Amazon Diwali Deals: ల్యాప్‌టాప్స్‌పై దిమ్మతిరిగే ఆఫర్లు.. ఓ లుక్కేయండి! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Amazon Diwali Deals: ల్యాప్‌టాప్స్‌పై దిమ్మతిరిగే ఆఫర్లు.. ఓ లుక్కేయండి! 

    Amazon Diwali Deals: ల్యాప్‌టాప్స్‌పై దిమ్మతిరిగే ఆఫర్లు.. ఓ లుక్కేయండి! 

    November 8, 2023

    దసరా సందర్భంగా ఈ-కామర్స్‌ అమెజాన్‌ తీసుకొచ్చిన ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ (Great Indian Festival) సేల్స్‌ దీపావళి వరకూ కొనసాగుతోంది. ‘ఫినాలే డేస్‌’ (Great Indian Festival Finale Days)పేరుతో నిర్వహిస్తున్న ఈ మెగా సేల్‌ మరో మూడు రోజుల్లో (నవంబర్‌ 10) ముగియనుంది. అయితే కొత్తగా ల్యాప్‌టాప్‌ కొనాలని భావిస్తున్న వారికి ఇదే చివరి ఛాన్స్‌. దాదాపు రూ.70 వేలకు పైగా విలువైన ల్యాప్‌టాప్‌ను అమెజాన్ రూ.50 వేలకే అందిస్తోంది. తక్కువ ధరకే టాప్‌ కంపెనీలు ల్యాప్‌టాప్స్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌ టాప్‌ డీల్స్‌లో భాగమైన ల్యాప్‌టాప్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం. 

    Asus Vivobook 15

    ఈ Asus ల్యాప్‌టాప్‌పై అమెజాన్‌ 35% డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఫలితంగా రూ.76,990 ఉన్న ల్యాప్‌టాప్‌ రూ.49,990లకు అందుబాటులోకి వచ్చింది. ఈ ల్యాప్‌టాప్‌ 15.6 అంగుళాల స్క్రీన్‌, 16GB RAM / 512GB SSD స్టోరేజ్‌, Intel Core i5-12500H ప్రొసెసర్‌, Windows 11 Home ఆపరేటింగ్‌ సిస్టమ్ ఫీచర్లను కలిగి ఉంది.

     Lenovo IdeaPad Slim 

    లెనోవో కంపెనీకి చెందిన ఈ ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ.79,690. కానీ అమెజాన్‌ దీనిని 34% డిస్కౌంట్‌తో రూ.52,990 లకు లభిస్తోంది. 15.6 అంగుళాల స్క్రీన్‌ కలిగిన ఈ ల్యాప్‌టాప్‌ Intel Core i7 11th Gen ప్రొసెసర్‌తో పనిచేస్తుంది. 16GB RAM /512GB SSD స్టోరేజ్‌, Windows 11 Home OSను ఇది కలిగి ఉంది. 

    HP Laptop 15s

    ఈ ల్యాప్‌టాప్‌ కూడా అమెజాన్ ఫినాలే డేస్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. రూ.64,235 అసలు ధర. ఈ ల్యాప్‌టాప్‌ను రూ.48,990లకే అమెజాన్ అందిస్తోంది. 24% డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ HP Laptop 15s ల్యాప్‌టాప్‌.. 15.6 FHD స్క్రీన్‌తో రూపొందింది. 16GB DDR4 RAM / 512GB SSD స్టోరేజ్‌, AMD Radeon Graphics, Ryzen 7 సీపీయూ,  Windows 11 Home ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తదితర ఫీచర్లను కలిగి ఉంది.

    Dell SmartChoice 14 Laptop

    డెల్‌ కంపెనీకి చెందిన ఈ ల్యాప్‌టాప్‌ను కూడా అమెజాన్‌లో తక్కువ ధరకే పొందవచ్చు. ఫెస్టివల్‌ సేల్‌ సందర్భంగా అమెజాన్ దీనిపై 40% రాయితీ ఇస్తోంది. ఫలితంగా ఈ ల్యాప్‌టాప్‌ రూ.49,990 అందుబాటులోకి వచ్చింది. ఇది Intel Core i5-1235U 12th Gen ప్రొసెసర్‌పై పని చేస్తుంది. 8GB DDR4 RAM /512GB SSD స్టోరేజ్‌ను దీనికి అందించారు. Intel UHD Graphicsతో ఇది రానుంది. 

    Acer Aspire Lite

    ఈ ల్యాప్‌టాప్‌ 11th Gen Intel Core Ci7-1165G7 ప్రొసెసర్‌తో వర్క్ చేస్తుంది. Windows 11 Home ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను దీనికి అందించారు. 16GB RAM / 1TB SSD స్టోరేజ్‌ సామర్థ్యాన్ని ల్యాప్‌టాప్‌ కలిగి ఉంది. దీని అసలు ధర రూ.82,990. కానీ అమెజాన్‌ దీనిపై 42% తగ్గింపు ఇస్తోంది. రూ.47,990 లకు ల్యాప్‌టాప్‌ను సేల్ చేస్తోంది. 

    HONOR MagicBook 

    ఈ హానర్‌ ల్యాప్‌టాప్‌పై 40% రాయితీ అందుబాటులో ఉంది. రూ.47,990లకు అమెజాన్‌ దీన్ని విక్రయిస్తోంది. 14 అంగుళాల FHD IPS స్క్రీన్‌, Intel Core i5-12450H 12th Gen ప్రొసెసర్‌, 16GB RAM/ 512GB NVMe SSD స్టోరేజ్‌, Windows 11 Home, 2-in-1 ఫింగర్ ప్రింట్‌ పవర్‌ బటన్‌ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

    ASUS Vivobook 16

    రూ.40 వేల లోపు ల్యాప్‌టాప్‌ను కోరుకునే వారు దీన్ని పరిశీలించవచ్చు. దీని అసలు ధర రూ.55,990. అమెజాన్‌ దీనిపై 29% డిస్కౌంట్ ప్రకటించింది. ఫలితంగా రూ.39,990లకు ఈ ల్యాప్‌టాప్‌ను పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ 16 అంగుళాల FHD+ స్క్రీన్‌, 8GB RAM/512GB SSD స్టోరేజ్‌, Core i3 సీపీయూ, Windows 11 Home ఆపరేటింగ్ సిస్టమ్‌ కలిగి ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version