నటీనటులు: కార్తికేయ, ఐశ్వర్య మీనన్, రాహుల్ హరిదాస్, తనికెళ్ళ భరణి, రవి శంకర్ తదితరులు
దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి
సంగీత దర్శకుడు: రధన్, కపిల్ కుమార్ జమ్ముల
సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్
ఎడిటింగ్: జి.సత్య
నిర్మాణ సంస్థ : యూవీ క్రియేషన్స్
విడుదల తేదీ : మే 31, 2024
యంగ్ హీరో కార్తికేయ (Karthikeya) నటించిన లేటెస్ట్ చిత్రం ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam). ప్రశాంత్‌రెడ్డి చంద్రపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా చేసింది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్, టీజర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. ఇందులో కార్తికేయ నటన సినిమాపై అంచనాలు పెంచింది. మరి మే 31న విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది? ప్రేక్షకులని ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి
తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్ టైసన్)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్ విలన్ గ్యాంగ్ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్ ఐశ్వర్య మీనన్‌తో అతడి లవ్ ట్రాక్ ఏంటి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
యంగ్ హీరో కార్తికేయ తనదైన నటనతో అదరగొట్టాడు. బాధ, ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. యాక్షన్స్ సీక్వెన్స్‌లలోనూ మెప్పించాడు. ఇక హీరోయిన్ ఐశ్వర్య మీనన్‌కు నటన పరంగా పెద్దగా స్కోప్ లభించలేదు. స్క్రీన్‌పై కనిపించినంత సేపు తన గ్లామర్‌తో ఏదోలా నెట్టుకొచ్చింది. అటు సోదరుడి పాత్రలో రాహుల్ టైసన్ మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. విలన్ పాత్రలో బొమ్మాళి రవిశంకర్ ఎప్పటిలాగే తన మార్క్ ఏంటో చూపించాడు. తనికెళ్ల భరణి సహా మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి.. తొలి చిత్రంతోనే తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. ఒక సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా మూవీని తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. హీరో లాకప్‌లో ఉండే సీన్‌తో మూవీని మెుదలు పెట్టిన డైరెక్టర్.. డిఫరెంట్‌గా ఫ్లాష్‌బ్యాక్‌లో కథను నడిపించారు. స్టోరీ సెటప్ కోసం ఫస్టాప్‌ను ఉపయోగించుకున్న అతడు.. ఇంటర్వెల్‌కు ఇచ్చిన బిగ్ ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని రగిలించారు. అక్కడ నుంచి ఏమాత్రం ఫ్లో మిస్ కాకుండా క్లైమాక్స్ వరకూ ఇంట్రస్టింగ్‌గా కథను నడిపించి ఆకట్టుకున్నాడు. అయితే క్లైమాక్స్‌ను రెగ్యులర్ కమర్షియల్ ఫార్మెట్లో ముగించడం కాస్త ఆసంతృప్తిగా అనిపిస్తుంది. మరోవైపు హీరో హీరోయిన్ లవ్‌ట్రాక్ కూడా రొటీన్‌గా ఉంటుంది. కెమెస్ట్రీ అసలు వర్కౌట్ కాలేదు. కొన్ని లాజికల్ ఎర్రర్స్‌ను మినహాయిస్తే ‘భజే వాయు వేగం’ తప్పకుండా థ్రిల్ చేస్తుంది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కపిల్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు.. యాక్షన్ సీక్వెన్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. రాధన్ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆర్.డి రాజశేఖర్ కెమెరా పనితనం మెపిస్తుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- కార్తికేయ నటన
- ఇంటర్వెల్ ట్విస్ట్
- సెకండాఫ్
మైనస్ పాయింట్
- హీరో హీరోయిన్ లవ్‌ట్రాక్
- రొటిన్ క్లైమాక్స్