This Week Movies: ఈ వారం చిన్న చిత్రాలదే.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళ బ్లాక్‌బాస్టర్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This Week Movies: ఈ వారం చిన్న చిత్రాలదే.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళ బ్లాక్‌బాస్టర్‌!

    This Week Movies: ఈ వారం చిన్న చిత్రాలదే.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళ బ్లాక్‌బాస్టర్‌!

    ఈ వారం (This Week Movies) చిన్న సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.

    థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు

    డార్లింగ్‌

    ప్రియదర్శి (Priyadarshi), నభా నటేష్ (Nabha Natesh) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. ఈ సినిమాకు అశ్విన్ రామ్ (Aswin Ram) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

    రామం రాఘవం

    కమెడియన్ ధనరాజ్ డైరెక్టర్‌గా మారి చేసిన ద్విభాషా చిత్రం ‘రామం రాఘవం’ (Ramam Raghavam). ఇందులో సముద్రఖని, ధన్‌రాజ్‌ తండ్రి కొడుకులుగా నటించారు. ఈ చిత్రం జులై 19న తెలుగుతో పాటు తమిళంలోనూప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో ఈ సినిమాను ఆసక్తికరంగా రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. 

    పేక మేడలు

    హీరోగా వినోద్‌ కిషన్‌ (Vinod Kishan), హీరోయిన్‌గా అనూష కృష్ణ (Anusha Krishna) నటిస్తున్న చిత్రం ‘పేకమేడలు’ (Peka Medalu). క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను నిర్మించింది. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకులను పలకరించనుంది. అన్ని తరగతుల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత రాకేష్‌ వర్రే అన్నారు. 

    క్రైమ్‌ రీల్‌

    సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘క్రైమ్ రీల్’ (Crime Reel). పలు చిత్రాల్లో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించిన సంజన అన్నే ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. జూన్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సోషల్ మీడియా వల్ల యువత ఎలా చెడిపోతున్నారో ఇందులో చూపించాం. ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని డైరెక్టర్ సంజన అన్నారు.

    ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు

    ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం)

    స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మలయాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వ‌హించ‌గా అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సర్వైవల్ అడ్వెంచర్‌గా వ‌చ్చిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై ఘన విజయం సాధించింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.150 కోట్ల‌కు పైగా వసూళ్లను రాబ‌ట్టింది. కాగా, ఈ చిత్రం జూలై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాష‌ల్లో ప్రసారం కానుంది. 

    మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    https://telugu.yousay.tv/tfidb/ott

    TitleCategoryLanguagePlatformRelease Date
    Wanda RuseSeriesEnglishNetflixJuly 15
    T・P BONSeriesJapaneseNetflixJuly 17
    The Green Glow Gang 2SeriesEnglishNetflixJuly 17
    Kobla Kay Season 6SeriesEnglishNetflixJuly 18
    Tribhuvan Mishra CA TopperSeriesHindiNetflixJuly 18
    Sweet Home S 3SeriesKorean/EnglishNetflixJuly 19
    Nagendran’s HoneymoonsSeriesTelugu DubHotstarJuly 18
    BahishkaranaSeriesTeluguZee 5July 19
    BarzakhSeriesHindiZee 5July 19
    HotspotMovieTelugu DubAhaJuly 17
    My Spy: The Eternal CityMovieEnglishAmazon July 18
    Betty Law FeeSeriesEnglish/ SpanishAmazon July 19
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version