ఈ ఏడాది టాలీవుడ్లో పదుల సంఖ్యలో సినిమాలు, వందల సంఖ్యలో పాటలు విడుదలై తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కొన్ని తెలుగు పాటలు జాతీయస్థాయిలో ట్రెండింగ్‌లో నిలిచాయి. యూట్యూబ్‌ను షేక్ చేస్తూ అత్యధిక ఆదరణను సంపాదించాయి. 2023లో శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్న పాటలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
మా బావ మనోభావాలు..
ఈ ఏడాది తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించిన ఐటెం సాంగ్.. ‘మా బావ మనోభావాలు..’. వీరసింహారెడ్డి సినిమాలోని ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. ఈ సాంగ్‌లో బాలయ్య ఇద్దరు హీరోయిన్లతో స్టెప్పులేసి అదరగొట్టారు. సాహితి, యామిని, రేణు కుమార్ ఆలపించిన ఈ పాటను రామ జోగయ్యశాస్త్రి రాశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
‘బేబీ’ చిత్రం ఈ ఏడాది ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ పాట గుండెల్ని పిండేస్తుంది. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సాంగ్.. యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలను పొందింది.
మాస్టారు మాస్టారు
ధనుష్ హీరోగా రూపొందిన ‘సార్’ చిత్రం.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలోని ‘మాస్టారు మాస్టారు’ సాంగ్ సంగీత ప్రియులను కట్టిపడేసింది. ఈ పాటను ప్రముఖ కన్నడ గాయని శ్వేతా మోహన్ ఆలపించారు.
పొట్టిపిల్ల
జబర్దస్త్ వేణు డైరెక్ట్ చేసిన ‘బలగం’ సినిమాలోని ‘పొట్టిపిల్ల’ సాంగ్ ఈ ఏడాది బాగా వినిపించింది. చాలా ఫంక్షన్లు, యూత్ ఈవెంట్లలో మారుమోగింది. ముఖ్యంగా యువత ఈ పాటపై రీల్స్ చేసుకొని షేర్ చేసుకున్నారు. పొట్టిపిల్ల పాటను సింగర్ రామ్ మిరియాల ఆలపించారు.
చంకీల అంగీలేసి
హీరో నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘దసరా’. ఈ సినిమాలోని ‘చంకీల అంగిలేసి’ అప్పట్లో విపరీతంగా ట్రెండింగ్ అయ్యింది. ప్రతి ఒక్కరు ఈ పాటకు పెద్ద ఎత్తున రీల్స్ చేసి సందడి చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం ఈ పాటపై అద్భుత రీల్స్ చేసి అలరించారు.
నచ్చావులే నచ్చావులే
సాయిధరమ్ తేజ్, సంయుక్త జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. ఈ సినిమాతో పాటే ఇందులోని ‘నచ్చావులే నచ్చావులే’ సాంగ్ మంచి ఆదరణను సంపాదించింది. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను కార్తిక్ ఆలపించగా.. అజనీశ్ లోక్‌నాథ్ స్వరపరిచారు.
ఆరాథ్య
విజయ్ దేవరకొండ, సమంత జంటగా చేసిన చిత్రం ‘ఖుషీ’. ఈ సినిమాలోని అన్ని పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఆరాథ్య’ సాంగ్ యూత్‌కు మరింత బాగా కనెక్ట్ అయ్యింది. చాలా మందికి ఫేవరేట్ సాంగ్‌గా మారిపోయింది. యూట్యూబ్‌లోనూ అధిక వీక్షణలు పొందింది.
సమ్మోహనుడా..
రూల్స్ రంజన్ సినిమాలోని ‘సమ్మోహనుడా’ సాంగ్ ఈ ఏడాది సోషల్ మీడియాను షేక్ చేసింది. అమ్రిష్ ఇచ్చిన ట్యూన్.. శ్రీయా గోషల్ వాయిస్ అందర్నీ కట్టిపడేసింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గానూ నిలిచింది. సాంగ్ రిలీజ్ అనంతరం ట్రెండ్ అయిన పది రీల్స్‌లో ఐదు ఈ పాటకు సంబంధించినవే కావడం విశేషం.
నిజమే నే చెబుతున్నా
ఊరి పేరు భైరవకోన సినిమాలోని ‘నిజమే నే చెబుతున్నా’ సాంగ్ యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తోంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యాన్ని సమకూర్చారు.
జమల్ జమాలో
యానిమల్ సినిమాలోని ‘జమల్ జమాలో’ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన పదిహేను గంటల్లోనే ఏడు మిలియన్లకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. జమల్ జమాలో పాట నిజానికి ఒక ఇరాన్ సాంగ్. ఈ పాటను ఇరానియన్ కవి బిజాన్ సమాందర్ రాశారు. 1958లో ఈ పాట వెలుగులోకి వచ్చింది. అప్పటినుంచి ఇరాన్లో పెళ్లి వేడుకలతో పాటు ఇతర పంక్షన్స్‌లో ఈ పాట తప్పకుండా ఉండటం ఆనవాయితీగా వస్తోంది.