• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ugadi Special Movie Posters: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!

    ఉగాది సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్‌ ముందుకు తీసుకొచ్చాయి. ఉగాది స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.  

    సరిపోదా శనివారం

    నాని హీరోగా చేస్తున్న ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaram) చిత్రం నుంచి ఓ ఆకర్షణీయమైన పోస్టర్‌ రిలీజైంది. ప్రముఖ నటుడు సాయికుమార్‌ నానితో పాటు ఈ పోస్టర్‌లో కనిపించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ చేసింది. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్‌ కానున్నట్లు మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు. 

    RT 75

    ఇటీవల ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja).. తన తర్వాతి ప్రాజెక్టును ఉగాది సందర్భంగా అనౌన్స్ చేశారు. ‘RT75’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రైటర్‌ భాను బొగ్గవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

    లవ్‌ మౌళి

    ప్రముఖ నటుడు నవదీప్ (Navdeep) హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పంఖురి గిద్వానీ ఈ సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఈ ట్రైలర్‌ వీక్షకులను ఆకట్టుకుంటోంది. 

    అరణ్మనై 4 

    రాశీ ఖన్నా (Rashi Khanna), తమన్నా (Tamannaah), సుందర్. సి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అరణ్మనై 4’ (Aranmanai 4) చిత్రం నుంచి కూడా ఉగాది కానుకగా ఓ పోస్టర్‌ విడుదలైంది. పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్‌ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.

    కమిటీ కుర్రోళ్లు

    నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో రూపొందుతున్న ప్రొడక్షన్‌ నెం.1 చిత్రానికి ఉగాది సందర్భంగా టైటిల్‌ ఎనౌన్స్ చేశారు. ‘కమిటీ కుర్రోళ్లు’ అనే పేరును ఈ మూవీకి ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌ను సుప్రీమ్‌ హీరో సాయి దుర్గా తేజ్‌ అనౌన్స్‌ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. దర్శకుడు యదు వంశీ కొత్త వాళ్లతో ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం.

    ధూం ధాం

    చైతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ (Hebha Patel) జంటగా నటిస్తున్న ‘ధూం ధాం’ (Dhoom Dhaam) చిత్రం నుంచి కూడా కొత్త పోస్టర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో సినిమాలోని ప్రధాన తారాగణం అంతా కనిపించింది. ఈ మూవీని దర్శకుడు సాయి కిషోర్‌ తెరకెక్కిస్తున్నారు. 

    ఏ మాస్టర్‌ పీస్‌ 

    సుకు పూర్వజ్‌ రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘ఏ మాస్టర్‌ పీస్‌’ (A Master Peace). అరవింద్‌ కృష్ణ, జ్యోతి పుర్వాజ్‌, అషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి పండగ సందర్భంగా పోస్టర్‌ రిలీజైంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

    దేవకి నందన వాసుదేవ

    సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్‌ గల్లా (Ashok Galla) నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vaasudeva). మేకర్స్ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఇందులో అశోక్‌ గల్లా లుక్ ఆకట్టుకుంటోంది.

    భలే ఉన్నాడే!

    యువ నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj Tharun) హీరోగా రూపొందుతున్న భలే ఉన్నాడే సినిమా నుంచి ఓ పోస్టర్‌ విడుదలైంది. ఇందులో రాజ్‌ తరుణ్‌ ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనిపించాడు. 

    ప్రతినిధి 2

    నారా రోహిత్‌ (Nara Rohit) హీరోగా ప్రముఖ జర్నలిస్టు మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రతినిధి 2’ (Pratinidhi 2). ఈ మూవీ పోస్టర్‌ కూడా ఉగాది సందర్భంగా విడుదలై సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

    కృష్ణమ్మ 

    సత్యదేవ్‌ (Satya Dev) లేటెస్ట్‌ మూవీ ‘కృష్ణమ్మ’ (Krishnamma) నుంచి ఉగాది సందర్భంగా ఓ సాలిడ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీలోని దుర్గమ్మ పాటను ఏప్రిల్‌ 11న ఉ.11.11 గం.లకు రిలీజ్‌ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్‌ ప్రకటించారు. ఇందులో సత్యదేవ్‌ త్రిశూలం పట్టుకొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv