This Week Movies: ఈ వారం వస్తోన్న మోస్ట్ వాంటెడ్‌ చిత్రాలు ఇవే.. ఓ లుక్కేయండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This Week Movies: ఈ వారం వస్తోన్న మోస్ట్ వాంటెడ్‌ చిత్రాలు ఇవే.. ఓ లుక్కేయండి!

    This Week Movies: ఈ వారం వస్తోన్న మోస్ట్ వాంటెడ్‌ చిత్రాలు ఇవే.. ఓ లుక్కేయండి!

    February 12, 2024

    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు (Tollywood Upcoming Movies), వెబ్‌సిరీస్‌లు (Upcoming Web Serieses) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈసారి చిన్న సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. ఫిబ్రవరి 12 – 18 తేదీల మధ్య అవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.

    థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు

    భ్రమయుగం

    మలయాళం సూపర్ స్టార్‌ మమ్ముట్టి ఈ వారం ‘భ్రమయుగం’ (Bramayugam) సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. హారర్‌ థ్రిల్లర్‌గా  రూపొందిన ఈ చిత్రానికి రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వం వహించారు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌, పోస్టర్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు, తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    రాజధాని ఫైల్స్‌

    ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌పై మరో మూవీ వస్తోంది. ఏపీ రాజధాని అమరావతి అంశంపై రూపొందిన ‘రాజధాని ఫైల్స్’ (Rajdhani Files) ఈ వారం థియేటర్లలోకి రాబోతుంది. అఖిలన్‌, వీణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది. 

    ఊరు పేరు భైరవకోన

    సందీప్‌కిషన్‌ (Sundeep Kishan) కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona). థ్రిల్లర్‌, సోషియో ఫాంటసీ కథాంశంతో దీన్ని తీర్చిదిద్దారు. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ‘గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే భైరవకోన’ అంటూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.

    సైరెన్‌

    జయం రవి (Jayam Ravi), కీర్తి సురేష్‌ (Keerthi Suresh) కీలక పాత్రల్లో నటిస్తున్న యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎమోషనల్‌ డ్రామా చిత్రం ‘సైరెన్‌’ (Siren Movie). ‘108’ అనేది ఉపశీర్షిక. ఆంటోనీ భాగ్యరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేసి క్రిమినల్‌గా మారిన ఓ వ్యక్తి కథ’ ఈ చిత్రం. కీర్తి ఇందులో పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు.

    ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

    నాసామి రంగ

    ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) ఒకటి. థియేటర్లలో మంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా.. ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. ఫిబ్రవరి 17 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇందులో విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా చేసింది. అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. 

    ది కేరళ స్టోరీ

    గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మూవీ ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. 9 నెలల తర్వాత ఈ వారం ఓటీటీలోకి వస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా.. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్న ఆసక్తి నెలకొంది.

    TitleCategoryLanguagePlatformRelease Date
    Sunderland ‘Till I Die 3SeriesEnglishNetflixFeb 13
    Love Is Blind SeriesEnglishNetflixFeb 13
    PlayersMovieEnglishNetflixFeb 14
    Einstein and the BombMovieEnglishNetflixFeb 16
    Five Blind Dates SeriesEnglishAmazon PrimeFeb 13
    This is me.. NowMovieEnglishAmazon PrimeFeb 16
    Queen ElizabethMovieMalayalamZee5Feb 14
    The Kerala StoryMovieHindiZee5Feb 16
    TrackerSeriesEnglishDisney+HotStarFeb 12
    Saba NayaganMovie TamilDisney+HotStarFeb 14
    Abraham OzlerMovieMalayalamDisney+HotStarFeb 15
    SlaarMovieHindi Disney+HotStarFeb 16
    Raisinghani v/s RaisinghaniSeries Hindi Sony LIVFeb 12
    Vera Maari Love StoryMovieTamilAhaFeb 14
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version