సినీ హీరోలు రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నారంటే జనాలకు ఎక్కువ ఆసక్తి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను ప్రతిబింబించేలా చెప్పే డైలాగులు, సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. మహేశ్ బాబు లాంటి స్టార్ హీరో ముఖ్యమంత్రి పాత్రలో మెప్పించిన చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమా వచ్చి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ క్రమంలో వెండితెరపై ఏ హీరోలు ముఖ్యమంత్రి రోల్స్ చేశారో ఓ సారీ చూద్దాం.
ఒకే ఒక్కడు
దర్శకుడు శంకర్, అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఒకే ఒక్కడు. ఇందులో హీరో అనుకోకుండా ఒక్క రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు. ఉన్న సమయంలోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజలను మెప్పిస్తాడు. ఈ కోణంలో తెరకెక్కించిన సినిమా అప్పట్లో సంచలన సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు 100 రోజులు ఆడింది సినిమా. ఈ కథను మెుదట రజినీకాంత్, కమల్ హాసన్‌కు వినిపించినా వాళ్లు బిజీగా ఉండటంతో అర్జున్‌తో తెరకెక్కించినట్లు చెప్పాడు శంకర్.
భరత్ అనే నేను
పక్కా కమర్షియల్ మాస్ రోల్స్ చేసే మహేశ్ బాబు.. భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రిగా నటించి మెప్పించాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ కొట్టింది. నేటికి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ పవర్‌ఫుల్ రోల్‌లో సూపర్ స్టార్ చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి. చాలామందికి స్ఫూర్తి కలిగించాయి. సినిమాను నిర్మించేందుకు రూ. 65 కోట్లు ఖర్చు చేయగా…రూ. 225 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. ఇందులో I Don’t know అనే పాటను బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ పాడాడు. అంతేకాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు.
లీడర్
దగ్గుపాటి రానా ఏకంగా మెుదటి సినిమాతోనే ప్రయోగం చేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ చిత్రంలో సీఎం రోల్‌లో మెరిశాడు రానా. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తండ్రి మరణానంతరం సీఎం అయిన కుమారుడు.. అవినీతి నిర్మూలన దిశగా ఎలా అడుగులు వేశాడనే కథతో సినిమా తెరకెక్కించారు. సినిమా కథ దాదాపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌కు సంబంధించిలా కనిపిస్తుంది. కానీ, కొద్దిపాటి మార్పులు చేశారని అప్పట్లో టాక్ నడిచింది. రూ. 9 కోట్లతో తెరకెక్కించగా… రూ. 16 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి.
నేనే రాజు నేనే మంత్రి
విలక్షణ చిత్రాల దర్శకుడు తేజ తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా మరోసారి రాజకీయ నాయకుడిగా కనిపించాడు. వడ్డీ వ్యాపారిగా జీవితం ప్రారంభించి ఎమ్మెల్యేగా ఎదిగి సీఎంలా ఎలా అయ్యాడనే పవర్‌ఫుల్ కథతో సినిమా తీశారు. రూ. 12 కోట్లతో నిర్మించగా.. రూ. 45 కోట్లు వసూళ్లు చేసింది. సినిమా కథను చెప్పేందుకు వెళ్లినప్పుడు జరిగిన ఆసక్తికర విషయాన్ని తేజ పంచుకున్నాడు. కథలో మార్పులు చేయమంటే ఇటే వెళ్లిపోతానని డోర్ దగ్గర నిల్చుని చెప్పినట్లు వెల్లడించాడు.
నోటా
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి ప్రేమకథా చిత్రాల్లో నటించిన విజయ్ దేవరకొండ…కెరీర్ తొలి నాళ్లలోనే ముఖ్యమంత్రి పాత్రలో నటించాడు. నోటా సినిమా ద్వారా సీఎంగా తన నటనను చూపించాడు. అయితే, సినిమా పెద్దగా ఆడలేదు. కానీ, రూ. 12 కోట్లతో నిర్మించామని.. రూ. 25 కోట్లు వసూళ్లు సాధించామని నిర్మాత చెప్పారు. వెట్టాట్టమ్ అనే నవల ఆధారంగా చిత్రాన్ని రూపొందించారు.
కథానాయకుడు
ఎన్టీఆర్ బయోపిక్ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కథానాయకుడు. ఇందులో బాలకృష్ణ సీఎంగా కనిపించారు. నిజ జీవితంలో నందమూరి తారకరామ రావు ముఖ్యమంత్రి జీవితంలో జరిగిన సంఘటనల్లో అచ్చుగుద్దినట్లుగా నటించారు. కానీ, సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. రూ.50 కోట్లు పెట్టి తీశారు. రూ. 70. కోట్లు వచ్చాయి. బాలకృష్ణ సహానిర్మాతగా వ్యవహరించారు.
యాత్ర
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం యాత్ర. మళయాలం నటుడు మమ్ముట్టి ఇందులో లీడ్ రోల్ పోషించాడు. వైఎస్ పాదయాత్ర, పథకాల ఆలోచనకు మూలం ఏంటి? సీఎంగా ఎలాంటి పనులు చేశారు? ఇలా వివిధ అంశాలను ప్రస్తావిస్తూ తీర్చిదిద్దారు. వైఎస్ క్యారెక్టర్‌లో మమ్ముట్టి జీవించారు. ఆయన నటకు మంచి మార్కులు పడ్డాయి. రూ. 12 కోట్లు పెట్టి తీస్తే ఏకంగా రూ. 40 కోట్ల వసూళ్లు సాధించింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!