తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. డీజే టిల్లు సినిమా సక్సెస్‌తో యూత్‌లో మంచి గుర్తింపు పొందాడు. తనదైన స్లాంగ్, మెనరిజంతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరి యూత్‌ను ఆకట్టుకున్న సిద్ధు జొన్నలగడ్డ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.
సిద్ధు జొన్నల గడ్డ అసలు పేరు?
సిద్ధార్థ జొన్నలగడ్డ
సిద్ధు జొన్నల గడ్డ ఎత్తు ఎంత?
5’.7” (175 cms)
సిద్ధు జొన్నలగడ్డ తొలి సినిమా?
జోష్ చిత్రం ద్వారా సిద్ధు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
హీరోగా అతను నటించిన తొలి చిత్రం ‘పెళ్లికి ముందు జీవితం’
సిద్ధు జొన్నలగడ్డ ఎక్కడ పుట్టాడు?
హైదరాబాద్, తెలంగాణ
సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన తేదీ ఎప్పుడు?
1992
సిద్ధు జొన్నలగడ్డకు వివాహం అయిందా?
ఇంకా కాలేదు
సిద్ధు జొన్నల గడ్డ ఫెవరెట్ హీరోయిన్?
సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన సినిమా?
అర్జున్ రెడ్డి, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, అల వైకుంఠపురములో
సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన హీరో?
సిద్ధు జొన్నలగడ్డ తొలి హిట్ సినిమా?
గుంటూరు టాకీస్ చిత్రం సిద్ధు జొన్నలగడ్డకు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే డిజే టిల్లు చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.
సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన కలర్?
బ్లాక్
సిద్ధు జొన్నలగడ్డ తల్లిదండ్రుల పేర్లు?
శారద, సాయి కుమార్ జొన్నలగడ్డ
సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన ప్రదేశం?
హైదరాబాద్
సిద్ధు జొన్నలగడ్డ ఏం చదివాడు?
ఇంజనీరింగ్, MBA
సిద్ధు జొన్నలగడ్డ అభిరుచులు
బైక్ రైడింగ్, మోడలింగ్
సిద్ధు జొన్నలగడ్డ ఎన్ని సినిమాల్లో నటించాడు?
సిద్ధు 2024 వరకు 13 సినిమాల్లో నటించాడు.
సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన ఆహారం?
బిర్యాని
సిద్ధు జొన్నలగడ్డ నికర ఆస్తుల విలువ ఎంత?
రూ. 7కోట్లు
సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి ఎంత తీసుకుంటాడు?
సిద్ధు ఒక్కో సినిమాకి దాదాపు 2 నుంచి 3 కోట్లు తీసుకుంటాడు .
సిద్ధు జొన్నలగడ్డకు స్మోకింగ్ అలవాటు ఉందా?
చాలా సందర్భాల్లో స్మోకింగ్ అలవాటు ఉందని చెప్పాడు
సిద్ధు జొన్నలగడ్డ మద్యం తాగుతాడా?
అవును, వీక్లీ వన్స్ తాగుతానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు
సిద్దు జొన్నలగడ్డ నిక్ నేమ్ ఏంటి?
స్టార్ బాయ్ సిద్ధూ
సిద్ధు జొన్నలగడ్డకు తోబుట్టువులు ఉన్నారా?
ఒక అన్నయ్య ఉన్నారు. అతని పేరు చైతన్య జొన్నల గడ్డ
సిద్ధు జొన్నలగడ్డ రైటర్‌గా పనిచేసిన చిత్రాలు?
సిద్ధు మంచి నటుడే కాకుండా రైటర్, సింగర్, లిరికిస్ట్, ఎడిటర్ కూడా. ‘క్రిష్ణ అండ్ హీస్ లీలా’, ‘మా వింత గాధ వినుమా’, ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలకు రైటర్‌గా పనిచేశారు.
సిద్ధు జొన్నలగడ్డ స్వయంగా పాడిన పాటలు ఏవి?
గుంటూరు టాకీస్ ‘టైటిల్ ట్రాక్’, నరుడా ఢోనరుడా సినిమాలో ‘కాసు పైసా’, ‘పెళ్లి బీటు’ పాటలను సిద్ధు పాడాడు. అలాగే మా వింత గాధ వినుమాలో ‘షయార్-ఈ-ఇష్క్’, డీజే టిల్లులో ‘నువ్వలా’ సాంగ్స్ పాడి అలరించాడు.
సిద్ధు జొన్నలగడ్డ రాసిన పాటలు ఏవి?
జాణ (మా వింత గాధ వినుమ), ఓ మై లిల్లీ (టిల్లు స్క్వేర్)
సిద్దు జొన్నలగడ్డ ఇప్పటివరకూ చేసిన ఏకైక వెబ్‌సిరీస్?
2018లో వచ్చిన ‘గ్యాంగ్‌స్టర్స్’ సిరీస్‌లో సిద్ధు నటించాడు. అది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ తర్వాత సిద్ధు ఏ వెబ్‌సిరీస్‌లో చేయకపోవడం గమనార్హం.
సిద్ధు జొన్నలగడ్డకు గర్ల్ ఫ్రెండ్ ఉందా?
గతంలో ఓ అమ్మాయిని ప్రేమించినట్లు సిద్ధు ఓ ఇంటర్యూలో తెలిపాడు. అయితే అది మధ్యలోనే బ్రేకప్ అయినట్లు తెలిపాడు. ప్రస్తుతం సిద్దూ ఎవరితోనూ రిలేషన్‌లో లేడు.
సిద్ధు జొన్నలగడ్డ ఫేవరేట్ బాలీవుడ్ హీరో ఎవరు?
రణ్‌బీర్ కపూర్
సిద్ధు జొన్నలగడ్డ హెయిల్ కలర్ ఏంటి?
నలుపు
సిద్ధు జొన్నలగడ్డ ఫేమస్ హెయిర్ స్టైల్ ఏది?
డీజే టిల్లు కోసం అతడు యూనిక్ హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. దీన్ని తెలుగులో సరదాగా ‘పిచుక గూడు’ స్టైల్ అని అంటున్నారు. టిల్లు స్క్వేర్‌లోనూ ఇదే హెయిర్ స్టైల్‌లో సిద్ధూ కనిపించాడు.
సిద్ధు జొన్నలగడ్డ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏవి?
‘జాక్’, ‘తెలుసు కదా’, ‘టిల్లు క్యూబ్’..
సిద్ధు జొన్నలగడ్డ చేసిన టిల్లు పాత్ర ఎలా పుట్టింది?
టిల్లు పాత్ర కల్పితం. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి, చిలకలగూడ, వారాసిగూడ, సికింద్రాబాద్ ఏరియాల్లో ఉన్నప్పుడు తన అనుభవాలు, ఎదురైన వ్యక్తుల నుంచి ఈ డీజే టిల్లు పాత్ర పుట్టిందని సిద్ధు ఓ ఇంటర్యూలో తెలిపారు.
సిద్ధు జొన్నలగడ్డ చేసిన మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్ ఏవి?
సిద్ధు కెరీర్‌లో మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్ రెండు ఉన్నాయి. అందులో ఒకటి గుంటూరు టాకీస్‌లోని ‘నీ సొంతం’ సాంగ్. ఇందులో యాంకర్ రష్మీతో కలిసి సిద్ధు చేసే రొమాన్స్ అప్పట్లో కుర్రకారును ఫిదా చేశాయి. అలాగే టిల్లు స్క్వేర్‌లోనూ సిద్ధూ జొన్నలగొడ్డ రెచ్చిపోయాడు. ‘ఓ మై లిల్లీ’ సాంగ్‌లో హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్‌తో కలిసి లిప్ కిస్ సీన్లలో నటించాడు. ఆ రెండు సాంగ్స్‌పై ఓ లుక్కేయండి.
సిద్దు జొన్నలగడ్డ బెస్ట్ డైలాగ్స్
డీజే టిల్లులో రాధిక హత్య చేసిన వ్యక్తిని.. టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) పాతిపెట్టే క్రమంలో వచ్చే డైలాగ్స్ ది బెస్ట్ అని చెప్పవచ్చు.
రాధిక: హేయ్.. అక్కడ రాయి ఉంది చూస్కో
టిల్లు: ఐ హావ్ వన్ సజిషన్ ఫర్ యూ.. పోయి కారులో ఏసీ ఆన్ చేసుకొని రిలాక్స్‌గా స్విగ్గీ ఓపెన్ చేసి ఓ ఫ్రెష్ వాటర్ మిలాన్ జ్యూస్ ఆర్డర్ చేసుకొని రిలాక్స్‌గా నువ్వు.
“మనం చేసేదే లంగా పని పైగా కాంట్రిబ్యూషన్ లేదు నీది. పైగా ఉప్పర్ సే బొంగులో కరెక్షన్స్ అన్ని చెబుతున్నావ్”
“ ప్లీజ్ నువ్వేళ్లి రిలాక్స్ గా. నాకు అలవాటే ఈ శవాలు పాతిపెట్టుడు. నేను రోజూ చేసే పనే ఇది. ఫినిష్ చేసుకొని వస్తా.
కొద్దిసేపటి తర్వాత..
టిల్లు : ఏం చేస్తాడు ఇతను (చనిపోయిన వ్యక్తి).. సాఫ్ట్‌వేరా?
రాధిక: ఫొటోగ్రఫీ.. టూ మూవీస్‌కు కెమెరామెన్‌గా పనిచేశాడు
టిల్లు: చాలా అన్‌ఫార్చ్యూనెట్లీ ఇట్లా అయిపోయింది. ఏజ్ కూడా బాగా తక్కువే. హీ నెవర్ సీ సక్సెస్ బీకాజ్ ఆఫ్ యూ
టిల్లు స్క్వేర్‌లో సిద్దు జొన్నలగడ్డ చెప్పిన టాప్ డైలాగ్స్ ఏవి?
ఈ సినిమాలో టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) తన తండ్రితో చెప్పిన ఓ డైలాగ్‌కు కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సీన్ ఏంటంటే..
డైలాగ్
టిల్లు తన తండ్రితో: వచ్చిండయ్యా రియల్ ఏస్టేట్ ఐకూన్
టిల్లు తల్లి : డాడీతో గట్లనా మాట్లాడేది
టిల్లు : అట్లకాదు మమ్మీ.. నేనున్న ప్రెజర్‌కి పచ్చి బియ్యం తింటే అది కడుపులోకి వెళ్లాక అన్నం అయ్యేట్లు ఉంది
డైలాగ్
ఓ సీన్‌లో…… లిల్లీ (అనుపమా పరమేశ్వరన్) మా పరిస్థితి అర్థం చేసుకో అని టిల్లుతో అంటుంది. అప్పుడు టిల్లూ చెప్పే డైలాగ్ థియేటర్లను నవ్వులతో దద్దరిల్లేలా చేసింది.
టిల్లు : నేను ఎవరి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. ప్రతీసారి మీరొచ్చి మీ శాడ్ స్టోరీలు చెప్పుడు.. ఆ బాధలన్ని విని నేను మీ ప్రాబ్లమ్‌ను నా ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యి.. ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయడానికి టిప్పు సుల్తాన్ లాగా దూరి దాంట్లోకి.. మల్లా లాస్ట్‌కి నేనే ఫీలై మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాపు మూసుకొనుడు ఏందే తూ..
డైలాగ్
లిల్లీ : నువ్వుమాట మీద నిలబడే మనిషివి కాదా టిల్లు?
టిల్లు : నిలబడా నేను.. వేస్ట్. తాగకముందు 30 చెప్తా.. తాగినాక తొంబై చెప్తా నేను. నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతోటి పెట్టుకోకండ్రి
డైలాగ్
లిల్లీతో టిల్లు: చెప్పు రాధిక నీకు ఏం కావాలి?. నేను నీకు ఎలా సాయపడగల్గుతాను రాధిక. ఈ సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావ్ చెప్పు రాధిక.
లిల్లీ: రాధిక ఎవరు నా పేరు లిల్లీ
టిల్లు : “నీ పేరు లిల్లీ ఏమో గానీ.. నువ్వు మనిషివైతే 100% రాధికవు నువ్వు. ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువు నువ్వు.
మీరందరూ కూడా ఒక రాధిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఈడ యాడా ఉండదు. అదెక్కడో గుట్ట మీద ఉంటది.
అక్కడ రాధికలందరూ లైన్‌గా నిలబడి బైనాక్యూలర్లు వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పాగాళ్లు యాడున్నారు.. ఎవర్నీ హౌలా గాళ్లను చేద్దాం అని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటగా అది.
నేను పోయినసారి నీ సూపర్ సీనియర్‌ను కలిసినా రాధిక ఆమె పేరు. చాలా బాగా ర్యాంగింగ్ చేసింది. ఎంజాయ్ చేసినా నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.. దాని గురించి
టాలీవుడ్ సెలబ్రిటీలతో సిద్దు జొన్నలగడ్డ దిగిన ఫొటోలు
సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్ స్టైలిష్ ఫొటోలు
సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కారు కలెక్షన్స్‌సిద్ధు ప్రస్తుతం రేంజ్ రోవర్ కారు వినియోగిస్తున్నాడు. ఈ కారులోనే తన సినిమా ఫంక్షన్లకు హాజరవుతున్నాడు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం