‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సక్సెస్ తర్వాత జూ.ఎన్టీఆర్ (Jr NTR) క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది. బాలీవుడ్‌లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం తారక్ ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం తర్వాత ‘NTR 31’ ప్రాజెక్ట్‌లో నటించేందుకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘కేజీఎఫ్’ (KGF), ‘సలార్’ (Salaar) లాంటి బ్లాక్‌బాస్టర్ చిత్రాలను అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. దీంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
డ్యూయల్ రోల్‌లో తారక్?
తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రానున్న ‘NTR 31’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఇందులో తారక్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్ కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.
నర రూప రాక్షసుడిగా..!
‘NTR 31’ చిత్రంలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం ఓ పాత్రలో మాఫియా డాన్‌గా తారక్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో అతడు నరరూప రాక్షసుడిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. తారక్ పాత్రను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సరికొత్తగా డిజైన్ చేసినట్లు సమాచారం. ఆ పాత్ర కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు సైతం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాతనే ‘సలార్ 2’ మెుదలు పెట్టాలని ప్రశాంత్ నీల్ ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది.
డ్రాగన్ టైటిల్ ఫిక్స్!
NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్‌నే దాదాపుగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందట. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా దానికి ఉంటుందని అంటారు. ఇంత పవర్‌ఫుల్ పేరు అయినందువల్లే డ్రాగన్ టైటిల్‌ను ప్రశాంత్ నీల్ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పైగా తారక్ ఇందులో నెగిటివ్ రోల్‌లో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించనున్న నేపథ్యంలో ఈ టైటిల్ అయితేనే సరిగ్గా మ్యాచ్ అవుతుందని ఆయన భావిస్తున్నారట. టైటిల్ ఖరారుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.
రూ.300 కోట్ల ఖర్చుతో..
తారక్, ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న NTR 31 చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణానికి రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు అవుతుందని సమాచారం. రెమ్యూనరేషన్‌గా తారక్‌కు భారీ మెుత్తంలో ముట్టజెప్పే అవకాశముందని అంటున్నారు. కాగా, ఈ మూవీలో తారక్ సరసన రష్మిక మందన్న చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే ఇతర నటీనటులను కూడా ఫైనల్ చేస్తారని సమాచారం.
‘దేవర’ రిలీజ్ ఎప్పుడంటే?
క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న దేవర చిత్రం సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. జనతా గ్యారేజ్ తర్వాత తారక్ – కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) చేసింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ఇందులో విలన్‌గా కనిపించనున్నారు. వాస్తవానికి అక్టోబర్ 10న దేవర రిలీజ్ కావాల్సి ఉండగా.. పనులు శరవేగంగా సాగుతుండటంతో సెప్టెంబర్ 27కు మార్చినట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!