Keerthy Suresh: దసరా నుంచి కీర్తిని హీరోయిన్‌గా తీసేద్దామనుకున్న డైరెక్టర్.. కానీ!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Keerthy Suresh: దసరా నుంచి కీర్తిని హీరోయిన్‌గా తీసేద్దామనుకున్న డైరెక్టర్.. కానీ!

    Keerthy Suresh: దసరా నుంచి కీర్తిని హీరోయిన్‌గా తీసేద్దామనుకున్న డైరెక్టర్.. కానీ!

    October 17, 2024

    అందం కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్లలో కీర్తి సురేష్‌ (Keerthy Suresh) ఒకరు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు తెలుగులోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర అద్భుతంగా పోషించి ఏకంగా జాతీయ అవార్డు అందుకుంది. అయితే ఆమె ఫిల్మ్‌ కెరీర్‌లో ఎన్నో ఆసక్తికర సంఘనటలు చోటుచేసుకున్నాయి. నేడు (అక్టోబర్‌ 17) కీర్తి సురేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    చైల్డ్‌ ఆర్టిస్టుగా

    నటీనటులు సురేష్‌కుమార్‌, మేనకల కుమార్తె అయిన కీర్తి సురేష్‌ పెలట్స్‌ అనే మలయాళ చిత్రంతో బాలనటిగా మెరిసింది. మరో అచనేయనేనికిష్టం, కుబేరన్‌ అనే చిత్రాల్లోనూ ఆమె చైల్డ్‌ ఆర్టిస్టుగా కనిపించింది. 

    చిరుకి జోడీగా తల్లి.. చెల్లిగా కూతురు

    చిరంజీవి (Chiranjeevi) ‘పున్నమినాగు’ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ తల్లి మేనక నటించారు. రీసెంట్‌గా వచ్చిన ‘భోళా శంకర్‌‘ మూవీలో మెగాస్టార్‌ సోదరిగా కీర్తి సురేష్‌ నటించడం గమనార్హం. సినిమా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ అన్నా చెల్లెళ్లుగా వీరి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. హైదరాబాద్‌లో షూటింగ్‌ జరిగిన అన్ని రోజులు తన ఇంటి నుంచే కీర్తికి భోజనం పంపినట్లు చిరు మూవీ ప్రమోషన్స్ సందర్భంగా తెలిపారు.

    ప్రారంభంలోనే అటకెక్కిన చిత్రాలు

    మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించిన గీతాంజలి సినిమాతో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా మారింది. అయితే అంతకుముందే హీరోయిన్‌గా మూడు ప్రాజెక్ట్స్‌ను కీర్తి ఓకే చేసింది. షూటింగ్‌ కూడా సగానికి పైనే జరిగింది. అయితే అనూహ్యంగా ఆ మూడు ప్రాజెక్ట్స్‌ మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో తీవ్ర నిరాశకు గురైనట్లు ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది. 

    ఐరెన్‌ లెగ్‌గా ముద్ర

    కెరీర్‌ ప్రారంభంలోనే మూడు ప్రాజెక్ట్స్‌ ఆగిపోవడం.. మలయాళంలో చేసిన ‘గీతాంజలి’, రింగ్‌ మాస్టర్‌ చిత్రాలు ఫ్లాప్‌ కావడం, తమిళంలో ఆమె ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘ఇదు ఎన్న యామమ్‌’ కూడా డిజాస్టర్‌గా నిలవడంతో కీర్తికి ఐరెన్‌ లెగ్‌ అన్న ముద్ర వచ్చింది. విపరీతంగా ట్రోల్స్‌కు సైతం గురైంది. వాటిని పట్టించుకోకుండా విజయవంతమైన చిత్రాల్లో నటించి కీర్తి సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా మారింది. 

    మహానటితో కెరీర్‌ టర్నింగ్‌

    తెలుగులో చేసిన ఫస్ట్ ఫిల్మ్‌ ‘నేను శైలజా’ మంచి విజయం సాధించడంతో టాలీవుడ్‌, కోలీవుడ్‌లో కీర్తి సురేష్‌కు అవకాశాలు పెరిగాయి. వరుసగా కమర్షియల్ చిత్రాలు చేస్తున్నప్పటికీ నటిగా ఏమీ సాధించలేదన్న అసంతృప్తి కీర్తిలో ఉండిపోయింది. ఆ సమయంలోనే ‘మహానటి’ ప్రాజెక్ట్ ఆమె చెంతకు వచ్చింది. ఇందులో సావిత్రిగా పరకాయ ప్రవేశం చేసి మరి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని తోటి హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచింది. మహానటి తర్వాత కీర్తి సురేష్‌ గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోయింది. 

    వరుస ఫెయిల్యూర్స్

    మహానటి’ తర్వాత కెరీర్‌ పరంగా కీర్తి సురేష్‌కు తిరుగుండదని అంతా భావించారు. అందుకు తగ్గట్లే వరుసగా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఆ సినిమాలన్నీ ఫ్లాప్‌ టాక్స్‌ తెచ్చుకోవడంతో కీర్తి సురేష్‌ ఇబ్బందుల్లో పడింది. మహానటి తర్వాత ఆమె చేసిన ‘సామి స్క్వేర్‌’, ‘పందెం కోడి 2’,  రంగ్‌ దే, ‘అన్నాతే’ వంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాయి. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌ ‘పెంగ్విన్‌’, ‘మిస్‌ ఇండియా’, ‘గుడ్‌లక్‌ సఖి’ చిత్రాలూ సందడి చేయలేకపోయాయి. 

    కీర్తిని తీసేద్దామన్న డైరెక్టర్‌

    గతేడాది విడుదలైన ‘దసరా’ సినిమాతో కీర్తి భారీ విజయం సాధించి తిరిగి సక్సెస్‌ ట్రాక్‌లోకి అడుగుపెట్టింది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించి సత్తా చాటింది. ముఖ్యంగా కీర్తి సురేష్‌ నటనపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. వెన్నెల అనే గ్రామీణ యువతిగా ఆమె అదరగొట్టింది. ఉత్తమనటిగా సైమా, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సైతం అందుకుంది. అయితే వాస్తవానికి ఈ పాత్ర అయితే దసరా హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను తీసేద్దామని డైరెక్టర్‌ శ్రీకాంత్ ఓదెల భావించినట్లు ఆ మూవీ ప్రమోషన్స్‌ సందర్భంగా నాని చెప్పారు. మూవీ కథను కీర్తికి చెప్పిన డైరెక్టర్‌ ఆమెను 10-12 కిలోలు బరువు పెరగాలని సూచించారట. కానీ అందుకు తగ్గట్లు పెరగలేదట. దీంతో తన వద్దకు వచ్చి కీర్తి సురేష్‌ను తీసేద్దామని శ్రీకాంత్ ఓదెల అన్నట్లు నాని చెప్పారు. నువ్వు డెబ్యూ డైరెక్టర్‌వి, ఆమె నేషనల్ అవార్డ్ విన్నింగ్‌ నటి. ఇది జరగదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ విధంగా సినిమా సెట్స్‌పైకి వెళ్లడం వారిద్దరు మంచి ఫ్రెండ్స్‌ కావడం చకాచకా జరిగిపోయినట్లు నాని వివరించారు.

    కీర్తి స్పెషల్‌ టాలెంట్‌

    కీర్తి సురేష్‌ ముఖమే కాదు, గొంతు కూడా చాలా అందంగా ఉంటుంది. దీనిని గుర్తించిన దర్శకులు ఆమె వాయిస్‌తో మ్యాజిక్‌ చేయించారు. ‘సామి స్క్వేర్’ సినిమాలో కీర్తి ‘పుదు మెట్రో రైల్‌’ అనే పాటను చాలా అందంగా పాడింది. అంతేకాకుండా ఇటీవల వచ్చి కల్కి 2898 ఏడీ చిత్రంలో బుజ్జి వాహనానికి వాయిస్‌ అందించి ఆకట్టుకుంది. ‘గాంధారి’ ఆల్బమ్‌తో తనలో మంచి డ్యాన్సర్‌ ఉందని కూడా చాటి చెప్పింది.

    ఈ ఏడాది బాలీవుడ్‌లోకి..

    ఈ ఏడాది ఇప్పటికే ‘సైరన్‌’, ‘రఘుతాత’తో అలరించిన కీర్తి ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివేడి’, ‘ఉప్పు కప్పురంబు’తో బిజీగా ఉన్నారు. ‘బేబీ జాన్‌’ (Baby John)తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తన కెరీర్‌లో సావిత్రి (మహానటి), వెన్నెల (దసరా), కళావతి (సర్కారువారి పాట) పాత్రలు సవాలు విసిరాయని ఓ సందర్భంలో అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version