Tollywood Collections: జనవరి – డిసెంబర్.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tollywood Collections: జనవరి – డిసెంబర్.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు

    Tollywood Collections: జనవరి – డిసెంబర్.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు

    October 17, 2024

    టాలీవుడ్‌లో ఏటా పదుల సంఖ్యలో చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడితే మరొన్ని వసూళ్ల సునామి సృష్టిస్తుంటాయి. అయితే ప్రతి సంతవ్సరం ఏ సినిమా టాప్‌లో నిలిచిందన్న లెక్కలు బయటకు వస్తూనే ఉంటాయి. కానీ నెలల వారీగా ఏ సినిమా టాప్‌లో ఉందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ వివరాలను వెల్లడిస్తూ Yousay ఈ ప్రత్యేక కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. జనవరి నుంచి డిసెంబర్‌ వరకూ ఆయా నెలల్లో రిలీజైన చిత్రాల్లో కలెక్షన్స్‌ పరంగా ఏది అగ్రస్థానంలో నిలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం. 

    జనవరి 

    ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ‘హనుమాన్‌’ (Hanuman) చిత్రం రూ.350 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా జనవరిలో రిలీజైన తెలుగు చిత్రాలతో పోలిస్తే హనుమాన్ కలెక్షన్స్‌ పరంగా టాప్‌లో ఉంది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ నటుడు తేజ సజ్జ హీరోగా నటించాడు. 

    ఫిబ్రవరి

    ఫిబ్రవరిలో రిలీజైన చిత్రాల్లో ‘భీమ్లా నాయక్‌’ (Bheemla Nayak) కలెక్షన్స్‌ పరంగా అగ్రస్థానంలో ఉంది. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.193 కోట్లను కలెక్ట్‌ చేసింది. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌, రానా, నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌ ముఖ్య పాత్రలు పోషించారు.

    మార్చి

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ మార్చి నెలలో అగ్రభాగాన నిలిచింది. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.1300 కోట్లను వసూలు చేసింది. ఇందులో రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ హీరోలుగా నటించారు. 

    ఏప్రిల్‌ 

    2017 ఏప్రిల్ వచ్చిన ‘బాహుబలి 2’ (Bahubali 2)చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.1810 కోట్లను కొల్లగొట్టింది. తద్వారా ఏప్రిల్‌ నెలలో తిరుగులేని విధంగా టాప్‌లో నిలిచింది. ఓవరాల్‌గా చూస్తే కలెక్షన్స్‌ పరంగా రెండో భారతీయ చిత్రంగా ‘బాహుబలి 2’ నిలిచింది. ఇందులో ప్రభాస్‌, రానా, అనుష్క, సత్యరాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించారు. 

    మే

    మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ (Sarkaru vaari Pata)చిత్రం రూ.180 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి మే నెలలో టాప్‌లో నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రానికి పరుశురామ్‌ దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేసింది.

    జూన్‌

    ఈ ఏడాది జూన్‌లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా జూన్‌లో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచింది. ఇందులో ప్రభాస్‌ హీరోగా నటించగా కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు. 

    జులై

    రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా చేసిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రం కలెక్షన్ల పరంగా జులైలో నెం.1 స్థానంలో నిలిచింది. 2015లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.650 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాతోనే రాజమౌళి టాలెంట్‌ పాన్‌ ఇండియా స్థాయికి తెలిసింది.

    ఆగస్టు

    ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సాహో’ (Saaho) బాక్సాఫీస్‌ వద్ద రూ.445 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఆగస్టులో టాప్‌లో ఉంది. 2019లో వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా చేసింది. 

    సెప్టెంబర్

    గత నెల సెప్టెంబర్‌ రిలీజైన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం వసూళ్ల పరంగా సెప్టెంబర్‌లో టాప్‌లో నిలిచింది. తారక్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.341 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటికీ విజయవంతంగా బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతోంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ పాత్రలో కనిపించారు. 

    అక్టోబర్‌

    మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ (Syra Narasimha Reddy) 2019 అక్టోబర్‌లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.240.60 కోట్లు రాబట్టి అక్టోబర్‌లో టాప్‌లో నిలిచింది. ఈ మూవీకి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. 

    నవంబర్‌ 

    టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత కలెక్షన్స్‌ పరంగా నవంబర్‌లో నెం.1గా ఉంది. 2022లో ఆమె నటించి యశోద (Yashoda) చిత్రం ఈ నెలలోనే రిలీజై రూ.33 కోట్లు రాబట్టింది. ఈ సినిమాకు హరి శంకర్ – హరీష్ నారాయణ్ ద్వయం దర్శకత్వం వహించారు.

    డిసెంబర్‌

    గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘సలార్‌’ (Salaar) చిత్రం రూ.700 కోట్లు కొల్లగొట్టి ఈ నెలలో టాప్‌లో ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్య పాత్ర పోషించాడు. హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌ చేసింది. ఈ మూవీకి సీక్వెల్‌ కూడా రూపొందనుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version