యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు యూత్‌లో ఏ స్థాయి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్ ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సక్సెస్‌తో స్టార్ హీరోల స్థాయికి ఎదిగాడు. అయితే గత కాలంగా ఇండస్ట్రీలో విజయ్‌కు కలిసిరావడం లేదు. అతడు చేసిన గత మూడు చిత్రాలు ‘లైగర్’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్దగా దారుణంగా విఫలమయ్యాయి. దీంతో ప్రస్తుతం అతడు చేస్తున్న ‘VD12’ చిత్రంపై విజయ్‌తో పాటు అతడి ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ సెట్ నుంచి ఓ ఫొటో లీకైంది. ఇందులో విజయ్ దేవరకొండ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
విజయ్ పిక్ వైరల్!
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘VD12‘ చిత్రం రూపొందుతోంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో షూటింగ్ సెట్ నుంచి విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇందులో బైక్‌పై వెనక కూర్చుని మాస్ లుక్‌లో కనిపించాడు. తలపై లైట్ హెయిర్, ముఖాన గడ్డంతో మెస్మరైజ్ చేసేలా అతడి లుక్ ఉంది. ఇది చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో సంతోషంతో ఊగిపోతున్నారు. మరో బ్లాక్‌బాస్టర్ లోడింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోను విపరీతంగా షేర్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు.
థియేటర్లు బద్దలే!
‘VD 12’ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ మాస్‌లుక్‌కు అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు తోడైతే ధియేటర్లు బద్దలు కావాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ‘VD 12’లో విజయ్ లుక్ చూస్తుంటే ‘యువ’ సినిమాలో మాధవన్ గుర్తుకు వస్తున్నాడంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్లు సమాచారం. తొలుత ఈ చిత్రానికి శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అనివార్య కారణాలతో ఆమె ప్లేస్‌లో భాగ్యశ్రీని తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె షూటింగ్‌లోనూ పాల్గొంటున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
డ్యుయల్ రోల్‌లో రౌడీ బాయ్!
‘VD 12’ చిత్రంలో విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అస్పష్టంగా ఉన్న ఖాకీ డ్రెస్ పోస్టర్‌ను సైతం అధికారికంగా రిలీజ్ చేసింది. అయితే తాజాగా లీకైన ఫొటోను చూస్తే విజయ్ దేవరకొండ ఊర మాస్ లుక్‌లో కనిపించాడు. ఒక లోకల్ గ్యాంగ్‌స్టర్‌ను తలపించాడు. దీన్ని బట్టి చూస్తే విజయ్ ఈ చిత్రంలో ద్విపాత్రిభినయం చేస్తున్నాడా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. లేదా ఒకే పాత్రను రెండు డైమన్షన్స్‌లో దర్శకుడు చూపించబోతున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా లీకైనా విజయ్ లుక్ చూస్తే థియేటర్‌లో మాస్ జాతర కన్ఫార్మ్ అని స్పష్టమవుతోంది.
క్యూట్ లవ్‌స్టోరీ!
విజయ్ దేవరకొండ ‘VD 12’తో పాటు మరో ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దర్శకుడు రవికిరణ్ కోలా దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ మూవీకి దిల్‌రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. అందమైన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్‌గా సాయిపల్లవి (Sai Pallavi) తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాయిపల్లవిని సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇటీవల టాలీవుడ్‌లో ప్రచారం జరిగింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్