ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) నిర్వహిస్తున్న ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్’ (Great Indian Festival Finale Days) సేల్‌లో బడ్జెట్ ఫోన్లతో పాటు మిడ్ రేంజ్ మెుబైల్స్‌పై కూడా భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. రూ.15,000-25,000 బడ్జెట్‌లో మంచి ఫోన్ కోసం ఎదురు చూస్తున్న వారికి అమెజాన్ బెస్ట్ డీల్స్‌ను అందుబాటులో ఉంచింది. ప్రముఖ కంపెనీల టాప్ ఫోన్లను భారీ డిస్కౌంట్స్‌తో పొందే వీలును కల్పిస్తోంది. భారీ తగ్గింపుతో అమెజాన్ ఆఫర్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్ ఏవో ఇప్పుడు చూద్దాం.
Samsung Galaxy A14 5G
మిడ్ రేంజ్‌లో శాంసంగ్ ఫోన్ కోరుకునే వారు ‘Galaxy A14 5G’ పరిశీలించవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ. 18,499. కానీ, అమెజాన్.. ఫినాలే డేస్ సేల్‌లో భాగంగా దీనిపై 19% డిస్కౌంట్ ఇస్తోంది. ఫలితంగా ఈ ఫోన్ రూ.14,999 అందుబాటులోకి వచ్చింది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు కొనుగోలుపై అదనంగా రూ. 750 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
Redmi Note 12 5G
ఈ రెడ్‌మీ ఫోన్ కూడా ఫినాలే సేల్‌లో తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ను 20%తో రూ.15,998లకు అమెజాన్ ఆఫర్ చేస్తోంది. దీనిపై అదనంగా రూ.2,000ల వరకూ బ్యాంకు ఆఫర్లను పొందవచ్చు. వీటన్నింటిని కలుపుకొని ఫోన్ ఎఫెక్టివ్ ప్రైస్‌ను రూ.13,999గా అమెజాన్ పేర్కొంది.
iQOO Neo 7 Pro 5G
ఈ ఐకూ మెుబైల్‌ను 18% తగ్గింపుతో రూ.32,999లకు అమెజాన్ ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ ఆఫర్ల కింద అదనంగా రూ.1,500 వరకూ రాయితీ ఇస్తోంది. ఈ ఫోన్ ఎఫెక్టివ్ ప్రైస్ రూ.31,499గా ఉంది.
itel S23+
ఈ ఐటెల్ మెుబైల్ కూడా మంచి డిస్కౌంట్‌తో సేల్ అవుతోంది. 13% తగ్గింపుతో రూ.13,999లకు ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఫోన్ కొనుగోలుపై రూ. 1,199 విలువ గల బడ్స్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఫోన్ ఎఫెక్టివ్ ప్రైస్ రూ. 12,999.
Redmi 10 Power
ఈ రెడ్‌మీ మెుబైల్‌పై అమెజాన్ ఏకంగా 46% డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. రూ.18,999 విలువ గల మెుబైల్‌ను రూ.10,299లకే అందిస్తోంది. అదనపు ఆఫర్లు పోను ఈ మెుబైల్ ఎఫెక్టివ్ ప్రైస్ రూ.9,549గా ఉంటుందని అమెజాన్ పేర్కొంది.
Vivo Y56 5G
ఈ వివో మెుబైల్ 24% రాయితీతో రూ.18,999లకు అందుబాటులోకి వచ్చింది. దీని అసలు ధర రూ.24,999. ఈ ఫోన్‌పై అదనంగా రూ.1,500 వరకూ బ్యాంకు ఆఫర్లు లభిస్తున్నాయి. మిడ్ రేంజ్‌లో మంచి వివో ఫోన్‌ను కోరుకునే వారు Vivo Y56 5G ట్రై చేయవచ్చు.
OPPO F23 5G
ఒప్పో నుంచి కూడా OPPO F23 5G మెుబైల్ భారీ రాయితీతో లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.28,999. అమెజాన్ దీనిని 21% డిస్కౌంట్‌తో రూ.22,999 అందుబాటులో ఉంచింది. ఇతర అదనపు రాయితీలు పోనూ ఈ ఫోన్ ఎఫెక్టివ్ ప్రైస్ రూ. 20,700గా ఉండనుంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం