Sai Pallavi: చెన్నై ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో దుమ్ములేపిన సాయిపల్లవి.. వీడియో వైరల్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sai Pallavi: చెన్నై ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో దుమ్ములేపిన సాయిపల్లవి.. వీడియో వైరల్‌

    Sai Pallavi: చెన్నై ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో దుమ్ములేపిన సాయిపల్లవి.. వీడియో వైరల్‌

    December 21, 2024

    టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయి పల్లవి (Sai Pallavi) గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్‌’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ఆ సినిమాతో ఎనలేని పేరును సంపాదించింది. ‘ఫిదా’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్‌ హృదయాలను గెలుచుకుంది. అద్భుతమైన నటన, మిస్మరైజింగ్‌ డ్యాన్స్‌తో అందరిని ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ‘అమరన్‌’ అనే చిత్రంలో సాయిపల్లవి నటించింది. అందులో అద్భుతమైన నటన కనబరిచి ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఆ చిత్రానికి గాను తాజాగా ఉత్తమనటి అవార్డు అందుకొని నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. 

    ఉత్తమ నటిగా సాయిపల్లవి..

    తమిళ చిత్ర పరిశ్రమ ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Chennai International Film Festival) వేడుకలు తాజాగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కోలీవుడ్‌ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సందడి చేశారు. ఈ ఏడాది విడుదలై సత్తా చాటిన చిత్రాలు, తమ ప్రతిభతో ఆకట్టుకున్న సెలబ్రిటీలకు అవార్డులు అందించారు. ఇందులో భాగంగా ‘అమరన్‌’ చిత్రానికి గాను సాయిపల్లవి (Sai Pallavi) ఉత్తమనటి (Best Actress Award)గా ఎంపికైంది. ఇందులో ఆమె పోషించిన ఇందు రెబకా పాత్ర ప్రేక్షకుల హృదయాలను బాగా హత్తుకోవడంతో బెస్ట్‌ యాక్ట్రెస్‌ అవార్డును సాయి పల్లవికి అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తమ నటిగా సాయిపల్లవి ఎంపిక చేయడం నూటికి నూరు శాతం సరైన నిర్ణయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అవార్డు అందుకుంటున్న వీడియోను తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. 

    సాయిపల్లవి రియాక్షన్‌..

    అమరన్’ చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఎంపిక కావడంపై సాయిపల్లవి స్పందించింది. ‘22వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నందుకు నాకెంతో సంతోషం, గర్వంగా ఉంది. ఈ ఏడాది ఎన్నో గొప్ప చిత్రాలు విడుదలయ్యాయి. ఎంతో పోటీ నెలకొంది. అలాంటి సమయంలో ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. నా అభిమానులకు ధన్యవాదాలు. వారు చూపించే ప్రేమ నన్నెంతో భావోద్వేగానికి గురి చేస్తుంటుంది. దేశం కోసం నిరంతరం శ్రమిస్తోన్న ఒక జవాను కథ (అమరన్‌) ఇది. రాజ్‌కుమార్‌ పెరియాసామి వంటి దర్శకులే ఇలాంటి మరెన్నో కథలు మనకు అందించగలరు’ అని సాయిపల్లవి తెలిపారు. 

    క్యూట్‌ లుక్స్‌కు ఫిదా.. 

    చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేడుకలకు సాయిపల్లవి ట్రెడిషనల్ లుక్‌లో హాజరైంది. సంప్రదాయ పద్దతిలో చీరకట్టుకొని అక్కడి వారిని సర్‌ప్రైజ్‌ చేసింది. ఈవెంట్‌లో క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ అక్కడి వారిని ఫిదా చేసింది. వాటన్నింటిని ఒక దగ్గర చేర్చిన ఆమె అభిమానులు స్లోమోషన్‌ వీడియోను క్రియేట్ చేశారు. దానిని సోషల్‌ మీడియాలో పోస్టు చేసి ట్రెండ్‌ చేస్తున్నారు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. సాయిపల్లవి అందానికి మైమరిచిపోతున్నారు. ఆమె నవ్వు చాలా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘క్యూట్‌నెస్‌ ఓవర్‌ లోడింగ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలపై మీరు లుక్కేయండి. 

    నాల్గో స్థానంలో సాయిపల్లవి..

    నవంబర్‌ నెలలో దేశంలోనే అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టాప్‌ – 10 హీరోయిన్ల జాబితాను ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ విడుదల చేసింది. ఇందులో సాయిపల్లవి దేశంలోనే టాప్‌- 4 స్థానంలో నిలిచింది. స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇందులో ఫస్ట్‌ ప్లేస్‌ సొంతం చేసుకుంది. అలియా భట్‌, నయనతార రెండు మూడు స్థానాల్లో నిలిచారు. దీపికా పదుకొనే (5వ), త్రిష (6వ), కాజల్‌ అగర్వాల్‌ (7వ), రష్మిక మందన్న (8వ), శ్రద్ధా కపూర్‌ (9వ), కత్రినా కైఫ్‌ (10వ) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version