Women Smart Watches: అమ్మాయిల స్మార్ట్‌వాచ్‌లపై అమెజాన్‌ భారీ ఆఫర్లు.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్‌! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Women Smart Watches: అమ్మాయిల స్మార్ట్‌వాచ్‌లపై అమెజాన్‌ భారీ ఆఫర్లు.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్‌! 

    Women Smart Watches: అమ్మాయిల స్మార్ట్‌వాచ్‌లపై అమెజాన్‌ భారీ ఆఫర్లు.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్‌! 

    October 11, 2023

    ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌ల వినియోగం భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ జనరేషన్‌ యువత స్మార్ట్‌వాచ్‌లను ధరించడం ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. దీనిని గమనించిన పలు టెక్‌ కంపెనీలు అత్యాధునిక స్మార్ట్‌ వాచ్‌లను మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. అబ్బాయిలతో పాటు యువతుల కోసం కూడా ప్రత్యేకంగా స్మార్ట్‌వాచ్‌లను తీసుకొస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ (Great Indian Festival) సేల్‌ నడుస్తోంది. మహిళల స్మార్ట్‌వాచ్‌లపై మంచి డీల్స్‌ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌ సగం ధరకే బ్రాండెడ్‌ వాచ్‌లను ఆఫర్‌ చేస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

    Fire-Boltt Phoenix Smart Watch

    ఫైర్‌ బోల్ట్‌ (Fire Boltt) రిలీజ్‌ చేసే స్మార్ట్‌వాచ్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఆ కంపెనీ తీసుకొచ్చిన Fire-Boltt Phoenix Smart Watch అమ్మాయిల చేతికి అద్భుతమైన లుక్‌ తీసుకొస్తుంది.  ఈ వాచ్‌ 1.3 అంగుళాల డిస్‌ప్లే, బ్లూటూత్‌ కాలింగ్‌, 120+ స్పోర్ట్స్‌ మోడ్స్‌ , SpO2, Heart Rate మానిటర్‌ ఫీచర్లను కలిగి ఉంది. ఈ వాచ్‌ అసలు ధర రూ.5,999. కానీ, అమెజాన్‌ 80% డిస్కౌంట్‌తో రూ.1,199 వాచ్‌ను అందిస్తోంది. 

    Noise Pulse 2 Max 


    ఈ వాచ్‌ 1.85 అంగుళాల స్క్రీన్‌ కలిగి ఉంది. బ్లూటూత్‌ కాలింగ్‌ (Bluetooth Calling), 10 రోజుల బ్యాటరీ లైఫ్‌, 550 NITS బ్రైట్‌నెస్‌, 100 స్పోర్ట్స్‌ మోడ్స్‌ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. Noise Pulse 2 Max మల్టిపుల్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. పింక్‌ కలర్‌ అమ్మాయిలకు సరిగ్గా సరిపోతుంది. 

    Vibez by Lifelong Ruby

    ఈ స్మార్ట్‌వాచ్‌ ప్రత్యేకంగా మహిళల కోసమే తయారు చేశారు. Female Cycle Tracker దీనిలోని స్పెషల్‌ ఫీచర్‌గా చెప్పుకోవచ్చు. ఈ వాచ్‌ 1.04 అంగుళాల AMOLED స్క్రీన్‌, మెటల్‌ పట్టీ, వాయిస్‌ అసిస్టెన్స్‌ (Voice Assistance), వాటర్‌ రెసిస్టెన్స్‌ కోసం IP68 రేటింగ్‌, హెల్త్‌ మానిటర్‌ (Health Monitor) ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని అసలు ధర రూ.11,999. పండగ సేల్‌లో భాగంగా అమెజాన్‌ రూ.3,199 దీనిని అందిస్తోంది. 

    boAt Wave Sigma Smartwatch 

    బోట్‌ నుంచి కూడా యువతుల కోసం మంచి స్మార్ట్‌వాచ్‌ అందుబాటులో ఉంది. boAt Wave Sigma వాచ్‌ అమెజాన్‌ సేల్‌లో తక్కువ ధరకే లభిస్తోంది. దీని ఒరిజినల్‌ ప్రైస్‌ రూ. 7,499 కాగా అమెజాన్ దీనిని 85% తగ్గింపుతో రూ.1,099కే అందిస్తోంది. ఈ వాచ్‌ 2.01 అంగుళాల లార్జ్‌ HD డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్లూటూత్‌ కాలింగ్‌, 700+ యాక్టివ్‌ మోడ్స్‌, HR & SpO2 మానిటరింగ్‌, IP67 రేటింగ్‌ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

    Fire-Boltt Ninja

    ఫైర్‌ బోల్డ్‌ కంపెనీ నుంచే వచ్చిన నింజా సిరీస్‌ స్మార్ట్‌వాచ్‌లు కూడా అమెజాన్‌లో మంచి రేటింగ్‌ కలిగి ఉంది. ఇది యూని సెక్స్‌ (Uni Sex) వాచ్‌. పురుషులతో పాటు స్త్రీలు కూడా వాడవచ్చు. ఈ వాచ్‌ 1.69 అంగుళాల డిస్‌ప్లే, AI వాయిస్‌ అసిస్టెన్స్‌, 100 స్పోర్ట్స్‌ మోడ్స్‌, SpO2 & హార్ట్‌ రేట్‌ మానిటరింగ్‌ ఫీచర్లను కలిగి ఉంది. ఇది రూ.1,099 సేల్‌ అవుతోంది. 

    CrossBeats Ignite GRIT 

    జిమ్‌, ఫిట్‌నెస్‌ వర్కౌట్స్‌ చేసే యువతులకు ఈ వాచ్‌ చాలా ప్రయోజనకరంగా ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌ 1.83 అంగుళాల AMOLED స్క్రీన్‌తో పాటు అడ్వాన్స్‌డ్‌ బ్లూటూత్‌ కాలింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. అలాగే AI హెల్త్‌ సెన్సార్లు, 150+ స్పోర్ట్స్‌ మోడ్స్‌, 250+ వాచ్‌ ఫేసెస్‌, గేమ్స్‌, 15 రోజుల బ్యాటరీ లైఫ్‌ ఇందులో ఉన్నాయి. దీని అసలు ధర రూ. 9,999. అమెజాన్‌ పండగ సేల్‌లో భాగంగా ఈ వాచ్‌ రూ.2,299 లభిస్తోంది. 

    pTron Smartwatch 

    రూ. 1000 లోపు బెస్ట్‌ స్మార్ట్‌వాచ్‌ కోరుకునే అమ్మాయిలు..దీనిని ట్రై చేయవచ్చు. pTron Smartwatch 1.85 అంగుళాల టచ్‌ డిస్‌ప్లే, 600 NITS బ్రైట్‌నెస్‌, డిజిటల్‌ క్రౌన్‌ (Digital Crown), 100+ వాచ్‌ ఫేసెస్‌ (100+ Watch Faces), స్పోర్ట్స్‌ మోడ్‌, 5 రోజుల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది. దీని అసలు ధర రూ.3,999 కాగా, అమెజాన్‌ ఈ వాచ్‌ను 78% డిస్కౌంట్‌తో రూ.899 అందిస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version