అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల సమయంలో వైకాపా నేతకు బన్నీ మద్దతు తెలిపినప్పటి నుంచి ఈ వార్తలు ఊపందుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అయితే ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ హాజరవుతారన్న వార్తల నేపథ్యంలో ఈ వార్‌కు కాస్త బ్రేక్ పడినట్లు కనిపించింది. అయితే మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా చేసిన కామెంట్స్‌తో మరోమారు అల్లు వర్సెస్ మెగా వివాదం తెరపైకి వచ్చింది. సమసిపోతుందనుకుంటున్న ఈ సోషల్ మీడియా వార్‌కు అతడి వ్యాఖ్యలు అగ్గిరాజేసేలా చేసింది.
వరుణ్ ఏమన్నారంటే..
మెగా హీరో వరుణ్ తేజ్- మీనాక్షి చౌదరి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మట్కా‘. డైరెక్టర్ కరుణకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నవంబర్ 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో మూవీటీమ్ ప్రమోషన్స్‌లో విశాఖలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. అక్కడ వేదికపై మాట్లాడిన వరుణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. మట్కా గురించి రిజల్ట్‌పై టెన్షన్ పడుతున్న క్రమంలో తన అన్న రామ్‌చరణ్ నుంచి ఫోన్ వచ్చినట్లు వరుణ్ తెలిపాడు. చరణ్ 10 మాటలు చెప్పాల్సిన పనిలేదని, పక్కన కూర్చొని భుజంపై చేయి వేస్తే అదే రూ.100 కోట్లకు సమానమని అన్నాడు. ‘ఎప్పుడూ కుటుంబం గురించే మాట్లాడతా అని అనుకోవచ్చు. జీవితంలో మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన వెనకాల ఎవరున్నారన్నది మర్చిపోతే ఆ విజయం దేనికీ పనికి రాదు. మా పెదనాన్న, బాబాయ్, మా నాన్న నా వెనకాల ఉన్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
బన్నీకి ఇండైరెక్ట్ పంచ్..!
వరుణ్ తేజ్ తన తాజా కామెంట్స్ ద్వారా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండైరెక్ట్ పంచ్ ఇచ్చాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో ‘చెప్పను బ్రదర్’ అంటూ పవన్ గురించి బన్నీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలో తన ప్రతీ సినిమా ఈవెంట్‌లో బన్నీ మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. అయితే తనకంటూ స్టార్‌డమ్ వచ్చాక బన్నీ వారి గురించి మాట్లాడేందుకు ఇష్టపడటం లేదన్న విమర్స మెగా ఫ్యాన్స్‌లో ఉంది. ఏపీ ఎన్నికల సమయంలో ఇది తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. కొద్ది కాలం క్రితం మారుతీనగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన బన్నీ ‘తనకు నచ్చితేనే వస్తా’ అంటూ వ్యాఖ్యానించారు. మెగా ఫ్యాన్స్‌ను సెపరేట్ చేస్తూ అల్లు ఆర్మీ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐ లవ్ యూ అంటూ తన ఫ్యాన్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
సోషల్ మీడియాలో బిగ్ వార్!
వరుణ్ తేజ్ వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్ మరోమారు సోషల్ మీడియా వేదికగా దాడి చేసుకుంటున్నారు. ఎంత ఎత్తు ఎదిగినా మూలాలు మర్చిపోకూడదని వరుణ్ తేజ్ చెప్పకనే చెప్పాడని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ‘కుక్కకాటుకు చెప్ప దెబ్బ’ అన్న సామెతను కూడా ప్రయోగిస్తున్నారు. మరోవైపు బన్నీ ఫ్యాన్స్ సైతం వరుణ్ తేజ్, మెగా ఫ్యాన్స్‌కు దీటుగా బదులిస్తున్నారు. బన్నీలా సక్సెస్ అయ్యి వరుణ్ ఈ మాట చెప్పి ఉంటే బాగుండేదని అంటున్నారు. తన సినిమా రిలీజ్ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌ను కాకా పట్టడం కోసమే వరుణ్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా వరుణ్ లేటెస్ట్ కామెంట్స్ నెట్టింట మరోమారు అల్లు vs మెగా ఫ్యాన్ వార్‌కు ఆజ్యం పోసిందనే చెప్పాలి.
‘పుష్ప 2’ను టార్గెట్ చేసిన మెగా ఫ్యాన్స్!
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందిన ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా కోసం అల్లు అర్మీతో పాటు మెగా ఫ్యాన్స్ సైతం ఎంతగానో ఎదురుచేస్తున్నారు. కానీ, మెగా ఫ్యాన్స్ ఎదురుచూడటానికి ఓ బలమైన కారణం ఉంది. ‘పుష్ప 2’పై ఏమాత్రం నెగిటివ్ టాక్ వచ్చిన సోషల్ మీడియాలో బన్నీని ఓ ఆట ఆడుకోవాలని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఆ సినిమాను బాయ్‌కాట్ చేయడం ద్వారా కలెక్షన్స్ దెబ్బతీయాలని ప్లాన్ చేస్తున్నారట. #Pushpa2boycott అనే హ్యాష్‌ట్యాగ్‌ను సైతం వారు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ‘పుష్ప 2’ సక్సెస్‌ను ఎవరు అడ్డుకోలేరని అల్లు అర్మీ అంటోంది. ఈ నేపథ్యంలో అల్లు, మెగా ఫ్యాన్ వార్ మున్ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ