• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Animal Movie Review: యాక్షన్ సీన్లలో రణబీర్‌ ఉగ్రరూపం.. ‘యానిమల్‌’ ఎలా ఉందంటే?

  నటీనటులు: రణబీర్ కపూర్, రష్మికా మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, తృప్తి దిమ్రి, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ తదితరులు

  దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా

  సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

  సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్

  నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతని, ప్రణయ్ రెడ్డి వంగా 

  విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023  

  రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటించారు. ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) తీసిన సందీప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, అంచనాలు పెంచేలా ట్రైలర్‌ ఉండటంతో ‘యానిమల్‌’పై అటు బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ భారీగా హైప్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

  కథ

  దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీ యజమాని అయిన ఆయనకు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్) కుమారుడు. విజయ్ దూకుడు మనస్తత్వం కలవాడు. అయితే తండ్రి అంటే ప్రాణం. కుమారుడి ప్రవర్తన నచ్చక బల్బీర్‌ అతడ్ని బోర్డింగ్ స్కూల్‌కు పంపిస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఓ గొడవ వల్ల తండ్రి కొడుకుల మధ్య మరింత దూరం పెరుగుంది. ఈ క్రమంలోనే విజయ్ అమెరికా వెళ్లిపోతాడు. తండ్రి మీద హత్యాయత్నం జరిగిందని తెలిసి 8 ఏళ్ళ తర్వాత భారత్‌కు వస్తాడు. తండ్రిపై అటాక్ చేసిన వాళ్ళ అంతు చూస్తానని శపథం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? గీతాంజలి (రష్మిక), రణ్ విజయ్ సింగ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? అబ్రార్ (బాబీ డియోల్) ఎవరు? వాళ్ళకు, రణ్ విజయ్ సింగ్ కుటుంబం మధ్య సంబంధం లేదా శత్రుత్వం ఏమిటి? అనేది కథ.

  ఎవరెలా చేశారంటే

  తెరపై పాత్ర మాత్రమే కనిపించేలా నటించే అతి కొద్ది మంది హీరోలలో రణబీర్ కపూర్‌ ఒకరు. రణ్ విజయ్ సింగ్ పాత్రకు అతడు ప్రాణం పోశాడు. టీనేజ్, యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్ ఇలా వివిధ దశల్లో జీవించారు. ప్రేక్షకులను ఆ పాత్రతో పాటు ప్రయాణం చేసేలా అందులో ఒదిగిపోయాడు. అటు గీతాంజలి పాత్రకు రష్మికా మందన్నా న్యాయం చేసింది. రణబీర్, రష్మిక మధ్య వైఫ్ అండ్ హజ్బెండ్ బాండింగ్, పెళ్లి గురించి చెప్పే కొన్ని డైలాగులు అదరహో అనిపిస్తాయి. జోయా పాత్రలో తృప్తి దిమ్రి గ్లామర్‌తో ఆకట్టుకుంది. అటు రణబీర్ తండ్రిగా అనిల్ కపూర్ అదరగొట్టాడు. ఇక రణ్‌బీర్ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన నటుడు బాబీ డియోల్. ఆయన విలన్‌గా కళ్లతోనే భయపెట్టేశారు. రణబీర్ – బాబీ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. 

  డైరెక్షన్ ఎలా ఉందంటే?

  డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ఈ సినిమాతో మరోమారు తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. సోదరిని ర్యాగింగ్‌ చేశారన్న కోపంతో  హీరో గన్‌ పట్టుకొని ఆమె కాలేజీకి వెళ్లే సీన్‌ ఆయన మార్క్‌ యాక్షన్‌కు ఉదాహరణ. ఇలాంటి కొత్త తరహా వైలెన్స్‌ యాక్షన్ సీన్స్‌ సినిమాలో చాలానే ఉన్నాయి. కథలో కొత్త దనం లేకపోయినప్పటికీ తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడంలో డైరెక్టర్‌ ఎటువంటి మెుహమాటాలకు పోలేదు. ముఖ్యంగా రణబీర్‌ – బాబీ డియోల్‌ మధ్య ఫైట్‌ సీన్స్‌ సందీప్‌ వంగా దర్శకత్వం ప్రతిభకు అద్దం పడతాయి. అయితే నిడివి కాస్త ఎక్కువగా ఉండటంతో పాటు కొన్ని సీన్లు మరి సాగదీసినట్లు అనిపిస్తుంది. దీని వల్ల ప్రేక్షకులు అక్కడక్కడ బోర్‌ ఫీలవుతారు.

  టెక్నికల్‌గా 

  సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నేపథ్య సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది.  హర్షవర్ధన్ రామేశ్వర్ తన BGMతో సినిమాకు ప్రాణం పోశారు. హీరోయిజాన్ని తన BGMతో చాలా బాగా ఎలివేట్ చేశారు. కెమెరా వర్క్ టాప్ క్లాస్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.  డైలాగ్స్‌లో సందీప్ రెడ్డి వంగా మార్క్ కనిపించింది. 

  ప్లస్‌ పాయింట్‌

  • రణ్‌బీర్ నటన
  • యాక్షన్‌ సీన్లు
  • నేపథ్య సంగీతం

  మైనస్‌ పాయింట్

  • నిడివి
  • సాగదీత సీన్లు

  రేటింగ్‌ : 4/5

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv