• TFIDB EN
  • లవ్ యు శంకర్ (2024)
    U/ATelugu

    8 ఏళ్ల శివాంష్ అనే బాలుడికి ఓ ప్రమాదం తర్వాత గత జన్మ గుర్తుకు వస్తుంది. తాను రుద్రుడినని, గొప్ప శివ భక్తుడినని తెలుసుకుంటాడు. గురువు సిద్ధేశ్వరుడు అన్యాయంగా తనను చంపినట్లు గ్రహిస్తాడు. రుద్రుడి జన్మకు న్యాయం చేయాలని భావించి వారణాసికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ

    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    శ్రేయాస్ తల్పాడే
    హేమంత్ పాండే
    సిబ్బంది
    రాజీవ్ S. రుయాదర్శకుడు
    తేజస్ దేశాయ్నిర్మాత
    సునీతా దేశాయ్నిర్మాత
    కథనాలు
    <strong>Summer Heroines 2024: వేసవి హీట్‌ మరింత పెంచేందుకు సిద్ధమవుతున్న అందాలు భామలు వీరే!&nbsp;</strong>
    Summer Heroines 2024: వేసవి హీట్‌ మరింత పెంచేందుకు సిద్ధమవుతున్న అందాలు భామలు వీరే!&nbsp;
    సమ్మర్‌ అంటే తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద పండగ లాంటిది. స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవుల నేపథ్యంలో చిన్న, పెద్ద సినిమాలు సమ్మర్‌లో విడుదలయ్యేందుకు ఆసక్తి కనబరుస్తాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్‌లో వినోదాలు పంచడానికి పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా అందులోని కథానాయకులు వేసవి హీట్‌ను తమ అందచందాలతో మరింత పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఆ భామలు ఎవరు? వారు నటించిన చిత్రాలు ఏంటి? అవి ఎప్పుడు విడుదలవుతాయి? వంటి అంశాలు ఈ కథనంలో చూద్దాం.&nbsp; మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) ‘సీతా రామం’, ‘హాయ్‌ నాన్న’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మృణాల్‌ ఠాకూర్‌.. ఈ సమ్మర్‌లో సరికొత్త మూవీతో వస్తోంది. యంగ్‌ హీరో విజయ్‌ నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) చిత్రంతో ఈ భామ టాలీవుడ్‌లో మరోమారు సందడి చేయబోతోంది. ఈ మూవీ ఏప్రిల్‌ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది.&nbsp; దివ్యాంశ కౌషిక్‌ (Divyansha Kaushik) ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా ద్వారా అలరించనున్న మరో నటి దివ్యాంశ కౌషిక్‌. ఇందులో ఈ భామ సెకండ్‌ హీరోయిన్‌గా చేస్తోంది. 2019లో వచ్చిన మజిలీ సినిమా ద్వారా దివ్యాంశ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత రామారావు ఆన్‌ డ్యూటీ, పోలీసు వారి హెచ్చరిక, మైఖేల్‌ తదితర చిత్రాల్లో నటించింది.&nbsp; అంజలి (Anjali) ప్రముఖ హీరోయిన్‌ అంజలి కూడా ఈ వేసవిని మరింత హీటెక్కించేందుకు రెడీ అవుతోంది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌ను మరోమారు పలకరించనుంది. ఈ చిత్రం ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్‌, షకలక శంకర్ ముఖ్యపాత్రలు పోషించారు.&nbsp; స్వర్ణిమా సింగ్‌ (Swarnima Singh) హర్షివ్‌ కార్తీక్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బహుముఖం' (Bahumukham). 'గుడ్‌, బ్యాడ్ యాక్టర్‌' అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సినిమాలో స్వర్ణిమా సింగ్‌ కథానాయికగా చేసింది. తన అందం, అభినయంతో ఆకట్టుకునేందుకు ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.&nbsp; మీనాక్షి గోస్వామి (Meenakshi Goswami) మీనాక్షి గోస్వామి కథానాయికగా చేసిన లేటెస్ట్‌ చిత్రం 'భరతనాట్యం'. ఈ మూవీ ద్వారానే మీనాక్షి తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా సూర్యతేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్నాడు. సినిమా ఓ యువకుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందన్న కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రనీకాన్వికా (Praneekaanvikaa) ఏప్రిల్‌లో విడుదల కాబోతున్న మరో చిన్న చిత్రం 'మార్కెట్‌ మహాలక్ష్మీ'. కేరింత ఫేమ్‌ పార్వతీశం హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రణీకాన్వికా నటించింది. ఇదే ఆమెకు మెుదటి సినిమా. ఈ మూవీ విజయం ద్వారా తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకోవాలని ఈ బ్యూటీ భావిస్తోంది. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.&nbsp; కోమలి ప్రసాద్‌ (Komali Prasad)&nbsp; యంగ్‌ హీరోయిన్‌ కోమలి ప్రసాద్‌ కూడా.. ఈ వేసవిలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ‘శశివదనే’ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌ను పలకరించనుంది. ఏప్రిల్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది. ‘నేను సీతాదేవి’ (2016) చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన కోమలి.. ‘హిట్‌ 2’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. శశివదనే సినిమా విజయంపై ఈ బ్యూటీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.&nbsp; వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ‘బేబీ’ సినిమా సెక్సెస్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయిన హీరోయిన్‌ వైష్ణవి చైతన్య. ఈ భామ నటించిన రెండో చిత్రం 'లవ్‌ మి ఇఫ్‌ యు డేర్‌' కూడా ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ నెల 25 నుంచి తెలుగు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయనుంది.&nbsp;
    ఏప్రిల్ 03 , 2024
    <strong>This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని&nbsp; అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!</strong>
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని&nbsp; అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    గత కొన్ని వారాలుగా స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు టెనెంట్‌ హాస్య నటుడు సత్యం రాజేష్‌ (Satyam Rajesh) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'టెనెంట్‌' (Tenant). ఏప్రిల్‌ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. వై. యుగంధర్ దర్శకత్వం వహించారు. ప్రేమ పెళ్లి తర్వాత సంతోషంగా సాగాల్సిన హీరో జీవితం ఎలాంటి అనూహ్య మలుపులు తిరిగింది? అన్నది కథ. శశివదనే రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటించిన ప్రేమకథ చిత్రం 'శశివదనే' (Sasivadane). సాయి మోహన్‌ ఉబ్బర దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్‌ 19న విడుదల కానుంది. గోదావరి నేపథ్యంలో ఈ&nbsp; ప్రేమ కథ సాగనుంది. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijathaparvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు. ఈ మూవీ ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశం నవ్వులు పూయిస్తోంది.&nbsp; లవ్‌ మౌళి అవనీంద్ర దర్శకత్వంలో నవ్‌దీప్‌ హీరోగా చేసిన సినిమా 'లవ్‌ మౌళి' (Love Mouli). ఇందులు పంకురి గిద్వానీ హీరోయిన్‌గా చేసింది. ఏప్రిల్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రేమ అనేది లేకుండా మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి.. లవ్‌ దొరికితే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. మార్కెట్‌ మహాలక్ష్మీ కేరింత ఫేమ్‌ పార్వతీశం ఈ సినిమా (Market Mahalakshmi)లో హీరోగా చేశాడు. వీఎస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అఖిలేష్‌ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్‌, మహబూబ్‌ భాషా, ముక్కు అవినాష్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 19న ఈ మూవీ రిలీజ్‌ కానుంది.&nbsp; శరపంజరం నవీన్‌కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘శరపంజరం’ (Sarapanjaram). లయ కథానాయిక. ఈ మూవీ ఏప్రిల్‌ 19న థియేటర్‌లలో విడుదల కానుంది. ‘జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల కష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మార‌ణాయుధం సీనియర్‌ నటి మాలాశ్రీ.. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నటించిన తాజా చిత్రం ‘మార‌ణాయుధం’ (Maaranaayudham). గురుమూర్తి సునామి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం.. గతేడాది కన్నడలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులనూ అలరించడానికి సిద్ధమైంది. ఏప్రిల్‌ 19న ‘మారణాయుధం’ థియేటర్‌లలో విడుదల కానుంది. లవ్‌ యూ శంకర్‌&nbsp; దర్శకుడు రాజీవ్‌ ఎస్‌.రియా.. ‘మై ఫ్రెండ్‌ గణేశా’ యానిమేషన్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ‘లవ్‌ యూ శంకర్‌’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రేయాస్‌ తల్పాడే, తనీషా జంటగా నటించారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు సైరెన్‌ జ‌యం ర‌వి (Jayam Ravi) క‌థానాయ‌కుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరెన్’ (Siren). ఫిబ్రవరి 16న కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఏప్రిల్ 19 నుంచి ఈ మూవీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా సైరన్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇందులో జయం రవితో పాటు కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. మై డియర్ దొంగ&nbsp; ఓటీటీలోకి నేరుగా మరో కామెడీ మూవీ వస్తోంది. అభినవ్ గోమటం, షాలిని, దివ్య శ్రీపాద నటించిన ‘మై డియర్ దొంగ’ (My Dear Donga) మూవీ.. ఏప్రిల్ 19 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.&nbsp; ఓ అమ్మాయి ఇంట్లోకి దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌చ్చిన యువ‌కుడు.. అనుకోని ప‌రిస్థితుల్లో అక్క‌డే బందీగా చిక్కుకుపోతే ఏం జ‌రిగింది? దొంగ‌కు, యువ‌తికి మ‌ధ్య ఏర్ప‌డిన స్నేహం ఎలాంటి మ‌లుపులకు కారణమైంది? అన్న కథతో ఈ మూవీ రూపొందింది. కాటేరా కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ నటించిన చిత్రం కాటేరా (Kaatera). తరుణ్‌ సుధీర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా కన్నడ వెర్షన్‌ ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ‘జీ 5’ వర్గాలు ప్రకటించాయి. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateAnyone but YouMovieEnglishNetflixApril 15Rebel MoonMovieEnglishNetflixApril 19Chief Detective 1958SeriesKoreanDisney + HotstarApril 19SirenMovieTeluguDisney + HotstarApril 19My Dear DongaMovieTeluguAhaApril 19Dream ScenarioMovieEnglishLions Gate PlayApril 19The Tourist S2SeriesEnglishLions Gate PlayApril 19Pon Ondru KandenMovieTamilJio CinemaApril 14The SympathizerSeriesEnglishJio CinemaApril 14Article 370MovieHindiJio CinemaApril 19Quizzer Of The YearSeriesEnglishSonyLIVApril 15Dune: Part TwoMovieEnglishBook My ShowApril 16
    ఏప్రిల్ 15 , 2024
    Gopichand Bhimaa Review: యాక్షన్‌ సీక్వెన్స్‌ల్లో గోపిచంద్‌ శివతాండవం.. ‘భీమా’ మూవీ హిట్టా? ఫట్టా?
    Gopichand Bhimaa Review: యాక్షన్‌ సీక్వెన్స్‌ల్లో గోపిచంద్‌ శివతాండవం.. ‘భీమా’ మూవీ హిట్టా? ఫట్టా?
    నటీనటులు : గోపిచంద్‌, ప్రియా భవాని శంకర్‌, మాళవిక శర్మ, వెన్నెకల కిషోర్‌, రఘుబాబు, నాజర్‌, నరేష్‌, ముఖేష్‌ తివారి, పూర్మ, రోహిణి, సరయూ, చమ్మక్‌ చంద్ర తదితరులు&nbsp; దర్శకుడు : ఎ. హర్ష సంగీతం : రవి బస్రూర్‌ సినిమాటోగ్రఫీ : స్వామి జె. గౌడ నిర్మాణ సంస్థ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాత : కె. కె. రాధామోహన్‌ మాచో హీరో గోపీచంద్ (Gopichand) నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’ (Bhimaa). కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. యువ హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్, ప్రమోషన్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. కాగా, మార్చి 8న మహా శివరాత్రి పర్వదినం కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైంది. గత కొన్నేళ్లుగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న గోపిచంద్‌కు ‘భీమా’ ఊరట కలిగించిందా? పోలీసు పాత్రలో గోపిచంద్‌ మెప్పించాడా? లేదా? కథ భీమా కథ పరుశురామ క్షేత్రం చుట్టూ తిరుగుతుంది. బెంగళూరు, బాదామి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ దేవాలయంలో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటాయి. వాటిని పోలీసు అధికారి భీమా (గోపిచంద్‌) ఎలా ఛేదించాడు? అతడికి పరుశురామ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటి? హీరోయిన్లు ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ ఇద్ద‌రి రోల్స్‌ ఎలా ఉన్నాయి? ప్రియా భవానీతో గోపిచంద్‌ లవ్‌ ట్రాక్‌ ఎలా మెుదలైంది? అన్నది కథ. ఎవరేలా చేశారంటే ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ మూవీగా తెరకెక్కిన భీమా సినిమాలో.. హీరో గోపిచంద్‌ అదరగొట్టాడు. పోలీస్ ఆఫీస‌ర్‌గా గోపీచంద్ డైలాగ్స్‌, యాటిట్యూడ్, బాడీలాంగ్వేజ్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. చాలా రోజుల త‌ర్వాత గోపీచంద్ క‌టౌట్‌కు తగ్గ పాత్ర దొరికిందని చెప్పవచ్చు. ఇందులో డ్యూయల్‌ రోల్స్‌లో గోపిచంద్‌ కనిపిస్తాడు. పాత్రకు తగ్గ వేరియేషన్స్‌తో మిస్మరైజ్‌ చేశాడు. ఇక హీరోయిన్లు ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ ఇద్ద‌రి రోల్స్‌కు ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా ప్రియా భవాని, గోపిచంద్‌ మధ్య కెమెస్ట్రీ తెరపై ఆకట్టుకుంటుంది. నరేష్‌, వెన్నెల కిషోర్‌, చమ్మక్‌ చంద్ర పాత్రలు నవ్వులు పూయిస్తాయి. నాజర్‌, ముఖేష్‌ తివారి, రోహిణి తదితర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే భీమా చిత్రానికి దర్శకత్వం వహించిన ఏ. హర్ష..&nbsp; డైరక్టరే కాకుండా కొరియోగ్రాఫర్ కూడా. ‘భీమా’ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో పాటు.. రెండు సాంగ్స్‌కి కొరియోగ్రఫీ కూడా అందించారు. కన్నడ అనేక హిట్ చిత్రాలను అందించిన హర్ష.. గోపీచంద్‌ని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయడంలో సెక్సెస్ అయ్యారు. ప‌ర‌శురామ క్షేత్రం చుట్టూ అల్లుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్‌‌తో పాటు మరో సర్‌ప్రైజింగ్ రోల్‌తో గోపీచంద్‌లోని నట విశ్వరూపాన్ని డైరెక్టర్‌ బయటపెట్టారు. ప్రతీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను గూస్‌బంప్స్‌ వచ్చేలా తెరకెక్కించారు. అటు ఎఫ్ఎక్స్‌ విభాగం నుంచి కూడా మంచి ఔట్‌పుట్‌ను రాబట్టడంలో డైరెక్టర్ హర్ష విజయం సాధించారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, క్లైమాక్స్‌ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అయితే సెకండాఫ్‌ కాస్త రొటీన్‌గా సాగినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్లు లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి.&nbsp; టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. రవి బస్రూర్‌ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సీక్వెన్స్‌ను చాలా బాగా ఎలివేట్‌ చేసింది. స్వామి జె. గౌడ కెమెరా పనితనం కూడా మెప్పిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ గోపిచంద్‌ నటనయాక్షన్ సీక్వెన్స్‌నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్ సాగదీత సీన్లుఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 08 , 2024
    Medha Shankar: ‘12th ఫెయిల్‌’ సంచలనం.. మేధా శంకర్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    Medha Shankar: ‘12th ఫెయిల్‌’ సంచలనం.. మేధా శంకర్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    హిందీలో తెరకెక్కిన '12th ఫెయిల్‌' (12th Fail) చిత్రం.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా నటించిన మేధా శంకర్‌ (Medha Shankar)కు రోజు రోజుకూ నెట్టింట ఫాలోయింగ్‌ పెరిగిపోతోంది. ఆమె నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మేధా శంకర్‌ గురించిన పలు ఆసక్తికర విషయాలు మీకోసం.&nbsp; నోయిడాలో పుట్టిన ఈ భామ (Medha Shankar).. ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసింది. అనంతరం మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది.&nbsp; ఎఫ్‌బీబీ నిర్వహించిన ఫెమినా మిస్‌ ఇండియా (2016) పోటీల్లో పాల్గొని మేధా అందరి దృష్టిని ఆకర్షించింది. పోటీల్లో రాణించి అందరి ప్రశంసలు అందుకుంది.&nbsp; మోడలింగ్‌లోనే కాకుండా సంగీతంపైనా మేధా (Medha Shankar)కు పట్టు ఉంది. సితార్‌, హార్మోనియం, కీబోర్డు ప్లే వంటి వాటిల్లో ఆమె శిక్షణ కూడా తీసుకుంది.&nbsp; నటనపై మక్కువతో నోయిడా నుంచి ముంబయికి మకాం మార్చిన మేధా.. 'విత్‌ యు ఫర్ యు ఆల్వేజ్‌' అనే షార్ట్‌ ఫిల్మ్‌తో నటిగా మారింది.&nbsp; ఆ తర్వాత హిందీ వెబ్‌సిరీస్‌లలో నటించే ఆవకాశాన్ని దక్కించుకుంది. బీకమ్‌ హౌజ్‌ (2019), దిల్‌ బేకరార్‌ (2021) సిరీస్‌లలో కీలక పాత్రలు పోషించి బాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత 'శాదీస్తాన్‌' (2021) సినిమాతో మేధా బాలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేసింది. సంగీతం ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రంలో అర్షి మోదీ పాత్రలో ఆమె ఆకట్టుకుంది.&nbsp; 2022లో వచ్చిన 'మ్యాక్స్‌, మిన్‌ అండ్‌ మ్యూజికీ'లో భాయ్‌ఫ్రెండ్‌ను త్యాగం చేసే అమ్మాయిగా యువతను మెప్పించింది.&nbsp; ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితం కావడంతో మేధా శంకర్‌ పేరు ప్రముఖంగా బాలీవుడ్‌లో వినిపించింది. మూడో సినిమా '12th ఫెయిల్‌'తో శ్రద్ధా జోషిగా ఒదిగిపోయి విశేష క్రేజ్‌ సంపాదించుకుంది మేధా. అందులోని 'బోలో నా' పాటను స్వయంగా ఆమె పాడటం విశేషం.&nbsp; ‘12th ఫెయిల్‌’ విడుదలకు ముందు 16వేల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ప్రస్తుతం 20 లక్షలకు చేరుకుంది.&nbsp; సోషల్‌మీడియా మేధా క్రేజ్‌ ఏ స్థాయిలో పెరిగిందో చెప్పడానికి దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం షేర్‌ చేస్తున్న ఫొటోలకు లక్షల్లో లైక్స్‌, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ఇక '12th ఫెయిల్‌' సినిమాకు వస్తే.. ఐపీఎస్‌ అధికారి మనోజ్‌కుమార్‌ శర్మ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. విక్రాంత్‌ మస్సే ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో మేధా ఆయన సతీమణిగా నటించింది.&nbsp; ఈ స్ఫూర్తిదాయక చిత్రం ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకువెళ్తోంది. ఈ సినిమాను చూసిన పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నోసార్లు తిరస్కరణకు గురైన మేధా శంకర్ ఓ ఇంటర్యూలో చెప్పింది. ఆత్మ విశ్వాసం, పట్టుదల ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుగోగలమని ఓ సందర్భంలో పేర్కొంది.&nbsp; సవాళ్లు విసిరే పాత్రలనే సినిమాల్లో ఎంచుకుంటానని మేధా చెబుతోంది. నటన జీవితంలో ఓ భాగమేగానీ అదే జీవితం కాదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది.&nbsp;
    జనవరి 20 , 2024
    Medha Shankar: హద్దులు చెరిపేసిన ‘12th ఫెయిల్‌’ భామ.. ఎద అందాలతో దిమ్మతిరిగే ట్రీట్‌!
    Medha Shankar: హద్దులు చెరిపేసిన ‘12th ఫెయిల్‌’ భామ.. ఎద అందాలతో దిమ్మతిరిగే ట్రీట్‌!
    బాలీవుడ్‌ బ్యూటీ మేధా శంకర్‌ (Medha Shankar).. తన అందచందాలతో సోషల్‌ మీడియాను అట్రాక్ట్‌ చేసింది. ఎద సంపదను ప్రదర్శిస్తూ నెటిజన్లను కవ్వించింది.&nbsp; తాజాగా ‘జీ సినిమా అవార్డ్స్‌’లో పాల్గొన్న ఈ బ్యూటీ.. సిల్వర్‌ కలర్‌ పొట్టి గౌనులో తళుక్కుముంది. అక్కడ ‘12th ఫెయిల్‌’ చిత్రానికి గానూ ఉత్తమ అరంగేట్ర నటిగా అవార్డు అందుకుంది.&nbsp; అనంతరం ఆ పొట్టి డ్రెస్‌లోనే ఫొటో షూట్‌ నిర్వహించిన మేధా.. అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్యాన్స్‌కు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది.&nbsp; గ్లామర్ ఫొటోలను మేధా తన ఇన్‌స్టా ఖాతాలో స్వయంగా పోస్టు చేయడంతో అవి కాస్త వైరల్‌గా మారాయి. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ కాగల క్వాలిటీస్‌ నీలో ఉన్నాయంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.&nbsp; ఇటీవల హిందీలో తెరకెక్కిన&nbsp; '12th ఫెయిల్‌' (12th Fail) చిత్రంతో మేధా రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయింది. రోజు రోజుకూ నెట్టింట ఆమె ఫాలోయింగ్‌ పెరిగిపోతోంది. ఈ చిత్రంలో ఆమె నటనపై ప్రశంసల వర్షం కురిసింది.&nbsp; నోయిడాలో పుట్టిన ఈ భామ (Medha Shankar).. ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసింది. అనంతరం మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది.&nbsp; ఎఫ్‌బీబీ నిర్వహించిన ఫెమినా మిస్‌ ఇండియా (2016) పోటీల్లో పాల్గొని మేధా అందరి దృష్టిని ఆకర్షించింది. పోటీల్లో రాణించి అందరి ప్రశంసలు అందుకుంది.&nbsp; మోడలింగ్‌లోనే కాకుండా సంగీతంపైనా మేధా (Medha Shankar)కు పట్టు ఉంది. సితార్‌, హార్మోనియం, కీబోర్డు ప్లే వంటి వాటిల్లో ఆమె శిక్షణ కూడా తీసుకుంది.&nbsp; నటనపై మక్కువతో నోయిడా నుంచి ముంబయికి మకాం మార్చిన మేధా.. 'విత్‌ యు ఫర్ యు ఆల్వేజ్‌' అనే షార్ట్‌ ఫిల్మ్‌తో నటిగా మారింది.&nbsp; ఆ తర్వాత హిందీ వెబ్‌సిరీస్‌లలో నటించే ఆవకాశాన్ని దక్కించుకుంది. బీకమ్‌ హౌజ్‌ (2019), దిల్‌ బేకరార్‌ (2021) సిరీస్‌లలో కీలక పాత్రలు పోషించి బాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత 'శాదీస్తాన్‌' (2021) సినిమాతో మేధా బాలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేసింది. సంగీతం ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రంలో అర్షి మోదీ పాత్రలో ఆమె ఆకట్టుకుంది.&nbsp; 2022లో వచ్చిన 'మ్యాక్స్‌, మిన్‌ అండ్‌ మ్యూజికీ'లో భాయ్‌ఫ్రెండ్‌ను త్యాగం చేసే అమ్మాయిగా యువతను మెప్పించింది.&nbsp; ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితం కావడంతో మేధా శంకర్‌ పేరు ప్రముఖంగా బాలీవుడ్‌లో వినిపించింది. మూడో సినిమా '12th ఫెయిల్‌'తో శ్రద్ధా జోషిగా ఒదిగిపోయి విశేష క్రేజ్‌ సంపాదించుకుంది మేధా. అందులోని 'బోలో నా' పాటను స్వయంగా ఆమె పాడటం విశేషం.&nbsp; ‘12th ఫెయిల్‌’ విడుదలకు ముందు 16వేల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ప్రస్తుతం 20 లక్షలకు చేరుకుంది.&nbsp; సోషల్‌మీడియా మేధా క్రేజ్‌ ఏ స్థాయిలో పెరిగిందో చెప్పడానికి దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం షేర్‌ చేస్తున్న ఫొటోలకు లక్షల్లో లైక్స్‌, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి.
    మార్చి 13 , 2024
    Telugu Movies: ఈవారం (June 23) థియేటర్లు/OTTల్లో రిలీజ్‌ కానున్న సినిమాలు/వెబ్‌ సిరీస్‌ల లిస్ట్ ఇదే..!
    Telugu Movies: ఈవారం (June 23) థియేటర్లు/OTTల్లో రిలీజ్‌ కానున్న సినిమాలు/వెబ్‌ సిరీస్‌ల లిస్ట్ ఇదే..!
    పోయిన వీకెండ్.. థియేటర్‌లలో ఆదిపురుష్ హవా కొనసాగింది. ఈ వారం పలు చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అలాగే OTT వేదికలపైనా.. కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. 1920 అవికా గోర్ లీడ్‌ రోల్‌లో నటించిన 1920 హారర్స్ ఆఫ్‌ ది హార్ట్ మూవీ జూన్ 23న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విక్రమ్‌భట్ తెరకెక్కించారు. 2008లో విడుదలై హిట్ సాధించిన '1920' సినిమాకు కొనసాగింపుగా '1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్' సీక్వెల్ రానుంది. ఈ చిత్రం విక్రమ్ భట్ కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో అవికా గోర్‌తో పాటు రాహుల్ దేవ్, దానిష్ పాండర్, రణధీర్ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. ధూమం (Dhoomam) పుష్ప ఫేమ్ ఫహద్‌ఫాజిల్ ముఖ్య పాత్రలో సరికొత్త కథతో ధూమం మూవీ ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని 'యూ టర్న్ దర్శకుడు పవన్ కూమర్ డైరెక్ట్ చేశారు. ఫహద్‌ఫాజిల్ సరసన అపర్ణ బాలమురళి కృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. ధూమం సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తమిల్, తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. మనుచరిత్ర మేఘా ఆకాష్(Megha Akash), శివ కందుకూరి(Shiva kandukuri) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మను చరిత్ర'(Manu Charitra). ఈ సినిమా జూన్ 23న థియేటర్లలో విడుదల కానుంది. భరత్ పెదగాని డైరెక్ట్ చేస్తున్నారు. రాన్ సన్ జోసెఫ్, శ్రీనివాస్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తుండగా.. కాజల్ అగర్వల్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు, పోస్టర్లు మను చరిత్రపై హైప్‌ను పెంచాయి. భారీ తారా గణం యూత్‌ ఫుల్ లవ్ స్టోరీగా జూన్ 23న అలరించేందుకు వస్తున్న చిత్రం 'భారీ తారాగణం'. ఈ చిత్రంలో సదన్, రేఖా నిరోషా, దీపికా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ ముత్యాల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. BVR పిక్చర్స్ బ్యానర్‌పై బీవీ రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంటింటి రామాయణం ఇప్పటికే థియేటర్లలో కామెడీ పంచిన 'ఇంటింటి రామాయణం' చిత్రం.. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో జూన్ 23నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna), నవ్య స్వామి(Navya Swami) లీడ్ రోల్స్‌లో నటించారు.&nbsp; టీకూ వెడ్స్ షేరు ఫస్ట్‌ టైం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి నిర్మిస్తున్న చిత్రం టీకూ వెడ్స్ షేరు(Tiku Weds Sheru). ఈ సినిమాలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui), అవనీత్‌ కౌర్‌ (Avneet Kaur) ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సాయి కబీర్‌ శ్రీవాస్తవ డైరెక్ట్ చేశారు. ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 23న నేరుగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈనెల 23నుంచి స్ట్రీమింగ్ కానుంది. కేరళ క్రైమ్ ఫైల్స్(Kerala Crime Files) ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్‌స్టార్‌ మలయాళంలో 'కేరళ క్రైమ్‌ ఫైల్స్‌' అనే కొత్త వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఓ లాడ్జ్‌లో జరిగిన హత్యను ఛేదించడానికి విచారణ చేపట్టిన ఆరుగురు పోలీస్‌ అధికారులు ఏం చేశారు? షిజు, పరయల్‌ వీడు, నీందకర అనే క్లూను వాళ్లు ఎలా ఛేదించారు? అనే కథాంశంగా ఈ సిరీస్ తెరకెక్కింది. లాల్‌, అజు వర్గీస్‌ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమా క్రైమ్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిస్నీ హాట్‌స్టార్‌లో ఈనెల 23నుంటి స్ట్రీమింగ్ కానుంది.&nbsp; మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్‌కానుంది. ఈ వారంలో OTTల్లో రిలీజ్ కానున్న మరికొన్ని చిత్రాలు TitleCategoryLanguagePlatformRelease DateTake Care of MayaMovieEnglishNetflixJune 19GlamorousWeb SeriesEnglishNetflixJune 21Sleeping DogWeb SeriesEnglishNetflixJune 22Social CurrencyWeb SeriesHindiNetflixJune 22Kisika Bhai Kisiki JaanMovieHindiZEE5June 23Class of 09&nbsp;Web SeriesEnglishDisney + HotstarJune 19Secret InvasionMovieEnglishDisney + HotstarJune 21The Kerala StoryMovieHindiDisney + HotstarJune 23World's Best&nbsp;MovieEnglishDisney + HotstarJune 23AgentMovieTeluguSony LivJune 23Lions Gate PlayMovieEnglishSony LivJune 23
    జూన్ 19 , 2023
    <strong>నెహా శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
    నెహా శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నేహా శెట్టి మెహబూబా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, గల్లీ రౌడి వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన నేహా శెట్టి.. డిజే టిల్లు చిత్రంలో హీరోయిన్‌గా అలరించింది. ఈ చిత్రంలో ఆమె చేసిన రాధిక పాత్ర యూత్‌లో క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. నేహా శెట్టి సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. జోమాటో యాడ్ షూటింగ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి నటించింది. ఈక్రమంలో నేహా శెట్టి గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Neha Shetty ) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేహా శెట్టి దేనికి ఫేమస్? నేహా శెట్టి డీజే టిల్లు చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన రాధిక పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. &nbsp;నేహా శెట్టి వయస్సు ఎంత? 1999, డిసెంబర్ 6న జన్మించింది. ఆమె వయస్సు 24 సంవత్సరాలు&nbsp; &nbsp;నేహా శెట్టి ముద్దు పేరు? &nbsp;నేహా &nbsp;నేహా శెట్టి ఎత్తు ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు&nbsp; &nbsp;నేహా శెట్టి ఎక్కడ పుట్టింది? మంగళూరు, కర్నాటక &nbsp;నేహా శెట్టి&nbsp; అభిరుచులు? డ్యాన్సింగ్, షాపింగ్ నేహా శెట్టికి&nbsp; ఇష్టమైన ఆహారం? దోశ, బిర్యాని నేహా శెట్టి&nbsp; తల్లిదండ్రుల పేర్లు? హరిరాజ్ శెట్టి, నిమ్మి శెట్టి నేహా శెట్టి&nbsp; ఫెవరెట్ హీరో? అల్లు అర్జున్ నేహా శెట్టి&nbsp; ఇష్టమైన కలర్ ? పింక్, వైట్ నేహా శెట్టి&nbsp; ఇష్టమైన హీరోయిన్స్ దీపిక పదుకునే &nbsp;నేహా శెట్టి తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా? డీజే టిల్లు నేహా శెట్టి&nbsp; ఏం చదివింది? డిగ్రీ &nbsp;నేహా శెట్టి పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.50లక్షల వరకు ఛార్జ్ చేస్ నుంచి- రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. నేహా శెట్టి&nbsp; సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్, మిస్ మంగళూరు(2014)లో అందాల పోటీలో విజేతగా నిలిచింది. More Information About Neha Shetty నేహా శెట్టి హాట్‌ ఫొటోలు (Neha Shetty Hot Images) నేహా శెట్టి పోషించిన బెస్ట్‌ రోల్ ఏంటి? డీజే టిల్లు సినిమా చేసిన రాధిక పాత్ర.. ఇప్పటివరకూ ఆమె చేసిన చిత్రాల్లో బెస్ట్‌ అని చెప్పవచ్చు.&nbsp; నేహా శెట్టి మూవీస్ లిస్ట్ ముంగారు మలె 2 (Mungaru Male 2), మెహబూబా (Mehbooba), గల్లీ రౌడి (Gully Rowdy), మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ (Most Eligible Bachelor), డీజే టిల్లు (DJ Tillu), బెదురులంక 2012 (Bedurulanka 2012), రూల్స్‌ రంజన్‌ (Rules Ranjann), టిల్లు స్క్వేర్‌ (Tillu Square) నేహా శెట్టి అప్‌కమింగ్‌ మూవీ? గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి (Gangs of Godavari) నేహా శెట్టి చీరలో దిగిన టాప్‌ ఫొటోలు( Neha shetty in Saree) నేహా శెట్టి బ్లౌజ్ కలెక్షన్స్(Neha Shetty Blouse Collections) నేహా శెట్టి బ్లౌజింగ్‌కు స్టైల్‌కు చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ట్రెండ్‌ తగ్గట్లు బ్లౌజులు ధరిస్తూ ఆమె చాలా మంది యువతులకు ప్రేరణగా నిలుస్తోంది. ఆ ట్రెండీ బ్లౌజులు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; కోల్డ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ&nbsp; కోల్డ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ అమె అందాన్ని రెట్టింపు చేసింది. నలుగురిలో ప్రత్యేకంగా కలిపించాలని భావించే వారికి ఈ బ్లౌజ్‌ తప్పక నచ్చుతుంది.&nbsp; వి-నెక్‌ కట్‌ స్లీవ్‌ బ్లౌజ్‌ ట్రెడిషన్‌తో పాటు ట్రెండీగా కనిపించాలని భావించిన సమయంలో నేహా వి - నెక్‌ కట్‌ స్లీవ్‌ బ్లౌజ్‌లను దరిస్తూ ఉంటుంది. బ్లౌజ్‌కు తగ్గ శారీ, జ్యూయలరీ ధరించి కుర్రకారును ఫిదా చేస్తుంటుంది.&nbsp; డీప్‌ ప్లంగింగ్‌ హల్టర్‌ నెక్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ బ్లౌజ్‌ ట్రెండీ లుక్‌ను తీసుకొస్తుంది. యువతులు మరింత అందంగా.. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు ఈ బ్లౌజ్ ఉపయోగపడుతుంది.&nbsp; ఆఫ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ బ్లౌజ్‌ చాలా మోడరన్‌ లుక్‌ను అందిస్తుంది. యువతుల అందాలను చాలా బాగా ఎలివేట్‌ చేస్తుంది.&nbsp; రౌండ్‌ నెక్‌ హాఫ్‌ స్లీవ్స్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ రౌండ్‌ నెక్‌ హాఫ్‌ స్లీవ్‌ బ్లౌజ్‌.. మంచి ట్రెడిషనల్‌ లుక్‌ తీసుకొస్తుంది. గోల్డెన్‌ ఎంబ్రాయిడరీతో ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ బ్లౌజ్‌ను శుభకార్యాలకు ధరించవచ్చు. క్లాసిక్‌ స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ నేహా.. ట్రెడిషన్‌, మోడరన్‌, ట్రెండ్‌ తగ్గట్లు ఇట్టే మారిపోగలదు. అయితే కాస్త సాఫ్ట్‌ లుక్‌లో కనిపించాలని భావించినప్పుడు ఈ అమ్మడు క్లాసిక్‌ స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ను ధరిస్తుంది. ఈ లుక్‌లో నేహాకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు.&nbsp; నేహా శెట్టిని వైరల్‌ చేసిన పోస్టు/ రీల్‌? ‘రూల్స్‌ రంజన్‌’ సినిమాలో తాను చేసిన ‘సమ్మోహనుడా’ సాంగ్‌కు నేహా శెట్టి రీల్‌ చేసింది. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా అది సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అయ్యింది. చాలా మంది యువతులు ఈ పాటపై రీల్స్‌ చేసి వైరల్‌ అయ్యారు.&nbsp; View this post on Instagram A post shared by Swetha Naidu (@swethaa_naidu) సోషల్‌ మీడియాలో ఉన్న నేహా శెట్టి హాట్‌ వీడియోస్? https://twitter.com/i/status/1730782118777950693 నేహా శెట్టి చేసిన బెస్ట్‌ స్టేజీ పర్‌ఫార్మెన్స్‌ ఏది? గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరిలోని ‘సుట్టంలా సూసి’ సాంగ్‌ రిలీజ్‌ సందర్భంగా హీరో విశ్వక్‌తో నేహాశెట్టి స్టేజీపై డ్యాన్స్‌ వేస్తుంది. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది.&nbsp; View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) నేహా శెట్టి ఏ ఏ భాషలు మాట్లాడగలదు? ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు నేహా శెట్టిది ఏ రాశి? మిథున రాశి నేహా శెట్టికి సోదరుడు/ సోదరి ఎవరైనా ఉన్నారా? నేహాకు ఓ సోదరి ఉంది. ఆమె పేరు నవామి శెట్టి నేహా శెట్టి పైన వచ్చిన రూమర్లు ఏంటి? ఈ బ్యూటీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌, ఆకాష్‌ పూరితో అప్పట్లో ప్రేమయాణం కొనసాగించినట్లు రూమర్లు ఉన్నాయి.&nbsp; నేహా శెట్టికి ఇష్టమైన గాయకులు ఎవరు? ఏ.ఆర్‌ రెహమాన్‌, శంకర్‌ మహదేవన్‌, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నేహా శెట్టి ఫేవరేట్‌ స్పోర్ట్స్‌ ఏది? క్రికెట్‌ నేహాశెట్టి ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు? ధోని, విరాట్‌ కోహ్లీ నేహా శెట్టికి ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు? మైసూర్‌, గోవా, కర్ణాటక నేహా శెట్టి చేసిన చిత్రాల్లోని బెస్ట్‌ సీన్‌? https://youtu.be/eGnO1LA_Epk?si=eXKpGn4R8g2vkiw_ నేహా శెట్టి జ్యూయలరీ ఫొటోలు? నేహా శెట్టి చిన్నప్పటి ఫొటోలు? నేహా శెట్టి సినిమాలోని బెస్ట్ డైలాగ్స్‌ ఏవి? డీజే టిల్లులో నేహా శెట్టి చేసిన సన్నివేశాలన్నీ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి. ముఖ్యంగా టిల్లు.. రాధిక (నేహా శెట్టి) ప్లాటులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చే సీన్‌ హైలెట్‌గా అని చెప్పవచ్చు. ఎందుకంటే కథలో రాధిక పుల్‌ లెంగ్త్‌ పాత్ర పరిచయమయ్యేది ఈ సీన్‌ నుంచే. రాధిక ఓ హత్య చేసి అమాయకంగా చెప్పే డైైలాగ్స్ ఆమె కెరీర్‌లోనే బెస్ట్‌ అని చెప్పవచ్చు. ఆ సంభాషణ ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; డీజే టిల్లులో రాధిక పాత్రకు సంబంధించి మరో కీలకమైన సన్నివేశం కూడా ఉంది. నేహా శెట్టి బాగా పాపులర్ అవ్వడానికి అందులో ఆమె చెప్పే డైలాగ్స్‌ కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.&nbsp; టిల్లు : ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావ్‌ రాధిక నాతోని..! రాధిక : ఎందుకు టిల్లు.. నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లమ్‌ నీకు? టిల్లు: నిజంగా ఈ క్వశ్చన్‌ నన్ను అడుగుతున్నావా రాధిక? రాధిక : అవును టిల్లు.. చెప్పు? టిల్లు:&nbsp; నేను ఇది నీకు ఎక్స్‌ప్లనేషన్‌ ఇస్తున్న చూడు ఇది సెకండ్‌ హైలెట్ ఆఫ్‌ ది నైట్‌ అది. కానీ చెప్తా.. నేను హౌలా గాడ్ని కాబట్టి.&nbsp; https://youtu.be/r6L5KO89Azs?si=wuYC205pIGEZWNMB టిల్లు : ఐ హ్యావ్‌ ఏ స్మాల్‌ డౌట్‌.. ఇదంతా సెల్ఫ్‌ డిఫెన్స్‌లోనే జరిగింది కదా? కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డర్‌ అయితే కాదు కదా? రాధిక : కాదు, టిల్లు.. ఐ ప్రామిస్‌ టిల్లు : అయితే పోదాం కదా.. పోలీసు స్టేషన్‌కు వెళ్లి నిజం చెప్పేద్దాం. రాధిక : పోలీసు.. పోలీసు.. అనొద్దు టిల్లు ప్లీజ్‌.. టిల్లు : ఎందుకట్ల పోలీసు.. పోలీసు.. అంటే భయపడుతున్నావ్‌? హా.. పాత కేసులేమైనా ఉన్నాయా నీ మీద? హే ఉంటే చెప్పు నేనేమి అనుకోను. ఎందుకంటే నేను ఒక నైట్‌లో ఒక సర్‌ప్రైజే హ్యాండిల్‌ చేయగల్గుతా. ఇట్ల మల్టిపుల్‌ అంటే నోతోని గాదు. ఇప్పుడు పోలీసు స్టేషన్‌కు పోయినాక ఆడ సడెన్‌గా యూ ఆర్ ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌ నెంబర్‌ వన్‌ క్రిమినల్‌ అని తెలిసినాక గుండె ఆగి చస్తా. అసలే డెలికేట్‌ మైండ్‌ నాది.&nbsp; రాధిక: అవును టిల్లు 40 మర్డర్స్‌ చేశాను.. ఐదేళ్లుగా నాకోసం వెతుకున్నారు. టిల్లు: అట్ల అనకు ప్లీజ్‌.. నాకు నిజంగా భయమైతాంది. రాధిక: ఇంకేం టిల్లు.. అప్పటి నుంచి చెప్తున్నా పోలీసు పోలీసు అంటే వద్దని. మళ్లీ పెద్ద ఇష్యూ అవుతుంది. ఇద్దరం ఇరుక్కుంటాం. నీకు అర్థం కాదు. అప్పటి నుంచి పోలీసు పోలీసు అని ఒకటే నస. టిల్లు: వన్‌ మినిట్‌.. వన్‌ మినిట్‌.. ఒక వన్‌ స్టెప్‌ బ్యాక్‌ వద్దాం. ఇప్పుడు ఇందాక నువ్వు మన ఇద్దరం ఇరుక్కుంటాం అని అన్నావ్ కదా. అంటే నేనెందుకు ఇరుక్కుంటాను. నాకేం సంబంధం. నాకు వాడు రూమ్‌లో ఉన్నట్లు కూడా తెల్వదు.&nbsp; రాధిక: టిల్లు.. మన ఇద్దరి ఫొటోస్‌ ఇంక ఎక్కడ సేవ్‌ చేసుకున్నాడో తెలీదు మనకి. అండ్ ఈ బిల్డింగ్‌లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. https://youtu.be/eGnO1LA_Epk?si=eXKpGn4R8g2vkiw_ &nbsp;నేహా శెట్టి ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/iamnehashetty/?hl=en https://www.youtube.com/watch?v=sv7EkhD7c1U
    ఏప్రిల్ 25 , 2024
    Devara: ‘పాతాల భైరవి’ గెటప్‌లో జూ.ఎన్టీఆర్.. తాత స్టైల్‌ను ఫాలో అయ్యింది అందుకేనా? 
    Devara: ‘పాతాల భైరవి’ గెటప్‌లో జూ.ఎన్టీఆర్.. తాత స్టైల్‌ను ఫాలో అయ్యింది అందుకేనా? 
    యంగ్‌ టైగర్‌ జూ.ఎన్టీఆర్‌ (Jr NTR)కు తాత నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Rama Rao) అంటే అమితమైన ప్రేమ. తనకు తాత అంటే ఎంత ఇష్టమో ఇప్పటికే చాలా వేదికలపై తారక్‌ వెల్లడించాడు. అటు ఫ్యాన్స్‌ (Jr NTR Fans) కూడా తారక్ అచ్చం వాళ్ల తాత లాగే ఉంటాడని అంటుంటారు. తారక్‌లోని నటనా నైపుణ్యం కూడా తాత నుంచి వచ్చిందేనని వ్యాఖ్యానిస్తుంటారు. ఇదిలా ఉంటే జూ.ఎన్టీఆర్‌కు.. రామారావు చేసిన చిత్రాల్లో ‘పాతాళ భైరవి’ అంటే మహా ఇష్టం. ఈ సినిమాను రీమేక్ చేయాలని కూడా ఓ దశలో తారక్‌ భావించారు. అయితే రీసెంట్‌గా ‘దేవర’ నుంచి విడుదలైన ఫొటోలో తారక్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘పాతాళ భైరవి’లో ఎన్టీఆర్‌లాగా తారక్ ఉన్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.&nbsp; తాతను దింపేసిన తారక్‌! పాతాళ భైరవిలో రామారావు లుక్‌కు.. ‘దేవర’ (Devara)లోని తారక్‌ గెటప్‌ను నందమూరి ఫ్యాన్స్ మ్యాచ్‌ చేసుకుంటున్నారు. పరిశీలనగా చూస్తే అందరికీ ఇదే భావన కలుగుతుందని చెబుతున్నారు. తారక్‌ ‘దేవర’ సినిమాలో డ్యూయల్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఒక పాత్ర రింగుల జుట్టుతో కూడిన లాంగ్‌ హెయిర్‌తో ఉంటుంది. ఈ రోల్‌కు సంబంధించిన ఫొటోనే శుక్రవారం చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఈ గెటప్‌లో తారక్‌ అచ్చం నందమూరి తారకరామారావు లాగా కనిపిస్తున్నాడని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ‘గడ్డం ఒకటే తేడా అని మిగతాదంతా సేమ్‌ టూ సేమ్‌’ అంటూ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) డైలాగ్‌ను కామెంట్స్‌ రూపంలో పెడుతున్నారు.&nbsp; పాతాళ భైరవి రీమేక్ ఏమైంది? తన తాతకు సంబంధించిన సినిమాను చేయాల్సి వస్తే కచ్చితంగా ‘పాతాల భైరవి’ (Patala Bhairavi) రీమేక్‌ చేస్తానని గతంలో జూ.ఎన్టీఆర్‌ తెలిపాడు. ఇందుకు తగ్గట్లే టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడి ద్వారా ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా అప్పట్లో మెుదలు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ‘పాతాల భైరవి’ చిత్రానికి ఈ రోజుల్లో పెద్దగా ఆదరణ లభించకపోవచ్చని పలువురు పెద్దలు తారక్‌తో అన్నట్లు సమాచారం. ఈ జనరేషన్‌ వారికి ఆ సినిమా పెద్దగా ఎక్కక పోవచ్చని వారు వ్యాఖ్యానించారట. దీని గురించి సమాలోచనల్లో పడ్డ తారక్‌.. చివరికీ వారి మాటలతో ఏకీభవించినట్లు తెలిసింది. అలా ‘పాతాళ భైరవి’ రీమేక్‌ పనులు ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఆగిపోయాయి. అయితే ఆ సినిమాలో తాత గెటప్‌లో కనిపించాలన్న కోరికను ఇన్నాళ్లకు తారక్‌.. ‘దేవర’ రూపంలో తీర్చుకున్నట్లు తెలుస్తోంది.&nbsp; రామారావు గెటప్‌లో తారక్‌! దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘యమదొంగ’ (Yamadonga) సినిమాలో ఓ సీన్‌లో తారక్‌ (Jr NTR) అచ్చం తన తాత లాగే కనిపిస్తాడు. ముఖ్యంగా జూనియర్‌ యమ గెటప్‌లో.. గతంలో ఎన్టీఆర్‌ చెప్పిన ‘ఏమంటివి ఏమంటివి’ డైలాగ్‌ను చాలా అద్భుతంగా చెబుతాడు. నిమిషం పాటు ఉండే ఆ డైలాగ్‌ను అచ్చం రామారావు లాగా గుక్క తిప్పుకోకుండా చెప్పి ఎన్టీఆర్‌ అందరి చేత శభాష్‌ అనిపించుకున్నాడు. నటనలోనే కాదు డైలాగ్‌ డెలివరీలోనూ తాతకు తగ్గ వారసుడ్ని అని నిరూపించుకున్నాడు. అప్పట్లో ఈ డైలాగ్‌.. టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. రామారావు, తారక్‌ చెప్పిన డైలాగ్‌ను సరిపోలుస్తూ వచ్చిన ఈ వీడియోపై ఓ లుక్కేయండి.&nbsp; https://twitter.com/i/status/1571718233828511744
    మార్చి 23 , 2024
    Animal Movie OTT: ఓటీటీ ప్రియులకు గ్రాండ్‌ ట్రీట్.. మరికొద్ది గంటల్లో ‘యానిమల్‌’ స్ట్రీమింగ్‌!
    Animal Movie OTT: ఓటీటీ ప్రియులకు గ్రాండ్‌ ట్రీట్.. మరికొద్ది గంటల్లో ‘యానిమల్‌’ స్ట్రీమింగ్‌!
    రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ వంగా (Sandeep Reddy) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా చిత్రం ‘యానిమల్‌’ (Animal movie). ఈ చిత్రం రేపటి నుంచి (జనవరి 26) ఓటీటీలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ‘యానిమల్‌’ స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; ‘యానిమల్’ స్ట్రీమింగ్‌ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ స్వయంగా ప్రకటిస్తూ ఎక్స్‌ (ట్విటర్‌)లో ఓ ఆసక్తికర వీడియోను సైతం పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో #AnimalOnNetflix హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో&nbsp;నెట్టింట వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1750390548165472508 ‘గాలి దట్టంగా ఉంది.. ఉష్ణోగ్రత పెరుగుతోంది’ అంటూ నెట్‌ఫ్లిక్స్‌ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. జనవరి 26 నుంచి తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ‘యానిమల్‌’ (Animal Movie OTT Release) చిత్రాన్ని వీక్షించవచ్చని స్పష్టం చేసింది.&nbsp; డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్‌ చిత్రం #AnimalOnNetflix&nbsp; బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. యువ ప్రేక్షకులను (Animal movie ott release date telugu) అమితంగా ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. యానిమల్‌ చిత్రాన్ని ఇప్పటికే థియేటర్లలో వీక్షించిన వారికి కూడా ఓటీటీ వెర్షన్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. దాదాపు 8 నిమిషాల అదనపు నిడివితో దీన్ని తీసుకొస్తున్నారు. థియేటర్‌లో చూడలేకపోయిన సన్నివేశాలను ఇందులో చూసే అవకాశం కల్పించారు.&nbsp; యానిమల్‌ మూవీ రన్‌ టైమ్‌ 3 గం.ల 21 నిమిషాలు కాగా.. ఓటీటీ కోసం అదనపు సన్నివేశాలు జోడించి దాదాపు మూడున్నర గంటలతో 'యానిమల్‌' (Animal movie ott release date telugu)ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. దీంతో ఆ సన్నివేశాలు ఏంటా అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. యాక్షన్ ప్రియులకు (#AnimalOnNetflix) పసందైన విందు భోజనాన్ని అందించిన యానిమల్‌కు కొనసాగింపుగా మరో చిత్రం సైతం రానుంది. యానిమల్‌ పార్క్‌ (Animal Park) టైటిల్‌తో ఆ చిత్రాన్ని రూపొందించనున్నట్లు డైరెక్టర్‌ సందీప్‌ వంగా ఇప్పటికే ప్రకటించారు.&nbsp; ఇక యానిమల్‌ చిత్రాన్ని హిందీ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ప్రొడ్యూస్ చేసింది.&nbsp; హిందీతో పాటు ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేసింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది.&nbsp; డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాకు బాలీవుడ్‌లో ఇది రెండో చిత్రం. అంతకుముందు ఆయన అర్జున్‌ రెడ్డి చిత్రాన్ని 'కబీర్‌ సింగ్‌' (Kabir singh)పేరుతో హిందీలో తెరకెక్కించారు. ఇక యానిమల్ చిత్రంలో రణ్‌బీర్‌కు జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించింది. అనిల్‌ కపూర్‌ బాబీ డియోల్‌, శక్తికపూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.&nbsp; ‘యానిమల్‌’ కథ విషయానికి వస్తే..&nbsp; రణ్ విజయ్ సింగ్ బల్బీర్ (రణబీర్ కపూర్)‌కు తండ్రి మీద విపరీతమైన ప్రేమ. తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) కోసం ఎంత దూరమైన వెళ్తాడు. తండ్రి బల్బీర్ సింగ్ ఓ బిజీగా ఉండే వ్యాపార వేత్త. ఇండియాలోనే అతిపెద్ద స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీని నడుపుతుంటాడు. బిజీ లైఫ్‌ వల్ల తన కొడుకుతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతుంటాడు. పూర్తి రివ్యూ కోసం కింద ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయండి.&nbsp; https://telugu.yousay.tv/animal-movie-review-ranbir-looks-fierce-in-action-scenes-how-is-animal.html
    జనవరి 25 , 2024
    Heeramandi Telugu Review: ఓటీటీలో విడుదలైన ‘హీరామండి’ ఎలా ఉందంటే?
    Heeramandi Telugu Review: ఓటీటీలో విడుదలైన ‘హీరామండి’ ఎలా ఉందంటే?
    నటీనటులు : మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్‌, షర్మిన్‌ సేగల్‌ తదితరులు దర్శకత్వం : సంజయ్‌ లీలా భన్సాలీ సంగీతం : సంజయ్‌ లీలా భన్సాలీ, బెనెడిక్ట్‌ టేలర్‌, నరేన్‌ చందవర్కర్‌ సినిమాటోగ్రఫీ : సుదీప్‌ ఛటర్జీ, మహష్ లిమాయే, హున్‌స్టాంగ్‌ మహాపాత్రా, రగుల్‌ ధరుమాన్‌ ఎడిటర్‌ : సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మాణ సంస్థ: భన్సాలీ ప్రొడక్షన్స్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ : నెట్ ఫ్లిక్స్‌&nbsp; విడుదల తేదీ : 1 మే, 2024 గత కొన్ని రోజులుగా దేశంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సిరీస్‌ 'హీరామండి ; ది డైమండ్‌ బజార్‌' (Heeramandi: The Diamond Bazaar). బాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌తోనే ఆయన తొలిసారి ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. &nbsp;ఈ వెబ్‌సిరీస్‌లోబాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా (Manisha Koirala), సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), అదితి రావ్ హైదరీ (Aditi Rao Hydari), రిచా చద్దా (Richa Chadha), షర్మిన్ సెగల్ (Sharmin Segal), సంజీదా షేక్‌ (Sanjeeda Sheikh)లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఈ సిరీస్‌ అందరి అంచనాలను అందుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం. కథేంటి? ఈ సిరీస్‌ కథ బ్రిటీష్ పాలనలో 1930-1940ల మధ్య జరుగుతుంటుంది. పాకిస్తాన్‌ లాహోర్‌లోని హీరామండి ప్రాంతంలో ఓ భారీ వేశ్య గృహాన్ని మల్లికాజాన్ (మనీషా కొయిరాల) నడుపుతుంటుంది. తద్వారా ఆ ప్రాంతాన్ని ఆమె శాసిస్తుంటుంది. అయితే ఆమె మాజీ శత్రువు కూతురు ఫరీదన్ (సోనాక్షి సిన్హా).. మల్లికాజాన్‍ను దెబ్బకొట్టి హీరామండి హుజూర్‌ కావాలని ప్రయత్నిస్తుంటుంది. మరికొందరు కూడా మల్లికాజాన్‌ పీఠంపై కన్నేస్తారు. మరోవైపు దేశంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమం తీవ్రంగా జరుగుతుంటుంది. మల్లికాజాన్ కూతుర్లలో ఒకరైన బిబ్బో జాన్ (అదితి రావ్ హైదరి).. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని పోరాటాలు చేస్తుంది. చిన్నకూతురు ఆలమ్‍జెబ్ (షార్మిన్ సేగల్).. ఓ నవాబు తాజ్‍దార్ (తాహా షా బాదుషా)ను ప్రేమించి.. హీరామండి నిబంధనలను బేఖాతరు చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? హీరామండిలో ఆధిపత్యం కోసం మల్లికాజాన్, ఫరీదన్ మధ్య ఎలాంటి పోరు జరిగింది? హీరామండి నాయకత్వం చివరికి ఎవరి చేతుల్లోకి వెళ్లింది? అనేది స్టోరీ. ఎవరెలా చేశారంటే? మల్లికాజాన్‌ పాత్రలో మనీషా కోయిరాలా అదరగొట్టింది. కెరీర్‌ బెస్ట్‌ నటనతో మెప్పించింది. పాత్రలోని గ్రేస్‌, ఆథారిటీ, కామాండింగ్‌ను తన హావాభావాలతో చూపిస్తూ ఆకట్టుకుంది. మల్లికా జాన్‌కు సవాలు విసిరే పాత్రలో సోనాక్షి సిన్హా మెరిసింది. జిబ్బోజాన్ పాత్రలో అదితిరావ్ హైదరి ఆకట్టుకుంది. హీరామండిలోని దుర్భర పరిస్థితులపై పోరాడే యువ వేశ్య పాత్రలో ఆమె మెప్పించింది. విధి నుంచి తప్పించుకోవాలనుకునే అమాయకమైన యువతి పాత్రలో షర్మిన్‌ సెగల్‌ కనిపించింది. తాహా షా, జేసన్ షా, శేఖర్ సుమన్, పర్హీద్ ఖాన్, ఇంద్రేశ్ మాలిక్ తదితరులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? స్టార్‌ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ మరోమారు ఈ సిరీస్‌ ద్వారా తన మార్క్ ఏంటో చూపించాడు. సంఘర్షణ, డ్రామా చాలా స్ట్రాంగ్‌గా తెరకెక్కించారు. ముఖ్యంగా ఆయన ఎంచుకున్న పాత్రలన్నీ కథపై బలమైన ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా బ్రిటిష్‌ కాలంలో వేశ్యల స్థితిగతులు, వారి మధ్య ఆదిపత్య పోరు ఎలా ఉండేదో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. కథకు దేశ భక్తిని జోడించడం సిరీస్‌కు బాగా ప్లస్ అయ్యింది. అయితే కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. అక్కడక్కడ వీక్షకులు బోర్‌గా ఫీలవుతారు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ఈ సిరీస్‌కు మ్యూజిక్‌ బాగా ప్లస్ అయ్యింది. బెనెడిక్ట్‌ టేలర్‌, నరేన్‌ చందవర్కర్‌ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. అటు సినిమాటోగ్రాఫర్ల పని తనాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా చక్కటి పనితీరు కనబరిచింది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారగణం నటనకథ, కథనంసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సన్నివేశాలుస్లో న్యారేషన్ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    మే 01 , 2024
    <strong>Family Star: ‘ఫ్యామిలీ స్టార్‌కు’సెన్సార్‌ బోర్డు ఝలక్..!</strong>
    Family Star: ‘ఫ్యామిలీ స్టార్‌కు’సెన్సార్‌ బోర్డు ఝలక్..!
    విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda) హీరోగా, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్' (Family Star). దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ పేట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం&nbsp; మరో రెండు రోజుల్లో (ఏప్రిల్‌ 5) విడుదల కానుంది. గీతాగోవిందం లాంటి బ్లాక్‌బాస్టర్‌ తర్వాత విజయ్‌-పరుశురామ్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అటు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా గట్టిగానే జరిగింది. ఆ విశేషాలేంటో చూద్దాం.&nbsp; ప్రీ-రిలీజ్‌ బిజినెస్ ఎంతంటే? భారీ అంచనాలతో వస్తోన్న ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం.. గణనీయ సంఖ్యలో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు అమ్ముడుపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 34.50 కోట్లు నమోదు చేసింది. తెలంగాణ (నైజాం)లో రూ. 13 కోట్లు, రాయలసీమ (సీడెడ్) రూ. 4.5 కోట్లు, ఏపీలో రూ.17 కోట్లకు థియేట్రికల్‌ రైట్స్‌ను మేకర్స్ విక్రయించారు. అటు కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.5 కోట్లతో కలిపి మెుత్తంగా ఈ సినిమా రూ.43 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఫలితంగా ఫ్యామిలీ స్టార్‌ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.44 కోట్లకు చేరింది.&nbsp; సెన్సార్‌ ఝలక్‌! ఫ్యామిలీ స్టార్‌ చిత్రం తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్‌ బృందం.. యూ/ ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. రన్‌ టైమ్‌ను 2గం.ల 43 నిమిషాలకు ఫిక్స్ చేసింది. అయితే సినిమాలో మొత్తం నాలుగు డైలాగ్స్‌ను మ్యూట్ చేయాలని సెన్సార్ సూచించినట్లు సమాచారం. ఇక సినిమాలో డిలీటెడ్ సీన్లు ఏమీ లేవని తెలుస్తోంది. అయితే ఓ పాటలో లిక్కర్ బాటిల్స్ వచ్చినప్పుడు ఆయా లోగోలు కనిపించకుండా చూడాలని సెన్సార్ బోర్డు చెప్పినట్లు సమాచారం. ఇవి తప్ప సినిమాలో పెద్దగా అభ్యంతరక సన్నివేశాలు ఏమీ లేవని సమాచారం. ఆ చిత్రాలతో గట్టి పోటీ! విజయ్‌ దేవరకొండ లాంటి స్టార్‌ హీరో నటించినప్పటికీ ఫ్యామిలీ స్టార్‌కు రెండు సినిమాల నుంచి గట్టిపోటీ తప్పదనిపిస్తోంది. ఒకటి ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) కాగా, రెండోది మలయాళం బ్లాక్‌ బాస్టర్ ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ (Manjummel Boys). గత శుక్రవారం రిలీజైన టిల్లు స్క్వేర్‌ సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ వారం కూడా మంచి వసూళ్లు సాధిస్తూ వీకెండ్‌ వైపు పరుగులు పెడుతోంది. రెండో వారంతం కూడా టిల్లు స్క్వేర్‌కు మంచి ఆదరణ లభించే అవకాశముంది. మరోవైపు మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్‌.. ఏప్రిల్‌ 6న విడుదలవుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మూవీని చూసేందుకు తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. దీంతో ఈ రెండు చిత్రాలను తట్టుకొని ‘ఫ్యామిలీ స్టార్‌’ ఏమేర రాణిస్తుందో చూడాలి. 
    ఏప్రిల్ 03 , 2024
    This Week Releases: ఈ వారం(June 29, 30) రిలీజ్ కానున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..!
    This Week Releases: ఈ వారం(June 29, 30) రిలీజ్ కానున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..!
    జూన్ నెలలో ఆఖరి వారంలోకి అడుగు పెట్టేశాం. నెలాఖరున పలు చిత్రాలు థియేటర్ల వద్ద సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో తెరకెక్కిన సినిమాలు ఈ వారం(June 29,30) విడుదల అవుతుండటం విశేషం. థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ పలు వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం.&nbsp; థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు స్పై(SPY) నిఖిల్ సిద్ధార్థ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమే ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా దీనిని తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. వాస్తవికతకు దగ్గరగా, నిజ జీవిత స్పై ఏజెంట్లు ఎలా ఉంటారో ఇందులో చూపించినట్లు మూవీ టీం వెల్లడించింది. కె.రాజశేఖర్ రెడ్డి కథ అందించి ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించాడు. ఐశ్వర్య మీనన్ నిఖిల్ సరసన నటించింది. జూన్ 29న విడుదలకు సిద్ధమవుతోంది. సామజవరగమన(Samajavaragamana) శ్రీవిష్ణు కథానాయకుడిగా వస్తున్న చిత్రమే ‘సామజవరగమన’. వినూత్నమైన ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. ఈ మూవీకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా రాజేశ్ దండా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. మూవీకి గోపీ సుందర్ సంగీతం అందించాడు. రెబా మోనికా జాన్ కథానాయిక. నరేశ్, సత్య, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూన్ 29న విడుదలకు సిద్ధమైంది.&nbsp; ఇండియానా జోన్స్(Indiana Jones) సాహసోపేతమైన సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఈ కోవలో వచ్చిన ఇండియానా జోన్స్ సిరీస్‌ అప్పట్లో ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఇదే సిరీస్‌లో మరో చిత్రం రాబోతోంది. ‘ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ’ సినిమా జూన్ 29న విడుదల కాబోతోంది. తమిళ్,&nbsp; తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సిరీస్‌లో దాదాపు 14 ఏళ్ల క్రితం చివరి చిత్రం వచ్చింది. మళ్లీ ఇప్పుడే థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయింది. మాయా పేటిక(Mayaa Petika) శ్రీనివాస్, పాయల్ రాజ్‌పుత్, సునీల్, పృథ్వీ తదితరులు కలిసి నటించిన చిత్రం ‘మాయా పేటిక’. సెల్‌ఫోన్ చుట్టూ జరిగే కథగా ఈ సినిమా సాగనుందని చిత్రబృందం వెల్లడించింది. రమేశ్ రాపార్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది. ఎట్టకేలకు జూన్ 30న విడుదల అయ్యేందుకు ముస్తాబైంది.&nbsp; లవ్ యూ రామ్(Love You Ram) ప్రముఖ రచయిత, దర్శకుడు దశరథ్ కథ అందించి నిర్మిస్తున్న సినిమా ‘లవ్ యూ రామ్’. తనదైన శైలిలో ఈ ప్రేమ కథను చెక్కారు దశరథ్. విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న ఇద్దరు ప్రేమికుల కథ ఎక్కడిదాకా సాగింది? చివర్లో ఎలాంటి మలుపులు తిరిగిందనేది తెరపై చూడాల్సిందేనని చిత్రబృందం తెలిపింది. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటించగా బి.వి.చౌదరి దర్శకత్వం వహించాడు. దశరథ్‌తో నిర్మాణ బాధ్యతలు పంచుకున్నాడు. జూన్ 30న చిత్రం రిలీజ్ కానుంది. ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateWeekend Family Season 2Web SeriesEnglishDisney + HotstarJune 28Lust Stories 2Web SeriesHindiNetflixJune 29See You In my Nineteenth LifeWeb SeriesKoreanNetflixJune 29Jack ran Season 4Web SeriesEnglishAmazon Prime&nbsp;June 30CelebrityWeb SeriesKoreanNetflixJune 30The Night Manager Season 2Web SeriesHindiDisney+ HotstarJune 30Arthamainda ArunkumarWeb SeriesTeluguAhaJune 30SargentWeb SeriesHindiJio CinemaJune 30
    జూన్ 26 , 2023
    <strong>Ugadi Special Movie Posters: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!</strong>
    Ugadi Special Movie Posters: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!
    ఉగాది సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్‌ ముందుకు తీసుకొచ్చాయి. ఉగాది స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp;&nbsp; సరిపోదా శనివారం నాని హీరోగా చేస్తున్న 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaram) చిత్రం నుంచి ఓ ఆకర్షణీయమైన పోస్టర్‌ రిలీజైంది. ప్రముఖ నటుడు సాయికుమార్‌ నానితో పాటు ఈ పోస్టర్‌లో కనిపించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ చేసింది. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్‌ కానున్నట్లు మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు.&nbsp; RT 75 ఇటీవల ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja).. తన తర్వాతి ప్రాజెక్టును ఉగాది సందర్భంగా అనౌన్స్ చేశారు. ‘RT75’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రైటర్‌ భాను బొగ్గవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లవ్‌ మౌళి ప్రముఖ నటుడు నవదీప్ (Navdeep) హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పంఖురి గిద్వానీ ఈ సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఈ ట్రైలర్‌ వీక్షకులను ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/i/status/1777920829575078381 అరణ్మనై 4&nbsp; రాశీ ఖన్నా (Rashi Khanna), తమన్నా (Tamannaah), సుందర్. సి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అరణ్మనై 4’ (Aranmanai 4) చిత్రం నుంచి కూడా ఉగాది కానుకగా ఓ పోస్టర్‌ విడుదలైంది. పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్‌ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. కమిటీ కుర్రోళ్లు నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో రూపొందుతున్న ప్రొడక్షన్‌ నెం.1 చిత్రానికి ఉగాది సందర్భంగా టైటిల్‌ ఎనౌన్స్ చేశారు. 'కమిటీ కుర్రోళ్లు' అనే పేరును ఈ మూవీకి ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌ను సుప్రీమ్‌ హీరో సాయి దుర్గా తేజ్‌ అనౌన్స్‌ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. దర్శకుడు యదు వంశీ కొత్త వాళ్లతో ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం. https://twitter.com/i/status/1777941376782786758 ధూం ధాం చైతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ (Hebha Patel) జంటగా నటిస్తున్న 'ధూం ధాం' (Dhoom Dhaam) చిత్రం నుంచి కూడా కొత్త పోస్టర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో సినిమాలోని ప్రధాన తారాగణం అంతా కనిపించింది. ఈ మూవీని దర్శకుడు సాయి కిషోర్‌ తెరకెక్కిస్తున్నారు.&nbsp; ఏ మాస్టర్‌ పీస్‌&nbsp; సుకు పూర్వజ్‌ రూపొందిస్తున్న కొత్త చిత్రం 'ఏ మాస్టర్‌ పీస్‌' (A Master Peace). అరవింద్‌ కృష్ణ, జ్యోతి పుర్వాజ్‌, అషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి పండగ సందర్భంగా పోస్టర్‌ రిలీజైంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దేవకి నందన వాసుదేవ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్‌ గల్లా (Ashok Galla) నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vaasudeva). మేకర్స్ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఇందులో అశోక్‌ గల్లా లుక్ ఆకట్టుకుంటోంది. భలే ఉన్నాడే! యువ నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj Tharun) హీరోగా రూపొందుతున్న భలే ఉన్నాడే సినిమా నుంచి ఓ పోస్టర్‌ విడుదలైంది. ఇందులో రాజ్‌ తరుణ్‌ ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనిపించాడు.&nbsp; ప్రతినిధి 2 నారా రోహిత్‌ (Nara Rohit) హీరోగా ప్రముఖ జర్నలిస్టు మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రతినిధి 2’ (Pratinidhi 2). ఈ మూవీ పోస్టర్‌ కూడా ఉగాది సందర్భంగా విడుదలై సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.&nbsp; కృష్ణమ్మ&nbsp; సత్యదేవ్‌ (Satya Dev) లేటెస్ట్‌ మూవీ ‘కృష్ణమ్మ’ (Krishnamma) నుంచి ఉగాది సందర్భంగా ఓ సాలిడ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీలోని దుర్గమ్మ పాటను ఏప్రిల్‌ 11న ఉ.11.11 గం.లకు రిలీజ్‌ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్‌ ప్రకటించారు. ఇందులో సత్యదేవ్‌ త్రిశూలం పట్టుకొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు.&nbsp;
    ఏప్రిల్ 10 , 2024
    Priya Prakash Varrier: తడి చీరలో కుర్ర అందాలను దోరగా వడ్డిస్తున్న ప్రియా ప్రకాశ్!
    Priya Prakash Varrier: తడి చీరలో కుర్ర అందాలను దోరగా వడ్డిస్తున్న ప్రియా ప్రకాశ్!
    మిల్క్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రకృతి ఒడిలో అందాలను ఒలకబోస్తోంది. తన హాట్ హాట్ అందాలతో గ్లామర్ షో చేసింది.&nbsp; &nbsp;తడి చీరకట్టు అందాలతో హీటెక్కించింది. క్రీమ్ కలర్ చీరను పద్దతిగా కట్టుకున్న ఈ ముద్దుగుమ్మ నడుమమందాలను చూపిస్తూ కైఫెక్కించింది.&nbsp; తడిసిన ఎద అందాలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తడిచిన చీరలో నడుమందాలను ప్రదర్శిస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది.&nbsp; ఎద అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెల్లో గాయం చేస్తోంది. తాజాగా ప్రియా తన హాట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్‌గా మారాయి.&nbsp; ఒక్క కన్నుగీటుతో దేశం మొత్తం తన వైపునకు తిరిగి చూసేలా చేసుకుంది ప్రియా ప్రకాశ్ వారియర్. అలాగే ఫ్లయింగ్ కిస్‌ గన్‌తో ఫిల్మ్ మేకర్లను కూడా ఆకర్షించింది. &nbsp;ప్రస్తుతం ఈ భామ అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. &nbsp;క్లీవేజ్ షో చేయడంలో ఈ భామను మించిన హీరోయిన్ లేదంటే అతిశయోక్తి కాదు.&nbsp; ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో కుర్రకారుపై అందాల దాడి చేస్తూనే ఉంటుంది.&nbsp; నాజుకైన నడుమందాలను ఇంపుగా వడ్డీస్తూ కొంటె చూపులతో సెగలు పుట్టిస్తుంటుంది ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ వారియర్ దాదాపు సౌత్‌లోని అన్ని భాషల్లో నటిస్తోంది. తాజాగా ఆమె పవన్ కళ్యాణ్- సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాలో యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో తెలుగులో నితిన్ సరసన చెక్‌ మూవీలో యువ హీరో తేజా సజ్జాకు జోడీగా ఇష్క్‌ సినిమాలో నటించింది. ఇక తన కేరీర్ గురించి చెబుతూ.. తాను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని అందాల భామ ప్రియా ప్రకాశ్ వారియర్ తెలిపింది. మలయాళం మూవీ 'ఒరు అదార్ లవ్' సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ప్రియా పాపులర్ అయింది. ఈ సినిమాలోని కన్ను కొట్టే సీన్‌తో ఈ ముద్దుగుమ్మ కుర్రకారు హృదయాల్లో నిలిచిపోయింది.&nbsp;
    అక్టోబర్ 17 , 2023
    Tollywood Heroines: యంగ్‌ హీరోలతో జత కడుతున్న స్టార్ హీరోయిన్స్.. అవకాశాలు లేకపోవడమే కారణమా?
    Tollywood Heroines: యంగ్‌ హీరోలతో జత కడుతున్న స్టార్ హీరోయిన్స్.. అవకాశాలు లేకపోవడమే కారణమా?
    స్టార్‌ హీరోల పక్కన యంగ్ హీరోయిన్లు నటించడం మాములే. కానీ స్టార్‌ హీరోయిన్‌ల పక్కన ఓ యంగ్ హీరో నటించడం అరుదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే జరుగుతోంది. స్టార్‌ హీరోయిన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత, అనుష్క శెట్టి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌లు యంగ్‌ హీరోలతో జతకడుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. వరుస ఫ్లాపులు, చేతిలో సినిమాలు లేకపోవడంతో వీరంతా చిన్న హీరోలతోనూ రొమాన్స్‌ చేసేందుకు సిద్ధమైపోతున్నారు.&nbsp; సమంత అగ్రకథానాయిక అయిన సమంత.. డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా చేయబోతోంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో చేస్తున్న ‘ఖుషీ’ సినిమా పూర్తికాగనే ఆ చిత్రం పట్టాలెక్కుతుందని టాక్.&nbsp; సమంత - సిద్ధూ జంటగా చేయబోయే సినిమాకు మహిళా డైరెక్టర్‌ నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఏజ్‌ గ్యాప్‌ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ కథను సిద్ధూ సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది.&nbsp; ఇటీవల విడుదలైన శాకుంతలం సినిమాలోనూ సమంతకు జంటగా యంగ్‌ హీరో దేవ్‌ మోహన్‌ నటిేంచాడు. సినిమా ఫ్లాప్‌ అయినా వీరి మధ్య కెమెస్ట్రీ బాగానే కుదిరినట్లు వార్తలు వచ్చాయి.&nbsp; అనుష్క శెట్టి అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి సినిమాల ద్వారా హీరోయిన్‌ అనుష్క శెట్టి ఎంతో క్రేజ్ సంపాదించింది. అయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఈ భామ కుడా యంగ్‌ హీరోతో జతకట్టేందుకు సిద్ధమైంది.&nbsp; ‘మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలో యువ హీరో నవీన్‌ పొలిశెట్టికి జోడీగా నటించింది. పి. మహేష్‌ బాబు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాట్రైలర్‌ ఆకట్టుకుంది.&nbsp; వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న అనుష్క కెరీర్‌ను 2015లో వచ్చిన జీరో సైజ్‌ సినిమా దెబ్బతీసింది. సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిన అనుష్క తిరిగి తగ్గలేకపోయింది. దీంతో ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.&nbsp; రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మహేష్‌, రవితేజ, అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌, తారక్‌, రామ్‌పోతినేని వంటి స్టార్ హీరోలతో జత కట్టిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరిగా ఓ వెలుగు వెలుగింది.&nbsp; గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో రకుల్‌ సింగ్‌ తర్జనభర్జన అవుతోంది. దీంతో యంగ్‌ హీరోలతోనూ సినిమా చేసేందుకు వెనకాడటం లేదు. 2021లో వచ్చిన కొండ పొలం సినిమాలో యంగ్‌ హీరో వైష్ణవ్‌ తేజ్‌ సరసన రకూల్ నటించింది.&nbsp; కొండ పొలం సినిమాలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపించి రకూల్‌ మెప్పించింది. తెలివిగల గిరిజన యువతి పాత్రలో ఒదిగిపోయింది. వైష్ణవ్‌ - రకూల్‌ జంటకు కూడా మంచి మార్కులే పడ్డాయి.&nbsp; తమన్నా మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో కుర్ర హీరోలతో సైతం నటించేందుకు ఈ బ్యూటీ సై అంటోంది.&nbsp; 2021లో వచ్చిన ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలో సత్యదేవ్‌కు జోడీగా తమన్నా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడినప్పటికీ వారి జంటకు మాత్రం మంచి పేరే వచ్చింది. కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది.&nbsp; కన్నడలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రానికి రీమేక్‌గా ‘గుర్తుందా శీతాకాలం ’ సినిమా తీశారు. డైరెక్టర్‌ నాగశేఖర్‌ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.&nbsp;
    మే 24 , 2023
    Sana Javed: షోయాబ్‌ మాలిక్ కొత్త భార్య ‘సనా జావేద్’ ఎంత ఫేమస్సో తెలుసా?
    Sana Javed: షోయాబ్‌ మాలిక్ కొత్త భార్య ‘సనా జావేద్’ ఎంత ఫేమస్సో తెలుసా?
    పాక్‌ నటి ‘సనా జావేద్‌’ (Sana Javed)ను పాక్‌ మాజీ కెప్టెన్‌ షోయాబ్‌ మాలిక్‌ (Shoaib Malik) మూడో పెళ్లి చేసుకోవడంతో ప్రస్తుతం ఆమె పేరు మార్మోగుతోంది.&nbsp; భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మిర్జా (Sania Mirza)కు షోయాబ్‌ భర్త కాగా, వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.&nbsp; ఈ క్రమంలోనే సనా జావేద్‌ను వివాహం చేసుకున్నట్లు షోయాబ్‌ ప్రకటించడంతో ఒక్కసారిగా ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ‘సనా జావేద్‌’.. సౌదీ అరేబియాలోని జడ్డా ప్రాంతంలో మార్చి 24, 1993న జన్మించింది. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది.&nbsp; ఈ క్రమంలోనే 2012లో పాక్‌ సీరియల్‌ 'మేరా పెహ్లా ప్యార్‌'తో నటిగా అరంగేట్రం చేసింది. అదే ఏడాది షెహర్‌-ఈ-జాత్‌ అనే టీవీ సిరీస్‌లోనూ ఆమె కనిపించింది. 2016లో ప్రముఖ సీరియల్‌ యాక్టర్‌ జాహిద్‌ అహ్మద్‌తో 'జరా యాద్‌ కర్‌' అనే టీవీ సిరీస్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; దీంతో తర్వాతి ఏడాదే (2017) ఆమెకు పాక్‌ సినిమాలో అవకాశం దక్కింది. యంగ్‌ హీరో ధనిష్‌ తైమూర్ సరసన ‘మెహరునీసా ఐ లవ్‌ యూ’ (Mehrunisa V Lub U) అనే చిత్రంలో సనా హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది. అదే ఏడాది 'రంగ్‌రేజా' చిత్రంలో లీడ్‌ రోల్‌లో కనిపించి నటిగా పాక్‌ ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.&nbsp; 2020లో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన 'జీతో పాకిస్తాన్‌ లీగ్‌' అనే రియాలిటీ షోలో డ్రాగన్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి సనా అందరి దృష్టిని ఆకర్షించింది. అదే ఏడాది సనా జావేద్‌కి వివాహమైంది. 2020 అక్టోబర్‌లో పాక్‌ సింగర్‌ ఉమైర్ జస్వాల్‌ను కరాచీలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.&nbsp; అయితే వారి కాపురం ఎక్కువ రోజులు నిలబడలేదు. కొద్ది రోజులకే సనా, ఉమైర్‌ విడివిడిగా జీవించడం ప్రారంభించారు. తమ ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించారు. ఆ తర్వాత కొద్దిరోజుల పాటు ఒంటరిగానే జీవించిన సనా జావేద్‌.. ఆ తర్వాత పాక్‌ మాజీ కెప్టెన్‌ షోయాబ్‌ మాలిక్‌కు దగ్గరైంది. గతేడాది సనా బర్త్‌డేకు షోయాబ్‌ బహిరంగంగా విషెస్‌ చెప్పడంతో వారి బంధం తొలిసారి వెలుగు చూసింది.&nbsp; అప్పటి నుంచి వారి డేటింగ్‌కు సంబంధించిన వార్తలు తరచూ చక్కర్లు కొట్టాయి. తాజాగా పెళ్లి బంధంతో షోయాబ్‌, సనా ఒక్కటై ఆ వార్తలకు ముగింపు పలికారు. ఇక రీసెంట్‌గా ‘ఐ లవ్‌ యూ జారా’ (2023) అనే చిత్రంలో సనా జావేద్‌ నటించింది. ‘సుకూన్‌’ అనే సీరియల్‌లోనూ ఐనా పాత్రను పోషిస్తోంది.&nbsp; ప్రస్తుతం సనా.. ఏ చిత్రాలను ఒప్పుకోలేదు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్న 'మెహమ్మద్‌ ఏక్‌ సాజా' అనే సిరీయల్‌లో మాత్రం ఆమె నటిస్తోంది.&nbsp;
    జనవరి 20 , 2024
    Mothers Day Special: మహేష్ బాబు సోదరి ఎమోషనల్.. సరదాగా కాజల్, రాశి ఖన్నా, హనిరోజ్!
    Mothers Day Special: మహేష్ బాబు సోదరి ఎమోషనల్.. సరదాగా కాజల్, రాశి ఖన్నా, హనిరోజ్!
    మాతృదినోత్సవాన్ని సినీ తారలు ఘనంగా జరుపుకున్నారు. ఎప్పుడూ షూటింగ్‌లో బిజీగా ఉండే వారంతా మదర్స్‌డే రోజున పూర్తిగా తమ తల్లులతో టైమ్‌ స్పెండ్ చేశారు. వారితో ఆప్యాయంగా గడిపారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోలను సినీ తారలు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తమ తల్లితో ఉన్న అనుబంధాన్ని ఫొటోల రూపంలో పంచుకున్నారు. మరోవైపు అమ్మ దూరమైన జాన్వికపూర్‌, విష్ణుప్రియ తదితరులు తల్లితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మాతృదినోత్సవం సందర్భంగా తారలు పోస్టు చేసిన ఫొటోలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; పంజా వైష్ణవ్‌ తేజ్‌ చిరంజీవి మేనల్లుడు, ఉప్పెన సినిమా హీరో పంజా వైష్ణవ్‌ మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు చెప్పాడు. అన్న సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి తల్లితో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు.  View this post on Instagram A post shared by Sai Dharam Tej (@jetpanja) శ్రీజ కొణిదెల మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూమార్తె శ్రీజ.. మాతృదినోత్సవం రోజున తన తల్లితో సరదాగా గడిపింది. తన అక్క సుశ్మితతో కలిసి తల్లితో దిగిన ఫొటోను నెట్టింట షేర్ చేసింది. తనకు లభించిన అత్యుత్తమైన బహుమతి తన తల్లి అని శ్రీజ క్యాప్షన్ ఇచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) కాజల్ అగర్వాల్ ప్రముఖ కథానాయిక కాజల్ అగర్వాల్‌ కూడా తన తల్లికి మదర్స్‌డే శుభాకాంక్షలు చెప్పింది. తన తల్లితో దిగిన ఫోటోనూ షేర్‌ చేసిన కాజల్‌.. ఆమె లేకుంటే తాను ఈ స్థాయికి వచ్చే దానిని కాదని పేర్కొంది.&nbsp; View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ తన తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుంది. ఆమెతో దిగిన చిన్నప్పటి ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ప్రపంచంలోనే గ్రేటెస్ట్‌ మధర్ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) విష్ణు ప్రియ బుల్లితెర యాంకర్‌ విష్ణుప్రియ మాతృదినోత్సవం రోజున తన తల్లిని గుర్తు చేసుకుంది. ప్రతీ క్షణం నిన్ను మిస్‌ అవుతూనే ఉంటానని చనిపోయిన తల్లీని ఉద్దేశిస్తూ పోస్టు పెట్టింది. View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) రాశి ఖన్నా నటి రాశి ఖన్నా తన తల్లితో ఎంతో సంతోషంగా ఉయ్యాల ఊగుతున్న ఫొటోను షేర్ చేసింది. ‘ఐ లవ్‌ యూ’ అంటూ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) మమతా మోహన్‌ దాస్‌ నటి మమతా మోహన్‌ దాస్‌ కూడా తన తల్లి గొప్పతాన్ని నెటిజన్లకు తెలియజేసింది. నా జీవితంలో గడిపిన ప్రతీ రోజూ నువ్వు ఇచ్చిందేనని తన తల్లి గురించి చెప్పుకొచ్చింది. ఆమెతో దిగిన ఫొటోను కూడా నెటిజన్లతో మమతా పంచుకుంది.  View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) హనీరోజ్‌ గ్లామర్‌ బ్యూటీ హనీరోజ్‌ కూడా మాతృదినోత్సవం రోజున తన తల్లి ప్రేమను గుర్తుచేసుకుంది. తన అమ్మతో పాటు ప్రపంచంలోని ప్రతీ అమ్మకు శుభాకాంక్షలు తెలియజేసింది.&nbsp; View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) పద్మావతి మహేష్‌బాబు సోదరి గల్లా పద్మావతి కూడా మాతృదినోత్సవ రోజున తన తల్లి చూపించిన ఆప్యాయతను గుర్తుచేసుకుంది. పద్మావతి కుమారుడు, నటుడు అశోక్‌ గల్లా ఈ ఫొటోను షేర్ చేశాడు. తన తల్లి లేని జీవితాన్ని ఊహించుకోలేనంటూ క్యాప్షన్ ఇచ్చాడు.&nbsp; View this post on Instagram A post shared by Galla Ashok (@ashokgalla_) నైనికా విద్యాసాగర్ మీనా కుమార్తె నైనికా విద్యాసాగర్‌ తన తల్లితో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసింది.&nbsp; View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16)
    మే 15 , 2023
    Batukamma Song: సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ సాంగ్.. ఆడి పాడిన సల్లు భాయ్!
    Batukamma Song: సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ సాంగ్.. ఆడి పాడిన సల్లు భాయ్!
    తెలంగాణలో బతుకమ్మ పండగ ఎంతో విశిష్టమైంది. తొమ్మిది రోజుల పాటు ఎంతో సంబరంగా ఈ పండగను జరుపుకుంటారు. మహిళలు పూలను అలకరించి బతుకమ్మ ఆటలు ఆడతారు. అయితే తెలంగాణ, తెలుగు ప్రజలకు మాత్రమే పరిమితమైన ఈ పండగ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తెలియనుంది. పాన్‌ ఇండియా స్థాయిలో బతుకమ్మ క్రేజ్‌ పెరగనుంది. ఎందుకంటే బతుకమ్మ వైభవాన్ని సల్మాన్‌ వెండి తెరపై చూపించబోతున్నారు. సల్మాన్‌ కథానాయకుడిగా ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ చిత్రం తెరకెక్కుతోంది. ఫర్హాద్‌ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్‌, జగపతి బాబు, పూజా హెగ్డే, భూమిక, షెహ్‌నాజ్‌ గిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసిన పాట అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ సంస్కృతి ప్రతీక అయిన బతుకమ్మను ఆ పాటలో చూపించారు.&nbsp; https://twitter.com/taran_adarsh/status/1641693728367845377?s=20 బతుకమ్మ పాటలో తెలంగాణ సంస్కృతి ఉట్టి పడింది. పూజా హెగ్డే తలపైన బతుకమ్మను మోస్తూ కనిపించారు. హెగ్డేతో పాటు వెంకటేష్‌, భూమికలు బతుకమ్మను తీసుకెళ్తూ కనిపించారు. భూమిక, పూజా హెగ్డే స్టెప్స్‌తో అదరగొట్టారు. పాట చివర్లో సల్మాన్‌ పంచలో కనిపించి అందరికీ షాక్‌ ఇచ్చారు. పంచ, నుదిటిన బొట్టుతో సల్మాన్‌ తెలుగు తనం ఉట్టిపడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది.&nbsp; https://youtu.be/tdOg8X0RV9I బతుకమ్మ పండగ శోభ ఇప్పుడు బాలీవుడ్‌కు చేరడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. సల్మాన్‌ సినిమాలో బతుకమ్మను చూపించడం ద్వారా ఈ పండుగ విశిష్టత మరింత మందికి తెలిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ పాటతో బతుకమ్మ క్రేజ్‌ పాన్‌ ఇండియా స్థాయికి చేరిందని పేర్కొన్నారు. బతుకమ్మ పాటపై సల్మాన్‌ పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, నటుడు వెంకటేష్‌ సూచన మేరకే సల్మాన్‌ బతుకమ్మను పాటను పెట్టినట్లు తెలుస్తోంది.&nbsp; https://twitter.com/RaoKavitha/status/1641699065447710721 ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ చిత్రంలో బతుకమ్మ పాటను పెట్టడాన్ని నెటిజన్లు స్వాగతిస్తున్నారు. ‘లవ్‌ యూ భాయ్’ అని సల్మాన్‌ను ఉద్దేశిస్తూ కామెంట్లు చేస్తున్నారు. జై తెలంగాణ, జై బతుకమ్మ అంటూ పోస్టులు పెడుతున్నారు. తెలుగు సంప్రదాయ లుక్‌లో సల్మాన్‌ అదిరిపోయాడని ప్రశంసిస్తున్నారు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సల్మాన్‌కు బతుకమ్మ ఆశీస్సులతో సూపర్‌ హిట్ లభిస్తుందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.&nbsp; ‘కిసీ కా భాయ్‌, కిసీ కా జాన్‌’ చిత్రాన్ని తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన వీరమ్‌కు రీమేక్‌గా తెరకెక్కించారు. వీరుడొక్కడే పేరుతో తెలుగులో ఈ సినిమా డబ్‌ కూడా అయింది. సల్మాన్‌ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌, రవి బస్రూర్‌, హిమేష్ రేష్మియా సంగీతం అందిస్తున్నారు.ఈద్‌ సందర్భంగా ఏప్రిల్‌ 4న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు టీజర్‌, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. అంతేగాక వెంకటేష్‌ నటిస్తుండటంతో తెలుగులోనూ విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి.
    మార్చి 31 , 2023
    The Elephant Whisperers: ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’కి ఆస్కార్ అవార్డు.. భరతభూమికి అంకితం ఇచ్చిన డైరెక్టర్ కార్తికి గొన్సాల్వేస్
    The Elephant Whisperers: ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’కి ఆస్కార్ అవార్డు.. భరతభూమికి అంకితం ఇచ్చిన డైరెక్టర్ కార్తికి గొన్సాల్వేస్
    ఎన్నో ఏళ్ల తరువాత మళ్ళీ భారతీయ సినిమాకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు దక్కింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డును గెలుచుకుని చరిత్ర సృష్టించింది. భారత్ నుంచి ఆస్కార్ అవార్డు గెలుపొందిన తొలి డాక్యుమెంటరీ లఘు చిత్రం ఇదే కావడం విశేషం. 95వ ఆస్కార్ మహోత్సవంలో ఇతర భాషల లఘుచిత్రాలతో పోటీ పడి ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డు గెలుచుకుంది.&nbsp; భరతభూమికి అంకితం.. 95వ ఆస్కార్ వేడుకలకు హాజరైన డైరెక్టర్ కార్తికి గొన్సాల్వేస్ వేదికపై అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అవార్డును జన్మభూమి భారత్‌కు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్రబృందానికి, కుటుంబానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్తికి గొన్సాల్వేస్ తల్లి ప్రిసిల్లా గొన్సాల్వేస్ ఈ సినిమాకు కథను అందించారు.&nbsp; వీటితో పోటీ.. హాలౌట్(Haulout), హౌ డు యు మెజర్ ఎ ఇయర్(How Do You Measure a Year?), ద మార్తా మిచెల్ ఎఫెక్ట్(The Martha Mitchell Effect), స్ట్రేంజర్ ఎట్ ద గేట్(Stranger at the Gate) చిత్రాలతో పోటీ పడి ద ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డు గెలుచుకుంది. తమిళంలో తెరకెక్కిన ఈ లఘు చిత్రం 2022 డిసెంబర్ 8న విడుదలైంది.&nbsp; కథేంటి..? ఏనుగు, ఓ కుటుంబం మధ్య ఏర్పడే అనుబంధం గురించి ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ వివరిస్తుంది. బొమ్మన్, బెల్లి దంపతులు ‘రఘు’ అనే అనాథ ఏనుగును చిన్నప్పుడే దత్తత తీసుకుని అపురూపంగా పెంచుకుంటారు. గాయపడిన ‘రఘు’కు ఎన్నో సపర్యలు చేసి పెంచుకునే క్రమంలో బంధుత్వం ఏర్పడుతుంది. ఈ షార్ట్‌ఫిలిం ప్రేక్షకులకు ఎమోషనల్ టచ్ ఇచ్చింది. అదే సమయంలో గిరిజనుల జీవన విధానం, పచ్చని అడవి అందాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలి చిత్రం అయినప్పటికీ చాలా చక్కగా తీశారు డైరెక్టర్ కార్తికి. షార్ట్ ఫిలిం వెనక ఎంతో శ్రమ షార్ట్ ఫిలిం అయినప్పటికీ ఈ లఘుచిత్రాన్ని తీయడానికి డైరెక్టర్ కార్తికి అండ్ టీం ఎంతో శ్రమ పడ్డారు. ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ తీయడానికి దాదాపు ఐదేళ్లు పట్టిందని డైరెక్టర్ కార్తికి గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మూడు నెలలు వయసు ఉన్నప్పుడే పిల్ల ఏనుగు ‘రఘు’ను కలిసినట్లు కార్తికి చెప్పారు. ఏడాదిన్నర పాటు ఈ ఏనుగుతో గడిపారట. తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో కొలువై ఉన్న ‘ముదుమలై నేషనల్ పార్క్’లో ఈ సినిమాను చిత్రీకరించారు.&nbsp; నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్.. 39 నిమిషాల నిడివితో కూడిన ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థ కింద ఈ సినిమా తెరకెక్కింది. గునీత్ మొంగా ప్రొడ్యూస్ చేశారు.&nbsp; మూడో చిత్రం..&nbsp; భారత్ నుంచి ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ఆస్కార్ నామినేషన్లు దక్కించుకున్న మూడో సినిమా ఇది. గతంలో రెండు లఘు చిత్రాలు ఆస్కార్‌కు పోటీపడ్డాయి. 1969లో ద హౌజ్ దట్ ఆనంద బిల్ట్(The House That Ananda Built), 1979లో యాన్ ఎన్‌కౌంటర్ విత్ ఫేసెస్(An Encounter With Faces) నామినేషన్లు దక్కించుకున్నాయి. కానీ, అవార్డును పొందలేకపోయాయి. ద ఎలిఫెంట్ విస్పరర్స్ ఈ లోటును తీర్చింది.
    మార్చి 13 , 2023
    Sophie Choudry: పలుచటి చీరలో కనువిందు చేస్తున్న సోఫి అందాలు
    Sophie Choudry: పలుచటి చీరలో కనువిందు చేస్తున్న సోఫి అందాలు
    బాలీవుడ్‌ నటి, ప్రముఖ సింగర్‌ సోఫి చౌదరి (Sophie Choudry) మరోమారు తన గ్లామర్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో రచ్చ చేసింది. తళతళ మెరిసే సిల్వర్‌ కలర్ శారీలో ఎద అందాలను ఆరబోసింది. పలుచటి శారీలో టైట్‌ఫిట్‌ జాకెట్‌తో సోఫిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 40 ఏళ్ల వయసులోనూ సోఫి అందం ఏమాత్రం తగ్గలేదని కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో జన్మించిన ఈ భామ.. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. సింగింగ్‌పై ఆసక్తితో తన 12వ ఏట నుంచే సోఫీ ఆ దిశగా అడుగులు వేసింది. 2000ల సంవత్సరం నుంచి పాప్‌ సింగర్‌గా సోఫీ తన కెరీర్‌ను ప్రారంభించింది. ‘ఏ దిల్‌ సున్‌ రహా హై', 'హబిబి' పాటలను స్వయంగా రాసి పాడింది. అలాగే పలు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ సైతం చేసింది.&nbsp;&nbsp; పాపులర్‌ షో MTV Lovelineకు హోస్ట్‌గా వ్యవహరించిన సోఫీ.. 'బేబీ లవ్‌' ఆల్బమ్‌ సక్సెస్‌తో మరింత పాపులర్ అయ్యింది. దీంతో ఆమెకు బాలీవుడ్‌ సినిమాల నుంచి అవకాశాలు చుట్టుముట్టాయి.&nbsp; 2005లో సంజయ్‌ దత్‌ హీరోగా చేసిన షాది నెం.1 సినిమాతో సోఫి సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో డింపుల్‌ కొతారి పాత్ర పోషించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుసగా ప్యార్‌ కే సైడ్‌ ఎఫెక్ట్స్‌, ఐ సీ యూ, హే బేబి, అగర్‌, స్పీడ్‌, మనీ హై తో హనీ హై, కిడ్నాప్‌, డాడీ కూల్‌, చింటూజీ, అలిబాగ్‌, వేడి, షూటౌట్‌ ఎట్‌ వాలా వంచి బాలీవుడ్‌ చిత్రాల్లో ఆమె నటించింది.&nbsp; తెలుగులో మహేష్‌ హీరోగా చేసిన 'వన్‌ నేనొక్కడినే' సినిమాలో లండన్‌ బాబు పాటలో సోఫి చౌదరి మెరిసింది. అద్భుతమైన స్టెప్పులతో తెలుగు ఆడియన్స్‌ను అలరించింది.&nbsp; ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో టెలివిజన్‌ ప్రెజంటర్‌గా పలు షోలను సోఫీ చేస్తోంది. అటు సోషల్‌మీడియాలోనూ చురుగ్గా వ్యవహిస్తోంది.&nbsp; సోఫీ ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 5.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.&nbsp;
    నవంబర్ 16 , 2023

    @2021 KTree