టాలీవుడ్ భామ శ్రీలీల సినిమా కెరీర్ టాప్‌లో దూసుకుపోతోంది. నటన, గ్లామర్, డ్యాన్స్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. స్టార్ హీరోల సరసన చేసే గోల్డెన్ ఛాన్స్‌లను దక్కించుకుంది.
ప్రస్తుతం ఈ భామ వరుసగా 9 సినిమాలకు ఓకే చెప్పింది. వీటిలో బాలయ్య, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, విజయ్ దేవర కొండ, రామ్ పోతినేని వంటి బడా హీరోల చిత్రాలు ఉన్నాయి.
మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో పాటు నితిన్‌తోనూ శ్రీలీల జోడి కడుతోంది. అలాగే ‘అనగనగా ఒక రోజు’ అనే చిన్న బడ్జెట్ సినిమాలోనూ నటిస్తోంది.
ఇటీవల వచ్చిన ‘ధమాకా’ చిత్రం శ్రీలీల కెరీర్‌ను మలుపు తిప్పిందని చెప్పొచ్చు. ఇందులో శ్రీలీల నటన, డ్యాన్స్ చూసిన తెలుగు ఆడియన్స్ ఆమెకు ఫిదా అయిపోయారు. ఇది గమనించిన టాలీవుడ్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు శ్రీలీల వద్దకూ క్యూ కడుతున్నారు.
2001 జూన్ 14న అమెరికాలో శ్రీలీల జన్మించింది. విద్యాభ్యాసం అంతా బెంగళూరులోనే జరిగింది. శ్రీలీల తల్లి గైనకాలజిస్టుగా పనిచేస్తోంది.
2019 లో వచ్చిన ‘కిస్’ అనే కన్నడ సినిమాతో శ్రీలీల సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో పాటు శ్రీలీలకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్న శ్రీలీల.. కిస్ సినిమాకు గాను బెస్ట్ డెబ్యూట్ హీరోయిన్‌గా సైమా అవార్డ్స్ అందుకుంది. అటు తెలుగులో రిలీజైన పెళ్లి సందD సినిమాకు కూడా మోస్ట్ ప్రామిసింగ్ న్యూకమర్ పురస్కారం సొంతం చేసుకుంది.
ప్రస్తుతం శ్రీలీల ఒప్పుకున్న స్టార్ హీరోల సినిమాలు ఘన విజయం సాధిస్తే ఆమె కెరీర్‌కు ఇక తిరుగుండదని చెప్పొచ్చు. తెలుగులోని అగ్రకథనాయకుల సరసన శ్రీలీల చేరిపోవడం గ్యారంటీ.
ఓ వైపు బిజీబిజీగా సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ శ్రీలీల యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
సోషల్ మీడియాలో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మంది ఫాలోవర్లను శ్రీలీల సంపాదించుకుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 1.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!