Tollywood Couples: నారా రోహిత్‌ – సిరి లేళ్ల తరహాలో ఒక్కటైన సెలబ్రిటీ జంటలు వీరే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tollywood Couples: నారా రోహిత్‌ – సిరి లేళ్ల తరహాలో ఒక్కటైన సెలబ్రిటీ జంటలు వీరే!

    Tollywood Couples: నారా రోహిత్‌ – సిరి లేళ్ల తరహాలో ఒక్కటైన సెలబ్రిటీ జంటలు వీరే!

    October 17, 2024

    రీల్‌ లైఫ్‌లో జంటగా చేసిన సెలబ్రిటీలు నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారు. ముందుగా ప్రేమ బంధంతో ఒక్కటై ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కృష్ణ- విజయ నిర్మల, రాజశేఖర్‌- జీవిత, నాగార్జున-అమల, శ్రీకాంత్‌-ఊహా, మహేశ్‌ బాబు- నమ్రత ఈ కోవకు చెందిన వారే. అయితే టాలీవుడ్‌లో ఈ సెలబ్రిటీ పెళ్లిళ్లు ఇటీవల కాలంలో బాగా ఎక్కువయ్యాయి. యంగ్‌ హీరో నారా రోహిత్‌ రీసెంట్‌గా యువ నటి సిరి లేళ్లను వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జనరేషన్‌ హీరో- హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం. 

    నారా రోహిత్‌ – సిరి లేళ్ల

    ఏపీ సీఎం నారా చంద్రబాబు సోదరుడి కుమారుడైన నటుడు నారా రోహిత్‌ (Nara Rohit) ‘బాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. సోలో, ప్రతినిధి, అసుర, సుందరకాండ వంటి చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నారు. రీసెంట్‌గా యువ నటి సిరి లేళ్ల (Siri Lella) ను ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహం డిసెంబర్‌లో జరగనుంది. అయితే ఇటీవల వచ్చిన ‘ప్రతినిధి 2’లో వీరిద్దరు జంటగా నటించారు. షూటింగ్ సందర్భంగా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. హృదయాలు సైతం కలిసిపోవడంతో బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. సిరి లేళ్ల విషయానికి వస్తే ఆమె తెలుగమ్మాయే. ఏపీలోని రెంట చింతల ఆమె స్వగ్రామం. ఆస్ట్రేలియాలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన ఆమె నటనపై మక్కువతో ఇండియాకు తిరిగి వచ్చింది. ‘ప్రతినిధి 2’ ఆడిషన్స్‌లో పాల్గొని హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది. 

    నాగచైతన్య – శోభిత దూళిపాళ్ల

    అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థం ఇటీవలే బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. వాస్తవానికి 2017లో సమంతను నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో 2021లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య, శోభిత చాలా సార్లు కలిసి కనిపించారు. వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తోందనే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోని ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని  స్పందించకపోయినప్పటికీ నిశ్చితార్థంతో వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ప్రస్తుతం నాగ చైతన్య ‘తండేల్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. శోభితా ఇటీవల మంకీ మ్యాన్ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటించింది. హిందీలో ఆమె లవ్‌, సితారా చిత్రం రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది.

    కిరణ్‌ అబ్బవరం – రహస్య గోరఖ్‌

    యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) ‘రాజా వారు రాణిగారు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇందులో రహస్య గోరఖ్‌ (Rahasya Gorak)హీరోయిన్‌గా చేసింది. తొలి చిత్రంతోనే అందమైన జంటగా వీరు గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా ఏర్పడిన స్నేహం వీరి మధ్య ప్రేమ చిగురించేలా చేసింది. అలా ఐదేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఆగస్టు 22న కర్ణాటకలోని కూర్గ్‌లో వివాహం చేసుకుంది. సినిమాల్లోకి రాకముందు కిరణ్‌, రహస్య ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేశారు. నటనపై ఆసక్తితో ఉద్యోగాలకు స్వస్థి చెప్పి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం కిరణ్‌ నటిస్తున్న ‘క’ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది. 

    వరుణ్‌ తేజ్‌ – లావణ్య త్రిపాఠి

    మెగా బ్రదర్‌ నాగబాబు కుమారుడైన వరుణ్‌ తేజ్‌ (Varun Tej) ‘ముకుంద’ (2014) చిత్రంతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తరవాత ‘కంచె’, ‘ఫిదా’, ‘లోఫర్‌’, ‘ఎఫ్‌3’ వంటి విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. ప్రముఖ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)ని గతేడాది నవంబర్‌లో డెస్టినేషన్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు. అయితే 2017లో వచ్చిన ‘మిస్టర్‌’ చిత్రంలో ఈ జంట తొలిసారి కలిసి నటించింది. ఆ తర్వాత ‘అంతరిక్షం’ సినిమాలోనూ జోడీగా కనిపించి మెప్పించారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మెుదలైన స్నేహం పెళ్లి పీటలపై వైపు అడుగులు వేసేలా చేసింది. ఇటలీ జరిగిన వీరి వివాహానికి మెగా ఫ్యామిలీ మెుత్తం హాజరయ్యింది. ఇదిలా ఉంటే వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం మట్కా చిత్రంలో నటించాడు. ఈ మూవీ నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. లావణ్య ప్రస్తుతం ‘తనల్‌’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. 

    ఆది పినిశెట్టి – నిక్కీ గల్రానీ

    ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా యంగ్‌ హీరో ఆది పినిశెట్టి (Aadi Pinisetty) ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’, రామ్‌ హీరోగా చేసిన ‘వారియర్‌’ చిత్రాల్లో విలన్‌గా చేసి ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే నటి నిక్కీ గల్రానీ (Nikki Galrani)ని ఆది 2022 మే నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిక్కీ ఆదితో రెండు చిత్రాలు చేసింది. ‘మలుపు’, ‘మరకతమణి’ చిత్రాల్లో వీరిద్దరు కలిసి నటించారు. మలుపు షూటింగ్‌ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అది కాస్త పెళ్లి పీటలకు దారితీసింది. 

    వరుణ్‌ సందేశ్‌ – వితిక షేరు

    యంగ్‌ హీరో వరుణ్‌ సందేశ్‌ (Varun Sandesh) 2007లో విడుదలైన ‘హ్యాపీడేస్‌’తో  తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ‘కొత్త బంగారు లోకం’ సక్సెస్‌తో యూత్‌కు మరింత కనెక్ట్‌ అయ్యారు. నటి వితికా షేరు (Vithika Sheru)ను 2015 డిసెంబర్‌ 7న వివాహం చేసుకున్నారు. వీరిద్దరు అదే ఏడాది రిలీజైన ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమాలో కలిసి నటించారు. మంచి స్నేహంతో పాటు ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 3లోనూ జంటగా అడుగుపెట్టి మంచి కపుల్‌గా బుల్లితెర ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. వరుణ్‌ సందేశ్ ఈ ఏడాది ‘నింద’, విరాజి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. వితిక షేరు ప్రస్తుతం యూట్యూబ్‌ వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version