Adipurush: అమీర్‌ఖాన్‌ను ఢీకొట్టే మెునగాడు ప్రభాస్‌ ఒక్కడేనా.. దంగల్‌ రూ.2200 కోట్ల రికార్డు ఫసక్?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Adipurush: అమీర్‌ఖాన్‌ను ఢీకొట్టే మెునగాడు ప్రభాస్‌ ఒక్కడేనా.. దంగల్‌ రూ.2200 కోట్ల రికార్డు ఫసక్?

    Adipurush: అమీర్‌ఖాన్‌ను ఢీకొట్టే మెునగాడు ప్రభాస్‌ ఒక్కడేనా.. దంగల్‌ రూ.2200 కోట్ల రికార్డు ఫసక్?

    May 11, 2023

    దేశంలో ‘ఆదిపురుష్‌’ మేనియా ప్రారంభమైంది. ఇటీవల విడుదలైన ఆదిపురుష్‌ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కడంతో పాటు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ శ్రీరాముడిగా కనిపిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాయి. ఆదిపురుష్‌ రిలీజైతే అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఇప్పటినుంచే సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రూ.2000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన దంగల్‌ను వెనక్కి నెడుతుందని జోస్యం చెబుతున్నారు. మరీ ఆదిపురుష్‌ నిజంగానే దంగల్‌ కలెక్షన్స్‌ను బీట్‌ చేస్తుందా? ఆదిపురుష్‌కు ఉన్న ప్రతికూల, అనుకూల పరిస్థితులు లేంటి? ఈ YouSay ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

    ఆదిపురుష్‌ బడ్జెట్‌

    ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిపురుష్‌ చిత్రానికి సుమారు రూ.700 కోట్లు ఖర్చు చేసినట్లు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తొలుత ఈ సినిమా బడ్జెట్‌ను రూ.550 కోట్లుగా అంచనా వేశారు. అయితే టీజర్‌ రిలీజయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీజర్‌లోని VFX కార్టూన్‌ను తలపిస్తున్నాయని పెద్ద ఎత్తున కామెంట్లు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన మేకర్స్‌ సినిమాలోని VFX ఎఫెక్ట్స్‌ను మళ్లీ రీ ఎడిటింగ్‌ చేయించారు. ఇందుకోసం ఏకంగా రూ.150 కోట్లను ఖర్చు చేశారు. ఫలితంగా ఆదిపురుష్‌ బడ్జెట్‌ రూ.700కు పెరిగిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బాహుబలి, RRR, పఠాన్‌ వంటి భారీ బడ్జెట్‌ సినిమాలకు మించి ఆదిపురుష్‌కు ఖర్చు చేసినట్లు పేర్కొన్నాయి. దీంతో దేశంలో అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రంగా ‘ఆదిపురుష్‌’ నిలిచింది. 

    పెట్టుబడికి ఢోకా లేదు

    ఆదిపురుష్‌కు పెట్టిన బడ్జెట్‌ కచ్చితంగా తిరిగి వచ్చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌, డిజిటల్‌ రైట్స్‌ ద్వారానే బడ్జెట్‌ మెుత్తం వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం వారి ఫోకస్ ఆదిపురుష్‌ ఏ మేర రికార్డులను బద్దలు కొడుతుందన్న దానిపై ఉందని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే రామాయణం కథ యావత్‌ దేశానికి తెలిసిందే. అయినప్పటికీ రాముడు ఆధారంగా వస్తున్న సినిమాలంటే ప్రతీ ఒక్కరిలో ఎనలేని ఆసక్తి ఉంటుంది. దానిని ఏమేర నిలబెట్టుకుంటారన్న దానిపై ఆదిపురుష్‌ కలెక్షన్స్‌ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఆదిపురుష్‌ టీమ్‌ ఇంకా ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టినట్లు కనిపించడం లేదు. సినిమాను ప్రతీ ఒక్కరికీ చేరువ చేయడంలో ప్రమోషన్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో ఇకనైన ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 

    దంగల్‌ VS ఆదిపురుష్‌

    దేశంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా అమీర్‌ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ నిలిచింది. వికీపీడియా ఇచ్చిన సమాచారం మేరకు ఈ చిత్రం రూ.1,968 – 2,200 కోట్లు వసూలు చేసింది. ఆ రికార్డును బ్రేక్‌ చేయాలంటే ఆదిపురుష్‌ పెద్ద సవాలేనని చెప్పొచ్చు. ఎందుకంటే దంగల్‌.. చైనా, హాంకాంగ్‌, మలేషియా, UAE, బ్రిటన్‌, అమెరికా దేశాల్లోనూ రిలీజై కాసుల వర్షం కురిపించింది. మరీ ఆ స్థాయిలో ఆదిపురుష్‌ మెప్పిస్తుందా అన్నది సందేహమే. అయితే ఆదిపురుష్‌ కథ యూనివర్సల్‌ సబ్జెట్‌ కావడం సినిమాకు కలిసిరానుంది. రామాయణం ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమే. కాబట్టి ఆదిపురుష్‌ను సరిగ్గా ప్రమోట్‌ చేసి, మార్కెటింగ్ చేయాలి. ఆదిపురుష్‌పై విదేశీయుల్లో ఆసక్తిని రగిలించాలి. మేకర్స్‌ అలా చేయగలిగితే భారీ వసూళ్లను రాబట్టవచ్చు. దంగల్‌ కలెక్షన్స్‌ను బీట్‌ చేసి రూ.2000 కోట్ల క్లబ్‌లో ఆదిపురుష్‌ను నిలపొచ్చు. అంతేగాక భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ఇదోక చక్కని అవకాశంగా మారనుంది. ఇక ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌కు సినిమా హిట్‌ టాక్‌ తోడైతే ఆదిపురుష్‌ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహాం లేదు. 

    రిలీజ్ ఎప్పుడంటే?

    ప్రభాస్ రాఘవుడిగా చేసిన ఆదిపురుష్‌ సినిమాకు ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ నటి కృతిసనన్‌ సీతగా నటించింది. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమాన్‌గా దేవదత్త నాగే కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ఆది పురుష్‌’ జూన్‌ 16న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. భూషణ్‌కుమార్‌, కృష్ణకుమార్‌, వంశీ, ప్రమోద్‌, ఓంరౌత్‌ నిర్మించారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version