పాక్ నటి ‘సనా జావేద్’ (Sana Javed)ను పాక్ మాజీ కెప్టెన్ షోయాబ్ మాలిక్ (Shoaib Malik) మూడో పెళ్లి చేసుకోవడంతో ప్రస్తుతం ఆమె పేరు మార్మోగుతోంది.
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా (Sania Mirza)కు షోయాబ్ భర్త కాగా, వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే సనా జావేద్‌ను వివాహం చేసుకున్నట్లు షోయాబ్ ప్రకటించడంతో ఒక్కసారిగా ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నారు.
‘సనా జావేద్’.. సౌదీ అరేబియాలోని జడ్డా ప్రాంతంలో మార్చి 24, 1993న జన్మించింది. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది.
ఈ క్రమంలోనే 2012లో పాక్ సీరియల్ ‘మేరా పెహ్లా ప్యార్’తో నటిగా అరంగేట్రం చేసింది. అదే ఏడాది షెహర్-ఈ-జాత్ అనే టీవీ సిరీస్‌లోనూ ఆమె కనిపించింది.
2016లో ప్రముఖ సీరియల్ యాక్టర్ జాహిద్ అహ్మద్‌తో ‘జరా యాద్ కర్’ అనే టీవీ సిరీస్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
దీంతో తర్వాతి ఏడాదే (2017) ఆమెకు పాక్ సినిమాలో అవకాశం దక్కింది. యంగ్ హీరో ధనిష్ తైమూర్ సరసన ‘మెహరునీసా ఐ లవ్ యూ’ (Mehrunisa V Lub U) అనే చిత్రంలో సనా హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది.
అదే ఏడాది ‘రంగ్‌రేజా’ చిత్రంలో లీడ్ రోల్‌లో కనిపించి నటిగా పాక్ ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
2020లో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘జీతో పాకిస్తాన్ లీగ్’ అనే రియాలిటీ షోలో డ్రాగన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి సనా అందరి దృష్టిని ఆకర్షించింది.
అదే ఏడాది సనా జావేద్‌కి వివాహమైంది. 2020 అక్టోబర్‌లో పాక్ సింగర్ ఉమైర్ జస్వాల్‌ను కరాచీలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.
అయితే వారి కాపురం ఎక్కువ రోజులు నిలబడలేదు. కొద్ది రోజులకే సనా, ఉమైర్ విడివిడిగా జీవించడం ప్రారంభించారు. తమ ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించారు.
ఆ తర్వాత కొద్దిరోజుల పాటు ఒంటరిగానే జీవించిన సనా జావేద్.. ఆ తర్వాత పాక్ మాజీ కెప్టెన్ షోయాబ్ మాలిక్‌కు దగ్గరైంది.
గతేడాది సనా బర్త్‌డేకు షోయాబ్ బహిరంగంగా విషెస్ చెప్పడంతో వారి బంధం తొలిసారి వెలుగు చూసింది.
అప్పటి నుంచి వారి డేటింగ్‌కు సంబంధించిన వార్తలు తరచూ చక్కర్లు కొట్టాయి. తాజాగా పెళ్లి బంధంతో షోయాబ్, సనా ఒక్కటై ఆ వార్తలకు ముగింపు పలికారు.
ఇక రీసెంట్‌గా ‘ఐ లవ్ యూ జారా’ (2023) అనే చిత్రంలో సనా జావేద్ నటించింది. ‘సుకూన్’ అనే సీరియల్‌లోనూ ఐనా పాత్రను పోషిస్తోంది.
ప్రస్తుతం సనా.. ఏ చిత్రాలను ఒప్పుకోలేదు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘మెహమ్మద్ ఏక్ సాజా’ అనే సిరీయల్‌లో మాత్రం ఆమె నటిస్తోంది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్