బుల్లితెర యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన అనసూయ ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో స్టార్ నటిగా మారిపోయింది. అయితే గత కొంతలంగా అనసూయ ఏమాట్లాడిన నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అనసూయ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాటికి సోషల్ మీడియా వేదికగా పలుమార్లు దీటుగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు అనసూయ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఓ హీరో ఫ్యాన్స్‌ను టార్గెట్ చేస్తూ పోస్టు పెట్టారు. ప్రస్తుతం అది హాట్ టాపిక్‌గా మారింది.
అనసూయ షాకింగ్ పోస్టు
బుల్లితెరపై ప్రయాణం ప్రారంభించి వెండి తెరపై ఓ వెలుగు వెలుగుతున్న అనసూయ మరోమారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టిన అనసూయ కొందరిని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ‘మరీ ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలా? నేను ఏం మాట్లాడినా అది ట్రోల్స్ చేస్తుంటారు. ఆ టాపిక్ గురించే మాట్లాడుతారు. మీకు దమ్ముంటే వారిపైన చూపించండి. నా మీద కాదు. కానీ, మీరు అలా చేయరు కదా. ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరోలా ఆడవారిని ఉద్దేశించి గొడవ పడటం మాత్రమే వచ్చు కదా పాపం. మీరంతా త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ పోస్టుకు ఎవరినీ ట్యాగ్ చేయకపోవడంతో ఈ పోస్టుపై గందరగోళం ఏర్పడింది. ఆమె ఎవరినీ టార్గెట్ చేసి అన్నారో తెలియక నెటిజన్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు.
విజయ్ దేవరకొండను ఉద్దేశించేనా?
అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది అందించిన కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. అయితే బుధవారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా చిత్ర యూనిట్‌తో పాటు అనసూయ పాల్గొంది. ఈ సందర్భంగా ట్రైలర్‌లోని ఓ సీన్‌పై జర్నలిస్టులు అనసూయను ప్రశ్నించారు. అలాగే విజయ్ దేవరకొండతో గొడవ గురించి ప్రస్తావన వచ్చింది. దీనిపై మాట్లాడిన అనసూయ తనకు విజయ్‌కు మధ్య పెద్దగా గొడవలు లేవని, స్టేజ్ మ్యానర్స్ గురించే ఆ రోజు తాను మాట్లాడాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. లైమ్ టైల్‌లో ఉన్నప్పుడు పద్దతిగా ఉండాలని మాత్రమే చెప్పానని అంతకు మించి ఎవరి మీద తనకు వ్యక్తిగతంగా ఎటువంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలో ఇలా ఫైర్ అవుతూ పోస్టులు పెట్టడం షాక్‌కు గురిచేస్తోంది. ఇది విజయ్ దేవరకొండను ఉద్దేశించి పెట్టిన పోస్టు అన్న అనుమానం ఇండస్ట్రీ వర్గాల్లో కలుగుతోంది.
గతంలోనూ ఇలాగే..
అనసూయ ఈ తరహా అగ్రెసివ్ పోస్టులు పెట్టడం ఇదే తొలిసారి కాదు. తనను ఆంటీ అన్న నెటిజన్లపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ గతంలో చాలానే పోస్టులు పెట్టారు. ఆంటీ అని పిలిస్తే ఎందుకు కోపం వస్తుందని గతంలో ఓ నెటిజన్ ప్రశ్నించగా, కొందరు మాటల్లో అర్థాలు వేరుంటాయని ఆమె చెప్పుకొచ్చింది. మరో సందర్భంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఘాటైన క్యాప్షన్ పెట్టి అందరినీ షాక్ గురిచేసింది. తన గ్లామరస్ ఫోటోలోను షేర్ చేస్తూ హాట్ క్యాప్షన్ ఇచ్చింది. ‘నేను మహిళని , భయం లేదు, సెక్సీగా ఉంటాను, అజేయురాలిని, సృజనాత్మకత కలిగిన మహిళని, మీకు ఏమైనా నేర్పించగలను.. నేను మిమ్మల్ని ప్రేమించగలను’ అంటూ రాసుకొచ్చింది. ఇలా అనసూయ పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారడం గత కొంతకాలంగా కామన్‌గా మారిపోయింది.
అనసూయ ప్రస్థానం
జబర్దస్త్ షో ద్వారా అనసూయ తొలిసారి బుల్లితెరకు పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది. కేవలం యాంకర్‌గానే గాక గ్లామర్ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది. తద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా, కథనం, F2, చావు కబురు చల్లగా, థ్యాంక్ యూ బ్రదర్, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది. సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. రీసెంట్‌గా ‘రజాకార్’ చిత్రంలో పోచమ్మ పాత్రలో కనిపించి అనసూయ అందర్నీ అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో పాటు తమిళంలో ఫ్లాష్ బ్యాక్ మూవీలో అనసూయ నటిస్తోంది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!