This Week OTT Releases: ఈ ఏడాది చివర్లో రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This Week OTT Releases: ఈ ఏడాది చివర్లో రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే

    This Week OTT Releases: ఈ ఏడాది చివర్లో రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే

    December 23, 2024

    2024 సంవత్సరం చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది టాలీవుడ్‌ నుంచి చాలా సూపర్‌ హిట్స్ వచ్చాయి. ‘హనుమాన్‌’ మెుదలుకొని రీసెంట్ ‘పుష్ప 2’ ఎన్నో బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు పాన్‌ స్థాయిలో సత్తాచాటాయి. ఇప్పుడు డిసెంబర్‌ ఆఖరి వారంలోనూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసేందుకు మరికొన్ని చిత్రాలు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది రాబోతున్న చివరి చిత్రాలు అవే. అటు ఓటీటీలోనూ ఆసక్తి చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

    థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు

    బరోజ్‌ త్రీడీ

    మలయాళ నటుడు మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘బరోజ్‌ 3డీ’ (Barroz 3D). ఫాంటసీ అడ్వెంచరస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25 రిలీజ్‌ కానుంది. ‘గార్డియన్‌ ఆఫ్‌ డి గామాస్‌ ట్రెజర్‌’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. 

    శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

    వెన్నెల కిశోర్‌ (Vennela Kishore) హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌’ (Srikakulam Sherlock Holmes). ప్రముఖ రచయిత మోహన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల, స్నేహ గుప్తా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ కూడా క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుదల కాబోతోంది. వెన్నెల కిశోర్‌ ఇందులో డిటెక్టివ్‌ పాత్ర పోషించాడు. ఓ హత్య చుట్టూ కథ తిరుగుతుందని చిత్ర బృందం తెలియజేసింది. 

    పతంగ్

    గాలిపటాల స్పోర్ట్స్‌ డ్రామాతో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘పతంగ్‌’ (Patang). పణీత్ పత్తిపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి పగడాల, ప్రణవ్‌ కౌషిక్‌, వంశీ పూజిత్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ సింగర్ ఎస్పీ చరణ్‌ కీలక పాత్రలో నటించారు. రిషస్‌ సినిమాస్‌ బ్యానర్‌పై విజయ్‌ శేఖర్‌, సంపత్‌, సురేష్‌ కొత్తింటి నిర్మించారు. డిసెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. 

    మాక్స్ (తెలుగు డబ్)

    కన్నడ స్టార్ సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మాక్స్’ (Max) కూడా ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్ కీలక పాత్రలు చేశారు. విజయ్ కార్తికేయ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 27న తెలుగులో విడుదల కానుంది. సుదీప్‌ ఇందులో అర్జున్ మహాక్షయ్ అనే పోలీసు అధికారిగా కనిపించనున్నారు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. 

    బేబీ జాన్‌

    మహానటి ఫేమ్ కీర్తి సురేష్‌ (Keerthi Suresh) నటించిన తొలి బాలీవుడ్‌ చిత్రం ‘బేబీ జాన్‌’ (Baby John) క్రిస్మస్‌ కానుకగా విడుదల కాబోతోంది. వరుణ్‌ ధావన్‌ హీరోగా కాలీస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్‌ 25న రిలీజ్‌ కానుంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తెరి’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ రూపొందింది. కీర్తికి ఇదే తొలి హిందీ చిత్రం కావడంతో ‘బేబీ జాన్‌’పై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందన్న ధీమాలో ఉంది. 

    ఓటీటీలో వచ్చే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

    స్క్విడ్‌ గేమ్‌ 2

    వరల్డ్ మోస్ట్‌ వాంటెడ్ వెబ్‌సిరీస్‌ ‘స్క్విడ్‌ గేమ్‌ 2’ (Squid Game 2) ఈ వారమే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతోంది. 2021లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న కొరియన్‌ వెబ్‌ సిరీస్‌ ‘స్క్విడ్‌ గేమ్‌’కు సీక్వెల్‌గా ఇది రాబోతోంది. డిసెంబర్‌ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా చూడవచ్చు. తెలుగు, హిందీ సహా పలు దక్షిణాది భాషల్లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. కొద్ది రోజుల క్రితమే రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ సిరీస్‌పై భారీగా అంచనాలు పెంచేసింది. ఈ సిరీస్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. 

    Telugu Movies OTT Release Dates 2024

    TitleCategoryLanguagePlatformRelease Date
    Squid Game 2SeriesTelugu DubNetflixDec 26
    ZebraMovieTelugu AhaDec 20
    Leela VinodamSeriesTelugu ETV WinDec 19
    Mechanic RockyDocumentaryTelugu AmazonDec 13
    HarikathaSeriesTelugu Hot StarDec 13
    Roti Kapda RomanceMovieTelugu ETV WinDec 12
    7/G – The Dark StoryMovieTelugu AhaDec 12
    Thangalaan MovieTelugu NetflixDec 10

    OTT Releases This Week 2024

    TitleCategoryLanguagePlatformRelease Date
    The FourgeMovieEnglishNetflixDec 22
    OriginMovieEnglishNetflixDec 25
    Bhool Bhulaiyaa 3MovieHindiNetflixDec 27
    SorgavaasalMovieTamilNetflixDec 27
    Singham AgainMovieHindiAmazonDec 27
    ThanaraMovieMalayalamAmazonDec 27
    DoctorsSeriesHindiAmazonDec 27
    What If..? 3SeriesEnglishHotstarDec 22
    Doctor wooMovieEnglishHotstarDec 26
    Khoj MovieHindiZee 5Dec 27
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version