• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Animal Movie OTT: ఓటీటీ ప్రియులకు గ్రాండ్‌ ట్రీట్.. మరికొద్ది గంటల్లో ‘యానిమల్‌’ స్ట్రీమింగ్‌!

    రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ వంగా (Sandeep Reddy) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా చిత్రం ‘యానిమల్‌’ (Animal movie). ఈ చిత్రం రేపటి నుంచి (జనవరి 26) ఓటీటీలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ‘యానిమల్‌’ స్ట్రీమింగ్‌లోకి రానుంది. 

    ‘యానిమల్’ స్ట్రీమింగ్‌ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ స్వయంగా ప్రకటిస్తూ ఎక్స్‌ (ట్విటర్‌)లో ఓ ఆసక్తికర వీడియోను సైతం పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో #AnimalOnNetflix హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

    ‘గాలి దట్టంగా ఉంది.. ఉష్ణోగ్రత పెరుగుతోంది’ అంటూ నెట్‌ఫ్లిక్స్‌ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. జనవరి 26 నుంచి తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ‘యానిమల్‌’ (Animal Movie OTT Release) చిత్రాన్ని వీక్షించవచ్చని స్పష్టం చేసింది. 

    డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్‌ చిత్రం #AnimalOnNetflix  బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. యువ ప్రేక్షకులను (Animal movie ott release date telugu) అమితంగా ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

    యానిమల్‌ చిత్రాన్ని ఇప్పటికే థియేటర్లలో వీక్షించిన వారికి కూడా ఓటీటీ వెర్షన్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. దాదాపు 8 నిమిషాల అదనపు నిడివితో దీన్ని తీసుకొస్తున్నారు. థియేటర్‌లో చూడలేకపోయిన సన్నివేశాలను ఇందులో చూసే అవకాశం కల్పించారు. 

    యానిమల్‌ మూవీ రన్‌ టైమ్‌ 3 గం.ల 21 నిమిషాలు కాగా.. ఓటీటీ కోసం అదనపు సన్నివేశాలు జోడించి దాదాపు మూడున్నర గంటలతో ‘యానిమల్‌’ (Animal movie ott release date telugu)ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. దీంతో ఆ సన్నివేశాలు ఏంటా అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది.

    యాక్షన్ ప్రియులకు (#AnimalOnNetflix) పసందైన విందు భోజనాన్ని అందించిన యానిమల్‌కు కొనసాగింపుగా మరో చిత్రం సైతం రానుంది. యానిమల్‌ పార్క్‌ (Animal Park) టైటిల్‌తో ఆ చిత్రాన్ని రూపొందించనున్నట్లు డైరెక్టర్‌ సందీప్‌ వంగా ఇప్పటికే ప్రకటించారు. 

    ఇక యానిమల్‌ చిత్రాన్ని హిందీ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ప్రొడ్యూస్ చేసింది.  హిందీతో పాటు ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేసింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. 

    డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాకు బాలీవుడ్‌లో ఇది రెండో చిత్రం. అంతకుముందు ఆయన అర్జున్‌ రెడ్డి చిత్రాన్ని ‘కబీర్‌ సింగ్‌’ (Kabir singh)పేరుతో హిందీలో తెరకెక్కించారు. ఇక యానిమల్ చిత్రంలో రణ్‌బీర్‌కు జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించింది. అనిల్‌ కపూర్‌ బాబీ డియోల్‌, శక్తికపూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

    ‘యానిమల్‌’ కథ విషయానికి వస్తే..  రణ్ విజయ్ సింగ్ బల్బీర్ (రణబీర్ కపూర్)‌కు తండ్రి మీద విపరీతమైన ప్రేమ. తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) కోసం ఎంత దూరమైన వెళ్తాడు. తండ్రి బల్బీర్ సింగ్ ఓ బిజీగా ఉండే వ్యాపార వేత్త. ఇండియాలోనే అతిపెద్ద స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీని నడుపుతుంటాడు. బిజీ లైఫ్‌ వల్ల తన కొడుకుతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతుంటాడు. పూర్తి రివ్యూ కోసం కింద ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయండి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv