• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Devara: ‘పాతాల భైరవి’ గెటప్‌లో జూ.ఎన్టీఆర్.. తాత స్టైల్‌ను ఫాలో అయ్యింది అందుకేనా? 

    యంగ్‌ టైగర్‌ జూ.ఎన్టీఆర్‌ (Jr NTR)కు తాత నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Rama Rao) అంటే అమితమైన ప్రేమ. తనకు తాత అంటే ఎంత ఇష్టమో ఇప్పటికే చాలా వేదికలపై తారక్‌ వెల్లడించాడు. అటు ఫ్యాన్స్‌ (Jr NTR Fans) కూడా తారక్ అచ్చం వాళ్ల తాత లాగే ఉంటాడని అంటుంటారు. తారక్‌లోని నటనా నైపుణ్యం కూడా తాత నుంచి వచ్చిందేనని వ్యాఖ్యానిస్తుంటారు. ఇదిలా ఉంటే జూ.ఎన్టీఆర్‌కు.. రామారావు చేసిన చిత్రాల్లో ‘పాతాళ భైరవి’ అంటే మహా ఇష్టం. ఈ సినిమాను రీమేక్ చేయాలని కూడా ఓ దశలో తారక్‌ భావించారు. అయితే రీసెంట్‌గా ‘దేవర’ నుంచి విడుదలైన ఫొటోలో తారక్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘పాతాళ భైరవి’లో ఎన్టీఆర్‌లాగా తారక్ ఉన్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

    తాతను దింపేసిన తారక్‌!

    పాతాళ భైరవిలో రామారావు లుక్‌కు.. ‘దేవర’ (Devara)లోని తారక్‌ గెటప్‌ను నందమూరి ఫ్యాన్స్ మ్యాచ్‌ చేసుకుంటున్నారు. పరిశీలనగా చూస్తే అందరికీ ఇదే భావన కలుగుతుందని చెబుతున్నారు. తారక్‌ ‘దేవర’ సినిమాలో డ్యూయల్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఒక పాత్ర రింగుల జుట్టుతో కూడిన లాంగ్‌ హెయిర్‌తో ఉంటుంది. ఈ రోల్‌కు సంబంధించిన ఫొటోనే శుక్రవారం చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఈ గెటప్‌లో తారక్‌ అచ్చం నందమూరి తారకరామారావు లాగా కనిపిస్తున్నాడని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ‘గడ్డం ఒకటే తేడా అని మిగతాదంతా సేమ్‌ టూ సేమ్‌’ అంటూ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) డైలాగ్‌ను కామెంట్స్‌ రూపంలో పెడుతున్నారు. 

    పాతాళ భైరవి రీమేక్ ఏమైంది?

    తన తాతకు సంబంధించిన సినిమాను చేయాల్సి వస్తే కచ్చితంగా ‘పాతాల భైరవి’ (Patala Bhairavi) రీమేక్‌ చేస్తానని గతంలో జూ.ఎన్టీఆర్‌ తెలిపాడు. ఇందుకు తగ్గట్లే టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడి ద్వారా ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా అప్పట్లో మెుదలు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ‘పాతాల భైరవి’ చిత్రానికి ఈ రోజుల్లో పెద్దగా ఆదరణ లభించకపోవచ్చని పలువురు పెద్దలు తారక్‌తో అన్నట్లు సమాచారం. ఈ జనరేషన్‌ వారికి ఆ సినిమా పెద్దగా ఎక్కక పోవచ్చని వారు వ్యాఖ్యానించారట. దీని గురించి సమాలోచనల్లో పడ్డ తారక్‌.. చివరికీ వారి మాటలతో ఏకీభవించినట్లు తెలిసింది. అలా ‘పాతాళ భైరవి’ రీమేక్‌ పనులు ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఆగిపోయాయి. అయితే ఆ సినిమాలో తాత గెటప్‌లో కనిపించాలన్న కోరికను ఇన్నాళ్లకు తారక్‌.. ‘దేవర’ రూపంలో తీర్చుకున్నట్లు తెలుస్తోంది. 

    రామారావు గెటప్‌లో తారక్‌!

    దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘యమదొంగ’ (Yamadonga) సినిమాలో ఓ సీన్‌లో తారక్‌ (Jr NTR) అచ్చం తన తాత లాగే కనిపిస్తాడు. ముఖ్యంగా జూనియర్‌ యమ గెటప్‌లో.. గతంలో ఎన్టీఆర్‌ చెప్పిన ‘ఏమంటివి ఏమంటివి’ డైలాగ్‌ను చాలా అద్భుతంగా చెబుతాడు. నిమిషం పాటు ఉండే ఆ డైలాగ్‌ను అచ్చం రామారావు లాగా గుక్క తిప్పుకోకుండా చెప్పి ఎన్టీఆర్‌ అందరి చేత శభాష్‌ అనిపించుకున్నాడు. నటనలోనే కాదు డైలాగ్‌ డెలివరీలోనూ తాతకు తగ్గ వారసుడ్ని అని నిరూపించుకున్నాడు. అప్పట్లో ఈ డైలాగ్‌.. టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. రామారావు, తారక్‌ చెప్పిన డైలాగ్‌ను సరిపోలుస్తూ వచ్చిన ఈ వీడియోపై ఓ లుక్కేయండి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv