున్నాడు.. ఓటీటీలోనూ బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు లోడింగ్‌!

    This Week Movies: ‘దేవర’ వచ్చేస్తున్నాడు.. ఓటీటీలోనూ బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు లోడింగ్‌!

    September 23, 2024

    గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్‌ వద్ద చిన్న చిత్రాలు సందడి చేస్తున్నాయి. దసరా పండగకు ముందు క్రేజీ చిత్రాలు, అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించడానికి సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు

    దేవర (Devara)

    ఎన్టీఆర్‌ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 27న (devara release date) పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఎన్టీఆర్‌ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. సైఫ్ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, షైన్‌ టామ్‌ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

    సత్యం సుందరం (Sathyam Sundaram)

    తమిళ స్టార్‌ హీరో కార్తీ హీరోగా ‘96’ వంటి ఫీల్‌ గుడ్‌మూవీని తెరకెక్కించిన సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెయ్యజగన్‌’. తెలుగులో ఈ మూవీని ‘సత్యం సుందరం’ పేరుతో సెప్టెంబరు 28న (meiyazhagan release date) విడుదల చేస్తున్నారు. ఇందులో ప్రముఖ నటుడు అరవింద స్వామి కీలక పాత్ర పోషించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య, జోతికలు ఈ సినిమాను నిర్మించడం విశేషం. పెళ్లి మండపంలో కలుసుకున్న సత్యం, సుందరం అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కథను వినోదాత్మకంగా సి.ప్రేమ్‌ కుమార్‌ ఆవిష్కరించారు.

    హిట్లర్‌ (Hitler)

    తమిళ హీరో విజయ్‌ ఆంటోని నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్లర్‌’. దర్శకుడు ధన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 27న ‘దేవర’ మాదిరిగానే హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

    ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు, సిరీస్‌లు..

    సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)

    నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకుంది.ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా సెప్టెంబర్‌ 26 నుంచి ప్రసారం కానుంది. ఎస్.జె.సూర్య విలన్‌గా ఆకట్టుకున్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ నటించారు. సాయికుమార్‌ అభిరామి, అదితి బాలన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

    డిమోంటి కాలనీ 2 (Demonte Colony 2) 

    ‘డిమోంటి కాలనీ 2’ (Demonte Colony 2) చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అరుళ్‌ నిధి (Arulnithi), ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్‌. అజయ్‌ జ్ఞానముత్తు ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్టులో ప్రేక్షకులను థ్రిల్‌ చేసిన ఈ హారర్‌ థ్రిల్లర్‌ ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్‌ 27 నుంచి ‘జీ 5’లో తెలుగు, తమిళ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 2015లో వచ్చిన ‘డిమోంటి కాలనీ’కి సీక్వెల్‌గా ఇది రూపొందింది. 

    ముంజ్యా (Munjya)

    బాలీవుడ్ న‌టి శార్వారీ వాఘ్, అజయ్ వర్మ ప్రధాన పాత్రలలో న‌టించిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘ముంజ్యా’. ఆదిత్య చోప్రా య‌ష్ రాజ్‌ ఫిల్మ్స్‌ యూనివర్స్‌ రూపొందించిన‌ ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.  ఇక ఈ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వ‌హించాడు. ఇటీవల హిందీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు.

    మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    https://telugu.yousay.tv/tfidb/ott

    TitleCategoryLanguagePlatformRelease Date
    PenelopeSeriesEnglishNetflixSept 24
    Heaven And HellMovieEnglishNetflixSept 26
    The True GentlemanMovieEnglishNetflixSept 26
    RezballMovieEnglishNetflixSept 27
    Will And HarperSeriesEnglishNetflixSept 27
    School FriendsSeriesHindiAmazonSept 25
    Nobody Wants ThisSeriesEnglishAmazonSept 26
    Stree 2MovieHindiAmazonSept 27
    VazhaMovieMalayalamHotstarSept 23
    9-1-1SeriesHindiHotstarSept 24
    GrotesqueMovieEnglishHotstarSept 16
    Taja Khabar 2SeriesHindiHotstarSept 27
    RTIMovieTeluguETV WinSept 26
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version