నటీనటులు : అన్య టేలర్, క్రిస్ హెమ్స్‌వర్త్, టామ్ బుర్కె, అలైలా బ్రౌనీ, జాన్ హౌవర్డ్, ల్యాచీ హుల్మే, అంగుస్ శాంప్సన్ తదితరులు
డైరెక్టర్ : జార్జ్ మిల్లర్
సంగీతం : జుంకీ ఎక్స్ఎల్
సినిమాటోగ్రాఫర్ : సైమన్ డుగ్గాన్
ఎడిటర్ : మార్గరేట్ సిక్సెల్
నిర్మాత: డౌగ్ మిచెల్
గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హాలీవుడ్ చిత్రం ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా’ (Furiosa: A Mad Max Saga Review In Telugu). 2015లో వచ్చిన ‘మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’.. యాక్షన్ సినిమాల్లో బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఇప్పుడు దానికి ప్రీక్వెల్‌గా రూపొందిన మూవీ కావడంతో భారత్ సహా వరల్డ్ వైడ్‌గా బజ్ ఏర్పడింది. తొలి భాగంలో ఆమె సిటాడెల్ రాజు దగ్గర నుంచి తప్పించుకోవడం చూపించారు. అయితే ఈ ప్రీక్వెల్‌లో ఆమె బాల్యం? సిడాడెల్ రాజు వద్దకు ఎలా వచ్చింది? అందుకు కారణం ఎవరు? వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది చూపించారు. ‘థోర్’, ‘ఎక్స్ట్రాక్షన్’ లాంటి చిత్రాలతో భారత ఆడియన్స్‌కు దగ్గరైన క్రిస్ హెమ్స్‌వర్త్ ఇందులో విలన్ పాత్ర పోషిస్తుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
భూమి సారం కోల్పోయి ఎడారిగా మారే కాలంలో కథ జరుగుతుంటుంది. తల్లి మేరి (చార్లీ ఫ్రేజర్)తో ఉన్న ఫ్యూరియోసా (అన్య టేలర్)ను ఓ బైకర్ యంగ్ ఎత్తుకుపోతుంది. వెతుక్కుంటూ వచ్చిన మేరీని ఆ ముఠా లీడర్ డెమంటస్ (క్రిస్ హెమ్స్‌వర్త్).. ఫ్యూరియోసా కళ్ల ముందే దారుణంగా హత్య చేస్తాడు. ఆపై ఆమెను సంధిలో భాగంగా సిటాడెల్ రాజుకు ఇచ్చేస్తాడు. రాజు నుంచి తప్పించుకున్న ఫ్యూరియోసా మగ వేషం ధరించి ఓ కారణం చేత సిటాడెల్ సైన్యాధికారికి కుడి భుజంగా మారుతుంది. ఫ్యూరియోసా కథ చివరికి ఏమైంది? తన తల్లిని చంపిన డెమెంటస్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? ఎడారిలోనూ పండగల విత్తనం ఆమె చేతికి ఎలా వచ్చింది? దాంతో ఆమె ఏం చేసింది? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
చిన్నప్పటి ఫ్యూరియోసాగా (Furiosa: A Mad Max Saga Review In Telugu) అలైలా బ్రౌనీ, పెద్దయ్యాక ఫ్యూరియోసాగా అన్యా టేలర్ అద్భుతంగా చేశారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో అన్యా టేలర్ ఇరగదీసింది. మగవారికి ఏమాత్రం తీసిపోని విధంగా యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. ఇక ప్రతినాయకుడు డెమెంటస్ పాత్రలో క్రిస్ హెమ్స్‌వర్త్ జీవించాడు. ఇప్పటివరకూ హీరోగానే పరియం ఉన్న అతడు విలన్‌గానూ తన మార్క్ ఏంటో చూపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డైరెక్టర్ జార్జ్ మిల్లర్ మంచి థ్రియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఒక ఫ్యూచరిస్టిక్ సినిమాను చూస్తున్న అనుభూతిని కలిగించాడు. ముఖ్యంగా యాక్షన్స్ సీక్వెన్స్‌ను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించాడు డైరెక్టర్. పెద్దగా ల్యాగ్ లేకుండా సినిమా మెుదలైన 10 నిమిషాలకే ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లాడు. ఫ్యూరియోసాను డెమెంటస్ గ్యాంగ్ ఎత్తుకుపోవడం, ఆమె తల్లిని చంపడం, ఫ్యూరియోసా ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరడం ఇలా కథ ఇంట్రస్టింగ్‌గా సాగుతుంది. హీరోగా అందరికీ పరిచయమైన క్రిస్ హెమ్స్‌వర్త్‌ను ఈవిల్ వెర్షన్లో చూపించి డైరెక్టర్ ఆకట్టుకున్నాడు. అయితే యాక్షన్ సీన్లు మరీ లెంతీగా ఉండటం, ఎడారిలో వచ్చే క్లైమాక్స్ ఛేజ్కు ఎక్కువ సమయం తీసుకోవడం కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. వాటిని కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ వస్తుంది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Furiosa: A Mad Max Saga Review In Telugu).. ప్రతీ విభాగం అద్భుత పనితీరు కనబరిచింది. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ సైమన్ డుగ్గాన్ పనితనాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఫ్యూచరిక్ విజువల్ వండర్‌గా ఆయన మూవీని తీర్చిదిద్దాడు. నేపథ్య సంగీతం కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్‌ను చాలా బాగా ఎలివేట్ చేసింది. గ్రాఫిక్స్ టీమ్ పనితీరు కూడా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- అన్య టేలర్, క్రిస్ హెమ్స్‌వర్త్ నటన
- యాక్షన్ సీక్వెన్స్
- సాంకేతిక విభాగం
మైనస్ పాయింట్స్
- సాగదీత సీన్స్
- ఎడిటింగ్